వాట్సప్‌కు WannaCry ముప్పు, ఈ లింక్ ఓపెన్ చేయకండి !

Written By:

ప్రపంచదేశాలను ముప్పతిప్పలు పెడుతున్న WannaCry వైరస్ దెబ్బకు అనేక కంప్యూటర్లు లాక్ అయ్యాయి. ఇంకా ఈ ర్యాన్సమ్‌వేర్ దాడి కొనసాగుతూనే ఉంది. భారత్ మీద దీని ప్రభావం అంతగా లేనప్పటికీ ఈ వైరస్ వాట్సప్ మీద గురిపెట్టింది. ఈ నేపథ్యంలో వాట్సప్ యూజర్లకూ దీని ద్వారా ముప్పు పొంచి ఉంది.

BSNL అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ మెసేజ్ వైరల్‌లా వస్తోంది

ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలపై వాట్సప్‌ను వాడుతున్న యూజర్లకు ఇప్పుడు ఓ మెసేజ్ వైరల్‌లా వస్తోంది. అది ఫోన్లను పనికిరాకుండా చేస్తోంది.

ఇది కొత్త వాట్సప్ ఫీచర్

వాట్సప్ సాధారణంగా గ్రీన్ కలర్ స్కిన్‌తో ఉంటుంది, అయితే ఆ కలర్ కాకుండా ఇంకా ఎరుపు, నీలం, పసుపు వంటి రంగుల్లోనూ ఇప్పుడు ఓ లింక్ దర్శనమిస్తోంది. ఇది కొత్త వాట్సప్ ఫీచర్ కావాలంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అందుకు ఓ లింక్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుందని ఆ మెసేజ్‌లో ఉంటుంది.

ఓ మాల్‌వేర్ లింక్

దీనికి తోడు ఓ మాల్‌వేర్ లింక్ కూడా ఆ మెసేజ్‌లో దర్శనమిస్తోంది. ఆ ఫీచర్ పట్ల ఆకర్షితులైన యూజర్లు ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. అలా లింక్ క్లిక్ చేయగానే ఆ యూజర్ ఉన్న వాట్సప్ గ్రూప్‌లు అన్నింటిలోనూ ఆ మెసేజ్ యూజర్‌కు తెలియకుండానే పోస్ట్ అవుతోంది.

పనికి రాని యాడ్‌వేర్ యాప్స్

దీంతో చాలా మందికి ఆ మెసేజ్ వైరల్‌లా చేరుతుంది. ఆ తరువాత పనికి రాని యాడ్‌వేర్ యాప్స్ అన్నీ ఫోన్‌లలో వాటంతట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయి. దీంతో వైరస్ ఫోన్లలో విస్తరించి డివైస్‌లను పనికిరాకుండా చేస్తోంది.

అచ్చం WannaCry వైరస్‌

అచ్చం WannaCry వైరస్‌ను పోలి ఉండడంతో ఇది అదేనా..? లేక వేరే ఎవరైనా కొత్తగా వైరస్‌ను సృష్టించారా..? అన్న సందేహాలు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ నిపుణులకు కలుగుతున్నాయి.

Reddit అనే ఓ సోషల్ సైట్‌లో

Reddit అనే ఓ సోషల్ సైట్‌లో ఓ యూజర్ తొలుత ఈ తరహా వాట్సప్ మెసేజ్‌ను గుర్తించాడు. అనంతరం దీని గురించి అందరినీ అప్రమత్తం చేయడంతో వాట్సాప్ ఫేక్ మెసేజ్ గురించి తెలిసింది.

http://шһатѕарр.com

అయితే సదరు ఫేక్ మెసేజ్‌లో ఉండే వెబ్‌సైట్ లింక్ కూడా అచ్చం వాట్సప్ లింక్‌ను పోలి ఉండడం గమనార్హం. http://шһатѕарр.com పేరిట ఆ లింక్ ఉంటున్నది. దీంతో సహజంగానే అది ఒరిజినల్ వాట్సప్ లింక్ అనుకుని చాలా మంది ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు.

ఈ సైట్ నకిలీది

అయితే నిజానికి ఈ సైట్ నకిలీది. ఈ లింక్‌లో ఉండే ш అనే సింబల్ ఇంగ్లిష్ అక్షరం W ను పోలి ఉంటుంది. కనుకనే దానికి తేడా గుర్తించలేక చాలా మంది వాట్సాప్ యూజర్లు ఈ నకిలీ సైట్ బారిన పడినట్టు తెలిసింది.

ఏది పడితే దాన్ని

కాబట్టి మీరు కూడా ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే దాన్ని ఓపెన్ చేయకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
If your friends send you this WhatsApp link, don't click it read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot