YouTube యొక్క డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

|

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వీడియో ప్లాట్‌ఫామ్‌లలో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉంటుంది. చాలా మంది తమ తీరిక సమయాలలో టైంపాస్ చేయడానికి వీడియోలను చూడడానికి అధికంగా యూట్యూబ్ ను ఉపయోగిస్తారు. ఇందులో చాలా మంది కేవలం యూట్యూబ్ వీడియోలను చూసి ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమ యొక్క ఫీలింగులను యూట్యూబ్ యొక్క కామెంట్ బాక్స్ ద్వారా తెలుపుతూ ఉంటారు.

 

యూట్యూబ్

యూట్యూబ్ అనేది ప్రస్తుతం కంప్యూటర్ వెబ్ లోనే కాకుండా ఆండ్రాయిడ్ మరియు ios ఫోన్లలో కూడా ఇంస్టాల్ చేయబడి ఉంది. యూట్యూబ్ ను అధికంగా వాడే వారు తమ ఫోన్లోని YouTube లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ ను ఎక్కువ రోజులు పొందడమే కాకుండా కంటి యొక్క వత్తిడిని కూడా తగ్గించుకుకోవచ్చు. యూట్యూబ్ లో డార్క్ మోడ్‌ను ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యూట్యూబ్‌ డార్క్ మోడ్‌

యూట్యూబ్‌ డార్క్ మోడ్‌

యూట్యూబ్‌లో డార్క్ మోడ్‌ను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ డివైస్ యొక్క బ్యాటరీని ఆదా చేస్తుంది మరియు మీ కళ్ళపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అన్నింటికంటే యూట్యూబ్ వీడియోలను చూడటానికి ప్రధాన కారణం చాలా వరకు ఉల్లాసకరమైన వీడియోలను చూసి నవ్వుకోవడానికి. మా అభిప్రాయం ప్రకారం డార్క్ మోడ్ ఫీచర్ దృశ్యపరంగా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. YouTube లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడానికి ఈ దశలను అనుసరించండి.

Androidలో YouTube లో డార్క్ థీమ్‌ను ప్రారంభించే దశలు
 

Androidలో YouTube లో డార్క్ థీమ్‌ను ప్రారంభించే దశలు

*** మీ స్మార్ట్‌ఫోన్‌లో YouTube యాప్ ను ఓపెన్ చేసి అందులో కుడివైపు ఎగువ మూలలో ఉన్న ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కండి.

*** సెట్టింగ్స్ >జనరల్ > Appearance ను ఎంచుకోండి.

*** తరువాత అందులో గల డార్క్ థీమ్‌ ఎంపికను ఎంచుకోండి.

*** ఒకవేళ మీరు YouTube లో సైన్ ఇన్ అవ్వకపోయిన కూడా మీరు డార్క్ థీమ్‌ను ప్రారంభించవచ్చు. కానీ సైన్ ఇన్ అవ్వడానికి మొదటగా యూట్యూబ్‌లో మీ యొక్క మెయిల్ id తో లాగిన్ అవ్వాలి.

 

IOSలో YouTube లో డార్క్ థీమ్‌ను ప్రారంభించే దశలు

IOSలో YouTube లో డార్క్ థీమ్‌ను ప్రారంభించే దశలు

*** IOSలో మీరు ఇప్పటికి యూట్యూబ్‌ను వాడకుండా ఉంటె కనుక యాప్ స్టోర్ నుండి YouTube యాప్ ను డౌన్‌లోడ్ చేయండి.


*** యాప్ ను ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి అందులో కుడివైపు ఎగువ మూలలో ఉన్న ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కండి.

 

డార్క్ థీమ్

*** తరువాత తదుపరి స్క్రీన్‌లో సెట్టింగుల మీద నొక్కండి. అందులో గల డార్క్ థీమ్ ఎంపికను‌ను ఎంచుకొని ప్రారంభించండి. అంతే మీ యొక్క యూట్యూబ్ బ్యాక్ గ్రౌండ్ డార్క్ మోడ్ లోకి మారుతుంది.


*** Android మాదిరిగానే మీరు సైన్ ఇన్ చేయకపోయినా మీరు డార్క్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. YouTube యాప్ ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువన మూలలో ఉన్న ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కండి.

*** తరువాత సెట్టింగ్‌లు > ఆపై డార్క్ థీమ్‌పై టోగుల్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Activate Dark Mode on YouTube in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X