YouTube వీడియోలను ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాక్ గ్రౌండులో ప్లే చేయడం ఎలా?

|

గూగుల్ తన యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వంతో అందిస్తున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి బ్యాక్ గ్రౌండ్ ప్లేబ్యాక్ . ఈ ఫీచర్ తో మీరు ఒక వీడియోను చూస్తున్నప్పుడు మరొక యాప్ కి నావిగేట్ చేసినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో వీడియోను ప్లే చేస్తూనే ఉంటుంది. యూట్యూబ్ యొక్క ప్రీమియం సభ్యత్వం లేకపోయినప్పటికీ వీడియో / ఆడియోను ఆటోమ్యాటిక్ గా ప్లే చేయడం మరియు పాజ్ చేయడం వంటివి చేయవచ్చు.

బ్యాక్ గ్రౌండ్ లో యూట్యూబ్ ప్లేబ్యాక్‌

బ్యాక్ గ్రౌండ్ లో యూట్యూబ్ ప్లేబ్యాక్‌

కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ప్లేబ్యాక్‌ను ప్రారంభించడానికి మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ప్రీమియం చందాను పొందవలసిన అవసరం ఉంటుంది. అయితే మీరు ప్రీమియం చందాను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్‌ను సర్ఫింగ్ చేస్తున్నప్పుడు లేదా సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇష్టమైన మ్యూజిక్ వీడియోను వినవచ్చు. ఆసక్తికరంగా అనిపిస్తుందా? అవును ఇది నిజం.

ప్లేబ్యాక్‌

బ్యాక్ గ్రౌండ్ లో మీరు ప్లేబ్యాక్‌ను చేయడం కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఎటువంటి యాదృచ్ఛిక మూడవ పార్టీ యాప్ల అవసరం లేకుండా మరియు అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ వీడియోలను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయడానికి వినియోగదారులను అనుమతించే ఒక ప్రత్యామ్నాయం ఉంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో యూట్యూబ్ ప్లేబ్యాక్‌ చేసే మార్గాలు

ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో యూట్యూబ్ ప్లేబ్యాక్‌ చేసే మార్గాలు

*** మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేయండి.

*** YouTube వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీరు బ్యాక్ గ్రౌండులో ప్లే చేయదలిచిన వీడియోను ఎంచుకోండి.

*** ఇప్పుడు కుడివైపు ఎగువ మూలలో గల మూడు-చుక్కలపై నొక్కండి. అందులో డెస్క్‌టాప్ మోడ్‌ను ప్రారంభించండి.

*** దీని తరువాత వెబ్‌సైట్ మళ్లీ లోడ్ అయ్యే వరకు వేచి ఉండి ప్లే బటన్ మీద నొక్కండి.

*** ఇప్పుడు విండోను చిన్నదిగా చేసి ఫోన్ లోని నోటిఫికేషన్ ప్యానెల్ ను ఓపెన్ చేయండి.

*** ఇందులో ప్లేబ్యాక్ నోటిఫికేషన్ కోసం చూడండి. ప్లేబ్యాక్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్లే బటన్‌పై నొక్కండి.

 

బ్యాక్ గ్రౌండ్

పైన తెలిపిన పద్దతులను పాటించిన తరువాత ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా మీరు మీకు ఇష్టమైన సంగీతాన్ని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ ఆస్వాదించవచ్చు. గూగుల్ క్రోమ్ ని క్లోజ్ చేసినప్పుడు కూడా ప్లేబ్యాక్‌ను పాజ్ చేయవచ్చు. మీరు గుర్తుంచుకోవలసిన ఏకైక విషయం గూగుల్ క్రోమ్ ని క్లోజ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది.

Best Mobiles in India

English summary
How to Play YouTube Videos in Background on Android Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X