వాట్సప్ వీడియో కాల్‌ ఫీచర్‌ను పొందడం ఎలా..?( సింపుల్ ట్రిక్స్ )

Written By:

వాట్సప్..ఈ మధ్య వీడియో కాలింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు..అయినప్పటికీ చాలామంది వాట్సప్ వీడియో కాల్ అప్ డేట్ చేసుకోవాలని తహతహలాడుతుంటారు. అలాంటి వారి కోసం వాట్సప్ బీటా వర్షన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు సింపుల్ స్టెప్స్ లో వీడియోకాల్ ని పొందవచ్చు అదెలాగో ఓ సారి చూద్దాం.

షియోమి నుంచి దూసుకొస్తున్న రెడ్‌మి ఫోన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీటా వర్సన్ అప్‌డేట్

ముందుగా మీరు వాట్సప్ వాడుతున్నట్లయితే మీరు కొత్తగా వాట్సప్ బీటా వర్సన్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి వాట్సప్ బీటా వర్సన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్ కోసం క్లిక్ చేయండి.

apk ఫైల్‌ని డౌన్ లోడ్

ఆ తరువాత మీరు మరొక వర్షన్ వీడియోకి సంబంధించిన apk ఫైల్‌ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైల్ డౌన్ లోడ్ చేసుకుంటేనే మీరు వీడియో కాలింగ్ ఫీచర్ పొందే అవకాశం ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

గ్రీన్ కలర్ download apk

ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు గ్రీన్ కలర్ download apk అని కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది డౌన్ లోడ్ చేసిన వెంటనే అది ఓపెన్ కాకపోవచ్చు ఎందుకంటే మీ ఫోన్ apk ఫైల్స్ సపోర్ట్ చేయకపోతే అది ఓపెన్ కాదు. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి apk ఇన్ స్టాలర్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోన్ లో ఇన్ స్టాల్

ఫైల్ ఓపెన్ అయిన తరువాత మీరు దాన్ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయండి. అయిపోగానే మీ వాట్సప్ సెట్టింగ్స్ లో ఓ సారి సిస్టం అప్ డేట్ కొట్టాలి. ఇందుకోసం మీరు settings లో About phone Helpలో కెళ్లి system statusని ఓ సారి అప్ డేట్ చేయాలి.

ప్రొపైల్ పై క్లిక్ చేస్తే

అయిపోయిన తరువాత మీరు ఏ నంబర్ కయితే కాల్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ ప్రొపైల్ పై క్లిక్ చేస్తే మీకు వాయిస్ కాల్ తో పాటు వీడియో కాల్ కూడా కనిపిస్తుంది. మీరు విజయవంతంగా వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చు.

చాట్ చేస్తూనే వీడియో కాలింగ్

ఇందులో మీరు చాట్ చేస్తూనే వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
how to Activate whatsapp video calling feature read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot