సెలవు పై ఫేస్‌బుక్ అధినేత, కారణాలేంటి..?

Posted By:

త్వరలో తండ్రి కాబోతున్న ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ త్వరలో రెండు నెలల పాటు పితృత్వ సెలవు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మార్క్ తన ఫేస్‌బుక్ పేజీలో శుక్రవారం పోస్ట్ చేసారు. జూకర్‌బర్గ్ సతీమణి ప్రిస్కిల్లా చాన్ త్వరలో ఆడ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

 సెలవు పై ఫేస్‌బుక్ అధినేత, కారణాలేంటి..?

పాప జన్మించిన తరువాత మార్క్ రెండు నెలలు పాటు పితృత్వ సెలవును తీసుకుబోతున్నారు. వర్కింగ్ పేరెంట్స్ తమ నూబోర్న్స్‌తో గడపటం వల్ల కుటుంబం చాలా బాగుంటుందని పలు అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేసాయని మార్క్ అన్నారు. యూఎస్‌లోని తమ ఉద్యోగులకు 4 నెలల పెయిడ్ పితృత్వ సెలవు లేదా ఏడాది పాటు పితృత్వ లీవ్‌ను తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని మార్క్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్, వాట్సాప్‌లదే హవా..

ఫేస్‌బుక్‌తో ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే చాలు, మనకు తెలియకుండానే ఆ సామాజిక సంబంధాల వేదిక పై ఆసక్తి పెంచేసుకుంటాం. ఇందుకు కారణం.. ఈ వెబ్‌సైట్‌లో చోటుచోటుచేసుకునే అంశాలే. 2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్ అంచెలంచెలుగా అభివృద్థి చెందుతూ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత యూజర్ బేస్‌ను కలిగి నిత్యం సంచలనాలతో చెలరేగిపోతున్న ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ సీఈఓ‌గా మార్క్ జూకర్‌బర్గ్ తీసుకుంటున్న వేతనం కేవలం 1 డాలరు మాత్రమే.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ అకౌంట్‌ను మీరు బ్లాక్ చేయలేరు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

8.7 శాతం ఫేస్‌బుక్ అకౌంట్‌లు నకిలీవే.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

చైనాలో ఫేస్‌బుక్‌ను 2009 నుంచి బ్యాన్ చేసారు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌లో 3 కోట్ల మంది చనిపోయిన వ్యక్తులున్నారు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

స్టేటస్ అప్‌డేట్ బాక్సులో మీరు టైప్ చేసిన ప్రతీ టెక్స్ట్ ఫేస్‌బుక్ సర్వర్‌కు చేరవేయబడుతుంది.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మీరు విజిట్ చేసి, ఆ తరువాత లాగవుట్ చేసిన వెబ్‌సైట్‌లను సైతం ఫేస్‌బుక్ ట్రాక్ చేయగలదు.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ అకౌంట్‌ల పై రోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ గురించి పలు ఆసక్తికర విషయాలు

మీ ఫేస్‌బుక్ నోటిఫికేషన్ టాబ్‌ను ఎప్పుడైన గమనించారా..? మీ లోకేషన్‌ను బట్టి ఆ గ్లోబ్ మారుతుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Ceo Mark Zuckerberg To Take Two Months Paternity Leave. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot