మెమరీ కార్డ్‌లోని ముఖ్యమైన ఫోటోలు డిలీట్ అయ్యాయా..?

‘కష్టపడి తీసిన ఫోటోలు. అన్నీ కరప్ట్ అయ్యాయి ఇప్పుడు ఏ చేద్దాం..?' ఈ రకమైన నిరుత్సాహం ఫోన్ లేదా కెమెరాలోని ఫోటోలు డిలీట్ అయినపుడు మన మనసులో ఏర్పడుతుంది. అయితే, ప్రతి సమస్యకు ఓ పరిష్కారమనేది ఉంటుంది. మెమరీ కార్డ్‌లో డిలీట్ లేదా కరప్ట్ అయిన ఫోటోలను రికవర్ చేసేందుకు డజన్లు కొలది ఉచిత డేటా రకవరీ సాప్ట్‌వేర్‌లు ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. మీ మెమరీ కార్డ్‌లో పోగొట్టుకున్న డేటా ఫైళ్లను తిరిగి రాబట్టుకునేందుకు ఇలా ప్రయత్నించండి...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

డేటా రకవరీలో భాగంగా మీ వద్ద ఉండాల్సిన ముఖ్యమైన సామాగ్రి:
- మీరు పోగొట్టుకున్న డేటాకు సంబంధించిన మెమెరీ కార్డ్,
- కార్డ్ రీడర్ (మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసేందుకు),
- కంప్యూటర్,
- ఇంటర్నెట్,
- డేటా రకవరీ సాఫ్ట్‌వేర్ (మీరు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి).
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు

స్టెప్ - 1
ముందుగా మెమరీ కార్డ్‌తో కూడిన కార్డ్ రీడర్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
స్టెప్ - 2
మీరు వాడుతున్నది విండోస్ పీసీ అయితే Recuva అనే ఉచిత డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ - 3
పీసీలో సెటప్ కాబడిన రికువా ప్రోగ్రామ్‌ను మౌస్‌తో డబల్ క్లిక్ చేయటం ద్వారా ఓపెన్ చేయండి.

స్టెప్ - 4
ఇప్పుడు ఓపెన్ అయిన రెకువా ప్రోగ్రామ్‌కు సంబంధించి ఓపన్ అయ్యే డ్రాప్‌డౌన్ మెనూలో సంబంధిత మెమరీ కార్డ్ డ్రైవ్‌ను సెలక్ట్ చేసుకుని స్కాన్ బటన్ పై క్లిక్ చేయండి. తద్వారా మెమెరీ కార్డ్ స్కాన్ కాబడుతుంది.
స్టెప్ - 5
స్కాన్‌లో భాగంగా మెమరీ కార్డ్‌లో కరప్ట్ లేదా డిలీట్ అయిన ఫైల్స్ రికవర కాబడతాయి. వాటిని సెలక్ట్ చేసుకుని రికవర్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ డేటా డెస్క్‌టాప్ పై సేవ్ అవుతుంది.


Click it and Unblock the Notifications








