తక్కువ ఖర్చులో మీ రూమ్‌ని స్మార్ట్ రూమ్‌గా ఎలా మార్చవచ్చు?

|

ప్రపంచం మొత్తం తెలివిగా మారుతోంది మరి మీ గది ఎందుకు భిన్నంగా ఉండాలి?. ఇప్పుడున్న ప్రపంచం ఎక్కువగా స్మార్ట్ రంగంగా మారుతోంది. చాలా వస్తువులు - ఎయిర్ కండీషనర్లు మరియు టాయిలెట్ సీట్లు వంటివి కొత్తగా రూపాంతరం పొందుతున్నాయి. రిమోట్ కంట్రోలర్‌లను ఉపయోగించడం నుండి వాయిస్ కంట్రోల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి ఉపయోగించడం వరకు ఎదిగారు.

 

గూగుల్ అసిస్టెంట్

అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి వర్చువల్ అసిస్టెంట్లు అన్నింటినీ ప్రస్తుతం ఆటోమేట్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో గాడ్జెట్‌లను ఉపయోగించడం దాదాపు అప్రయత్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్ గాడ్జెట్లు మన జీవితాలను తేలికగా మార్చడానికి రూపొందించబడినప్పటికీ ప్రతి ఒక్కరు తమ ఇంటిలోని అన్ని పరికరాలను కొత్త మరియు తెలివిగల పరికరాలతో భర్తీ చేయడం సాధ్యం కాదు.

ఆటోమేట్

ఒకవేళ ఇప్పుడు మీ ఇంటిని ఆటోమేట్ చేయడానికి అవసరమైన గాడ్జెట్ల జాబితాను చూస్తున్నట్లు అయితే మే యొక్క ఆలోచన అంతా స్మార్ట్ హోమ్ కెమెరా, స్మార్ట్ డోర్బెల్, స్మార్ట్ లైట్లు , స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ ఎసిలు, స్మార్ట్ స్పీకర్లు , స్మార్ట్ డిస్ప్లేలు, స్మార్ట్ రౌటర్లు, స్మార్ట్ టివి మరియు స్మార్ట్ ప్లగ్‌లు మీద ఉంటాయి.

స్మార్ట్ పరికరాల
 

పైన పేర్కొన్న అన్నిటికి చాలా మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ స్మార్ట్ పరికరాల కోసం అధిక మొత్తాన్ని ఖర్చు చేయడం తెలివైన వ్యక్తి యొక్క లక్షణం కాదు. దీనికి బదులుగా మీరు గరిష్టంగా కేవలం రూ.15 వేల బడ్జెట్‌ను కేటాయించి మీ సాధారణ గదిని స్మార్ట్ రూమ్‌గా మార్చవచ్చు. ఇది నిజం మీరు మీ ఇంటిని మొత్తాన్ని ఆటోమేట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే మీరు లక్షలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీకు కావలసిందల్లా మూడు పరికరాలు అంతే అవి ఏమిటో ఇక్కడ తనిఖీ చేయండి.

స్మార్ట్ డిస్ప్లే

స్మార్ట్ డిస్ప్లే

ఇందులో మీకు కావలసిన మొదటి విషయం స్మార్ట్ స్పీకర్ లేదా స్మార్ట్ డిస్ప్లే. ప్రస్తుతం అమెజాన్ లో ఎకో డాట్ 3G మరియు హోమ్ మినీ ఒక్కొక్కటి 3,999 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ స్పీకర్లు వారి ధర వద్ద మంచి ఫీచర్స్ ను అందిస్తున్నాయి.

