వైపై హాట్ స్పాట్ సెట్ చేద్దాం

Written By:


మీ చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌ లేదా టాబ్లెట్‌ని వైఫై హాట్‌ స్పాట్‌ లా మార్చి మీ ఫోన్‌లోని మొబైల్‌ డాటాని మిగితా ఫోన్లతో కానీ మీ ల్యాపీతో కానీ షేర్‌ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లోని డాటాని వైఫై ద్వారా నలుగురికి పంచితే ఇంకేముంది అందరూ మిమ్మిల్ని హీరోలా చూస్తారు.

read more4 జీ ఫోన్స్ చాలా ఛీప్ గురూ

మామూలుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో వైఫై టెట్రింగ్‌ ను మీ స్మార్ట్‌ ఫోన్‌, టాబ్లెట్‌ ద్వారా ఎలా చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. మీ మొబైల్‌ డాటాను వైఫై ద్వారా ఇతర గాడ్జెట్‌లకు పంచడం చాలా సులభమైనదే ఆండ్రాయిడ్‌ వర్షన్‌ 5.0 లాలిపాప్‌ వచ్చాక కూడా వైఫై హాట్‌స్పాట్‌ విషయంలో ఎలాంటి మార్పులు రాలేదు. మీ సరికొత్త అండ్రాయిడ్‌ లాలిపాప్ తో వైఫై హాట్ స్పాట్‌ ఎలా పనిచేయించాలో ఇప్పుడే చూసేద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైపై హాట్ స్పాట్ సెట్ చేద్దాం


1. ముందు మెనులోకి వెళ్లి "సెట్టింగ్స్‌" ఓపెన్‌ చేయండి. అందులో మోర్‌ అనే అప్షన్ ను ప్రెస్‌ చేయండి.
2. తర్వాత "టెట్రింగ్‌ ఆండ్‌ పోర్టబుల్‌ హాట్‌ స్పాట్‌" ఆప్షన్‌ ను ప్రెస్‌ చేయండి.

వైపై హాట్ స్పాట్ సెట్ చేద్దాం

3.మీ ముందు కనబడుతున్న "పోర్టబుల్‌ హాట్ స్పాట్‌" ను ప్రెస్‌ చేసి మీ డాటాను షేర్‌ చేసుకోవచ్చు.
4. ఆ తర్వాత "సెటప్‌ వైఫై హాట్ స్పాట్‌" ఆప్షన్‌ను ప్రెస్‌ చేసి వైఫై నెట్‌ వర్క్‌ను నెలకొల్పవచ్చు.

వైపై హాట్ స్పాట్ సెట్ చేద్దాం

5.ఒక సారి వైఫై నెట్ వర్క్‌ నెలకొల్పాక నెట్‌ వర్క్‌ పేరు నుం సులభంగా మార్చుకోవచ్చు. ఒక వేళ మీ కనెక్షన్‌ను మరింత సురక్షితం చేయదలచుకుంటే మాత్రం పాస్‌వర్డ్‌ పెట్టుకోండి.

వైపై హాట్ స్పాట్ సెట్ చేద్దాం

6.వైఫై హాట్ స్పాట్‌ ఆప్షన్‌ ప్రెస్‌ చేయడం వల్ల ఒక కొత్త టాగుల్‌ మీ మెనులో వచ్చి చేరుతుంది. ఆండ్రయిడ్‌ 5.1 లాలిపాప్‌లో మాత్రం ఈ టాగుల్‌ ను తొలగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write how to set up your Android device as a Wi-Fi mobile hotspot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot