Whatsapp స్టేటస్‌లో ఇక మీకు నచ్చిన పాటలు.. కొత్త ఫీచర్ అదిరిందిగా.. సింపుల్‌గా ఇలా యాడ్ చేయండి!
WhatsApp Status Music: ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. తాజాగా వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇకపై మీరు మీ వాట్సాప్ స్టేటస్‌లలో మీకు ఇష్టమైన పాటలను కూడా జతచేయొచ్చు. అంటే, మీ ఫోటోలు లేదా వీడియోలతో పాటు మంచి మ్యూజిక్ కూడా ప్లే అవుతుందన్నమాట. దీంతో మీ స్టేటస్‌లు మరింత ఉత్సాహంగా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.
అయితే, ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. ఈ మ్యూజిక్ ఫీచర్ కేవలం ఫోటో, వీడియో స్టేటస్‌లకే పనిచేస్తుంది. మామూలుగా పెట్టే టెక్స్ట్ (అక్షరాలు), GIFలు, లేదా వాయిస్ స్టేటస్‌లకు పాటను జోడించడం కుదరదు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో (ఉదాహరణకు, బ్రెజిల్‌లో) ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

* వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ పెట్టే స్టెప్స్ ఇవే:
స్టెప్ 1: వాట్సాప్ ఓపెన్ చేసి 'అప్‌డేట్స్' (Updates)లోకి వెళ్లాలి. అందుకు ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్ తెరవండి. కింద భాగంలో 'అప్‌డేట్స్' అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దాన్ని నొక్కండి. ఇక్కడే కొత్త స్టేటస్‌లు పెట్టొచ్చు, గ్యాలరీలో ఉన్న ఫోటో లేదా వీడియోను సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 2: లేదంటే, అక్కడే కెమెరా గుర్తు (Icon) నొక్కి అప్పటికప్పుడు కొత్త ఫోటో లేదా వీడియో కూడా తీసుకోవచ్చు. ఫోటో లేదా వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత, స్క్రీన్‌పైన కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మ్యూజిక్ గుర్తు (🎵 లాంటిది) ఒకటి ఉంటుంది. దాన్ని నొక్కండి. వెంటనే పాటల లైబ్రరీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3: ఇప్పుడు ఓపెన్ అయిన మ్యూజిక్ బ్రౌజర్‌లో, మీకు కావాల్సిన పాట పేరు, సింగర్ పేరు, లేదా ఏదైనా కీలక పదంతో వెతకొచ్చు. ట్రెండింగ్ పాటలు కూడా అక్కడ కనిపిస్తాయి. ఏదైనా పాటను వినాలనుకుంటే, దాని పక్కన ఉండే ప్లే బటన్ నొక్కి ప్రివ్యూ వినొచ్చు. నచ్చిన పాట దొరకగానే, దానిపై నొక్కి సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: పాట మొత్తం స్టేటస్‌లో రాదు కదా. అందుకే, పాట కింద ఒక బార్ (ప్రోగ్రెస్ బార్) కనిపిస్తుంది. దాన్ని అటూ ఇటూ జరిపి, పాటలో మీకు ఏ భాగం కావాలో ఆ భాగాన్ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. గరిష్టంగా 15 సెకన్ల నిడివి గల పాట భాగాన్ని పెట్టుకోవచ్చు.
స్టెప్ 5: వీడియో స్టేటస్‌లో గరిష్టంగా 60 సెకన్లు మాత్రమే. పాట భాగాన్ని సెలెక్ట్ చేసుకున్నాక, 'Done' (డన్) అని ఉండే బటన్‌ను నొక్కండి. అంతే చివరగా, కింద కనిపించే సెండ్ ఐకాన్ నొక్కితే చాలు. మీ మ్యూజికల్ స్టేటస్ మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ అయిపోతుంది.
* వాట్సాప్ వాడేవారికి మరిన్ని చిట్కాలు
- ముఖ్యమైన మెసేజ్‌లను స్టార్ పెట్టుకోండి
ఏదైనా ముఖ్యమైన మెసేజ్‌ను తర్వాత తేలిగ్గా చూసుకోవాలనుకుంటే, దానికి స్టార్ పెట్టొచ్చు. ఐఫోన్‌లో, మెసేజ్‌పై ఎక్కువసేపు నొక్కినా లేదా రెండుసార్లు ట్యాప్ చేసినా స్టార్ గుర్తు వస్తుంది, దాన్ని నొక్కండి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో, మెసేజ్‌పై ఎక్కువసేపు నొక్కితే పైన స్టార్ గుర్తు కనిపిస్తుంది, దాన్ని నొక్కండి.
ఇలా స్టార్ పెట్టిన మెసేజ్‌లను చూడాలంటే, ఆ చాట్ పేరుపై నొక్కి, 'స్టార్డ్ మెసేజెస్' (Starred Messages) ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. కాకుండా మీరు వాట్సాప్‌లో చాట్ షార్ట్‌కట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు రోజూ ఎక్కువగా మాట్లాడే వారి చాట్‌ను మీ ఫోన్ హోమ్ స్క్రీన్ మీదకే తెచ్చుకోవచ్చు.
ఇది ఆండ్రాయిడ్‌లో మాత్రమే. దీనికోసం, ఆ చాట్‌పై ఎక్కువసేపు నొక్కి, 'యాడ్ కన్వర్జేషన్ షార్ట్‌కట్' (Add Conversation Shortcut) ఆప్షన్ ఎంచుకోండి. అంతే, వారి ప్రొఫైల్ ఫొటోతో ఒక షార్ట్‌కట్ మీ హోమ్ స్క్రీన్‌పైకి వచ్చేస్తుంది. అలాగే ఎవరితో ఎక్కువ డేటా వాడారో తెలుసుకోవచ్చు.
అందుకు మీరు ఏ కాంటాక్ట్ లేదా గ్రూప్‌తో ఎక్కువ డేటా (ఫోటోలు, వీడియోలు పంపడం/రిసీవ్ చేసుకోవడం ద్వారా) ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. దీనికోసం, వాట్సాప్ సెట్టింగ్స్ > డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ > స్టోరేజ్ వాడకం (Settings > Data and Storage Usage > Storage Usage)లోకి వెళ్లండి. అక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