స్మార్ట్ లైట్

స్మార్ట్ లైట్

తదుపరి స్మార్ట్ పరికరం స్మార్ట్ లైట్. మనందరికీ మన ఇళ్లలో ఎల్‌ఈడీ లైట్ ఉంది. అవి చౌకగా ఉండి తక్కువ లైఫ్ టైంను కలిగి ఉంటాయి. మీ గదిని స్మార్ట్ రూమ్‌గా మార్చడానికి మీరు మీ పాత ఎల్‌ఈడీ లైట్ న్ని కొత్త స్మార్ట్ మాల్ప్‌తో భర్తీ చేయాలి. దీని కోసం విప్రో మరియు సిస్కా అందిస్తున్న 7 వాట్ల స్మార్ట్ లైట్ 699 రూపాయలు మరియు 9 వాట్ల స్మార్ట్ లైట్ 799 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంతే కాకుండా షియోమి అందిస్తున్న 999 రూపాయల స్మార్ట్ లైట్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ లైట్లలో గొప్పదనం ఏమిటంటే అవి అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ రెండింటితోనూ పనిచేస్తాయి. అంటే మీరు నెస్ట్ హబ్ లేదా ఎకో షో 5 ను ఎంచుకుంటే అది రెండింటితోనూ పని చేస్తుంది. దీని ద్వారా మీరు మీ గదిలోని లైట్ల రంగును మార్చవచ్చు మరియు దానిని డిస్కోథెక్ లైట్ లాగా కూడా మార్చవచ్చు. అంతే కాకుండా లైట్ల యొక్క కలర్ ఉష్ణోగ్రతను మార్చవచ్చు. మరీ ముఖ్యంగా మీరు మీ వాయిస్ కమాండ్ ఉపయోగించి మరీ ఇవన్నీ చేయవచ్చు.

స్మార్ట్ ప్లగ్

స్మార్ట్ ప్లగ్

స్మార్ట్ ప్లగ్ అనేది స్మార్ట్ కాని వస్తువులను స్మార్ట్ గాడ్జెట్‌గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ ఎసిని నేరుగా సాకెట్‌లోకి ప్లగ్ చేయడానికి బదులుగా మీరు ఎసిని స్మార్ట్ ప్లగ్‌లో ప్లగ్ చేసి ఆపై స్మార్ట్ ప్లగ్‌ను మీ గది సాకెట్‌లోకి ప్లగ్ చేయవచ్చు. ఇది మీ స్మార్ట్ డిస్ప్లే లేదా మీ స్మార్ట్ అసిస్టెంట్ ఉపయోగించి మీ ఎసిని నియంత్రించడానికి తక్షణమే మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఇది మీకు స్మార్ట్ లైట్ కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. విప్రో అందిస్తున్న 10Amp స్మార్ట్ ప్లగ్ యొక్క ధర సుమారు 1200 రూపాయలు. అలాగే 16Amp ప్లగ్ యొక్క ధర 2,000 రూపాయలు. మరోవైపు ఎసిలు, గీజర్లు మరియు వాటర్ పంపుల వంటి పెద్ద ఉపకరణాలతో పనిచేసే ఓక్టర్ యొక్క స్మార్ట్ ప్లగ్ ధర సుమారు 3,500 రూపాయలు . మీ అవసరాల ఆధారంగా వీటిలో దేనినైనా మీరు ఎంచుకోవచ్చు.

స్మార్ట్ రూమ్‌

స్మార్ట్ రూమ్‌

మీరు ఈ మూడు పరికరాలను మీ ఇంటిలో ఉంచిన తర్వాత మీ యొక్క పాత గదిని స్మార్ట్ రూమ్‌గా మార్చవచ్చు. మీ గదిలో సంగీతం మరియు లైట్ల యొక్క ఉష్ణోగ్రతను ప్రతిదీ నియంత్రించవచ్చు. మీరు స్మార్ట్ స్పీకర్‌కు బదులుగా స్మార్ట్ డిస్‌ప్లేను కొనాలని నిర్ణయించుకుంటే మీరు మీ స్మార్ట్ డిస్‌ప్లేలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు మరియు యూట్యూబ్ యొక్క వీడియోలను ప్రసారం చేయవచ్చు. ప్రపంచం తెలివిగా మారుతోంది. మీ గది ఎందుకు భిన్నంగా ఉండాలి?

Best Mobiles in India

English summary
How to Change your Home into a smart Home

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X