డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

Posted By:

టెక్నాలజీ మరింతగా అప్‌డేట్ అవుతున్నప్పటికి ఓ చిన్న తప్పిదం మీ డేటాను తుడిచిపెట్టేసే ప్రమాదం ముంది. కొన్ని సందర్భాల్లో ఎంతో ముఖ్యమైన డేటాను మనకు తెలియకుండానే పొరపాటున డిలీట్ చేసేస్తుంటాం. మనలో చాలా మంది ముఖ్యమైన డేటాను ఎస్డీ కార్డ్‌లలో భద్రపరచుకుంటుంటాం.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

సెలవు పై ఫేస్‌బుక్ అధినేత, కారణాలేంటి..?
డిజిటల్ కెమెరా ద్వారా షూట్ చేసిన ఫోటోలు, వీడియోలు డివైస్‌లో ఏర్పాటు చేసిన మెమరీ కార్డ్‌లో సేవ్ కాబడతాయి. ఆ మెమరీ కార్డులోని ఫోటోలు లేదా వీడియోలను యూఎస్బీ కనెక్షన్ ఆధారంగా కంప్యూటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం. కెమెరాలోని డేటాను పీసీలోకి ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో పొరపాటున ఒకోసారి ఫోటోలు డిలీట్ అయిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొగొట్టుకున్న ఫోటోలను తిరిగి రికవర్ చేసేకునేందకు ఓ బెస్ట్ సొల్యూషన్ అందుబాటులో ఉంది. అదేంటో చూసేద్దామా మరి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

డేటా రకవరీ‌లో భాగంగా మీ వద్ద ఉండాల్సిన ముఖ్యమైన సామాగ్రి

- మీరు పోగొట్టుకున్న డేటాకు సంబంధించిన మెమెరీ కార్డ్,
- కార్డ్ రీడర్ (మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసేందుకు),
- కంప్యూటర్,
- ఇంటర్నెట్,
- డేటా రకవరీ సాఫ్ట్‌వేర్ (photo rec)

 

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

డిలీట్ అయిన పోటోలను రివకర్ చేసుకునే ప్రాసెస్‌లో సమయం అనేది చాలా ముఖ్యం. ఎస్డీ కార్డ్‌లో డేటా రికవరీ కొద్ది పోర్షన్ మెమరీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఫోటోలు డిలీట్ అయిన తరువాత మీ ఎస్డీకార్డ్‌లో ఏ విధమైన డేటాను అదనంగా యాడ్ చేయకండి. ఇలా చేయటం వల్ల పాత డేటా శాస్వుతంగా డిలీట్ అయ్యే ప్రమాదముంది.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

ఎస్డీ కార్డ్ నుంచి డిలీట్ అయిన డేటాను రికవర్ చేసే క్రమంలో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అవసరం ఉంటుంది. కంప్యూటింగ్ డివైస్ ఏ ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసినా పర్వాలేదు.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

ముందుగా మెమరీ కార్డ్‌తో కూడిన కార్డ్ రీడర్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

ఎస్డీ కార్డ్‌లో డిలీట్ అయిన ఫోటోలను సురక్షితంగా రికవర్ చేసుకునేందుకు photo rec పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. ఈ డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ కాగలిగే ఈ సాఫ్ట్‌వేర్‌ను సలువుగా ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో సెటప్ కాబడిన photo rec సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేయండి. ప్రోగ్రామ్‌‌ మీ ఎస్డీ కార్డ్ ను గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్‌లోని కొన్ని సూచనలను మీరు అనుసరించాల్సి ఉంటుంది.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

ప్రోగ్రామ్ మీ ఎస్డీ కార్డ్‌ను గుర్తించిన వెంటనే డేటా రికవరీ ప్రక్రియ మొదలవుతుంది. ఫోటోలను రికవర్ చేసుకునే క్రమంలో ఫైల్ ఫార్మాట్‌ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత రికవర్ అయ్యే ఫోటోలను ఫోల్డర్ రూపంలో మీ పీసీలో కాపీ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Recover Deleted Pictures From Memory Card. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot