IRCTC : టికెట్ క్యాన్సిల్ చేసి డబ్బులు తిరిగి పొందడం ఎలా ?

ఇండియన్ రైల్వే రోజురోజుకు తసన వెబ్ సైట్లో ప్రయాణికులకు అనువుగా మార్పులు చేసుకుంటూపోతోంది. ఇందులో భాగంగానే ముందుగానే టికెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించింది. అలాగే వాటిని క్యాన్స

|

ఇండియన్ రైల్వే రోజురోజుకు తసన వెబ్ సైట్లో ప్రయాణికులకు అనువుగా మార్పులు చేసుకుంటూపోతోంది. ఇందులో భాగంగానే ముందుగానే టికెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించింది. అలాగే వాటిని క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ద్వారా కేవలం అప్పటికప్పుు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. రైల్వే కౌంటర్లు, స్టేషన్లు, రిజర్వేషన్ ఆఫీసులు, బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకున్న టికెట్లతో పాటు ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ వెబ్‌సైట్ www.irctc.co.in లో ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 IRCTC : టికెట్ క్యాన్సిల్ చేసి డబ్బులు తిరిగి పొందడం ఎలా ?

అలాగే క్యాన్సిల్ చేసుకోవచ్చు. టెక్నాలజీ సాయంతో ఇప్పుడు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్టే క్యాన్సిలేషన్ కూడా ఆన్‌లై లోనే జరిగిపోతుంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే కౌంటర్‌లో బుక్ చేసుకున్న టికెట్‌ను కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకుని రీఫండ్ పొందొచ్చు. ప్రాసెస్ ఎలాగో ఓ సారి చూద్దాం.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్

ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctc.co.in ఓపెన్ చేయండి.
అందులోకి లాగిన్ అయిన తరువాత హోమ్‌ పేజీలో ‘Trains' ఆప్షన్స్‌ పైన క్లిక్ చేయండి.

Cancel Ticket

Cancel Ticket

  • అక్కడ కనిపించే డ్రాప్‌డౌన్ మెనూలో ‘Cancel Ticket' పైన క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత వచ్చే ‘Counter Ticket' ఆప్షన్ ఎంచుకోండి.
  • అది ఒపెన్ అయిన తరువాతట్రైన్ టికెట్ పైన ప్రింట్ చేసిన ట్రైన్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ అందులో ఎంటర్ చేయండి.
  • ఎంటర్ చేసిన తరువాత అక్కడ కనిపించే నిబంధనలు చదివి, బాక్స్ టిక్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
  • అనంతరం సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబరుకు వెంటనే వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది.
  • బుకింగ్ సమయంలో ఇచ్చిన మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
  •  

    చివరగా

    చివరగా

    అక్కడ కనిపించే పీఎన్ఆర్ వివరాలను వెరిఫై చేయండి. చివరగా ‘Cancel Ticket' పైన క్లిక్ చేస్తే చాలు. క్యాన్సిలేషన్ ఛార్జీలు పోనూ మిగతా అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది.

    IRCTC వెబ్‌సైట్‌లో స్టన్నింగ్ ఫీచర్లు

    IRCTC వెబ్‌సైట్‌లో స్టన్నింగ్ ఫీచర్లు

    IRCTC వెబ్‌సైట్‌లో స్టన్నింగ్ ఫీచర్లు ఇవే..దీన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు వాడే పాత వర్షన్ పేజీలోనే మీకు ఎర్రని ఐకాన్ తో Try New Version of Website క్లిక్ చేయడం ద్వారా మీకు బీటా వర్షన్ లో ఉన్న కొత్త వెబ్‌సైట్‌లోకి ఎంటరవుతారు.

Best Mobiles in India

English summary
New IRCTC next-generation website:How to cancel counter tickets online and claim refund

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X