సెల్ఫీ వీడియోతో రక్తపోటు(BP)ను కొలవవచ్చు?

|

రక్తపోటు ఉన్న వారు నెల నెల హాస్పిటల్ వరకు వెళ్లి తమ రక్తపోటును తెలుసుకోవడానికి ఇబ్బందిపడుతున్నార అయితే రక్తపోటు (బిపి) సమస్యలు ఉన్నవారికి శుభవార్త. ఇప్పుడు మీ యొక్క బిపిని పర్యవేక్షించడం ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నంత సులభం అవుతుంది. స్మార్ట్ఫోన్-క్యాప్చర్ చేసిన ఫేషియల్ అకా సెల్ఫీ వీడియోలలో రక్త ప్రవాహ మార్పులను గుర్తించడం ద్వారా రక్తపోటును కొలిచే ట్రాన్స్‌డెర్మల్ ఆప్టికల్ ఇమేజింగ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ సంతతికి చెందిన పరిశోధకులు పరీక్షించారు.

సెల్ఫీ వీడియోతో రక్తపోటు(BP)ను కొలవవచ్చు?

 

ఈ అధ్యయనం ప్రకారం సెల్ఫీ వీడియో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గురించి మొత్తం సమాచారం అందిస్తుంది అని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మరియు భారతీయ సంతతి పరిశోధకుడు రామకృష్ణ ముక్కమల అన్నారు. వీడియో తీసుకునేటప్పుడు పరిసర ప్రాంతాలలో వున్న కాంతి చర్మం యొక్క బయటి పొరలలోకి చొచ్చుకుపోతుంది.

సెల్ఫీ వీడియోతో రక్తపోటు(BP)ను కొలవవచ్చు?

అప్పుడు స్మార్ట్ఫోన్లలోని డిజిటల్ ఆప్టికల్ సెన్సార్లు రక్త ప్రవాహ నమూనాలను దృశ్యమానం చేయడానికి మరియు సేకరించేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో రక్తపోటును అంచనా వేయడానికి ట్రాన్స్‌డెర్మల్ ఆప్టికల్ ఇమేజింగ్ నమూనాలు ఉపయోగించారు.

 కఫ్-ఆధారిత పరికరాలు:

కఫ్-ఆధారిత పరికరాలు:

రక్తపోటు కొలిచే కఫ్-ఆధారిత పరికరాలు చాలా ఖచ్చితమైనవి అయితే ఇవి కాస్త అసౌకర్యంగా ఉంటాయి. వినియోగదారులు ప్రతిసారీ చాలా రకాల కొలతలు తీసుకోవటానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మార్గదర్శకాలను మరియు పరికర తయారీదారుల సూచనను పాటించవద్దు అని లీ చెప్పారు.

అధ్యయనం కోసం సర్క్యులేషన్:

అధ్యయనం కోసం సర్క్యులేషన్:

కార్డియోవాస్కులర్ ఇమేజింగ్ అనే ట్రాన్స్‌డెర్మల్ ఆప్టికల్ ఇమేజింగ్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఐఫోన్‌ను ఉపయోగించి 1,328 కెనడియన్ మరియు చైనీస్ పెద్దల రక్త ప్రవాహాన్ని రెండు నిమిషాల వీడియోలను సంగ్రహించడం ద్వారా పరిశోధనా బృందం మొత్తం సమాచారం సేకరించి బీపీ యొక్క స్థాయిని గుర్తించి పరిగణలోకి తీసుకున్నారు.

పోలికలు:
 

పోలికలు:

పరిశోధకులు సాంప్రదాయ కఫ్-ఆధారిత పరికరాన్ని ఉపయోగించి తీసుకున్న నిరంతర రక్తపోటు కొలతలు మరియు స్మార్ట్‌ఫోన్ వీడియోల నుండి సంగ్రహించిన సిస్టోలిక్, డయాస్టొలిక్ మరియు పల్స్ ప్రెజర్ కొలతలను రక్తపోటు రీడింగులతో పోల్చారు తద్వారా రెండింటి యొక్క రిజల్ట్స్ సమానంగా ఉన్నాయి. ముఖంలో రక్త ప్రవాహ నమూనాల నుండి రక్తపోటును మరియు పల్స్‌ను ఎలా ఖచ్చితంగా నిర్ణయించాలో సాంకేతికతను నేర్పడానికి పరిశోధకులు డేటాను ఉపయోగించారు.

ఆప్టికల్ ఇమేజింగ్:

ఆప్టికల్ ఇమేజింగ్:

ట్రాన్స్‌డెర్మల్ ఆప్టికల్ ఇమేజింగ్ సిస్టోలిక్ రక్తపోటును సగటున దాదాపు 95 శాతం ఖచ్చితత్వంతో మరియు డయాస్టొలిక్ రక్తపోటును పల్స్ ప్రెజర్‌తో దాదాపు 96 శాతం ఖచ్చితత్వంతో అంచనా వేసింది. లీ ప్రకారం రక్తపోటును కొలవడానికి ఉపయోగించే పరికరాల కోసం సాంకేతికత యొక్క అధిక ఖచ్చితత్వం అంతర్జాతీయ ప్రమాణాలలో ఉంటుంది.

పరిశోధకుల సాంకేతిక పరిజ్ఞానం:

పరిశోధకుల సాంకేతిక పరిజ్ఞానం:

పరిశోధకులు స్థిరమైన లైటింగ్‌తో మరియు నియంత్రిత వాతావరణంలో వీడియో తీశారు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వెలుతురు తక్కువ వున్న ప్రాంతాలలో మరియు తక్కువ నియంత్రిత వాతావరణంలో రక్తపోటును ఖచ్చితంగా కొలవగలదా అనేది అస్పష్టంగా ఉంది. అలాగే అధ్యయనంలో పాల్గొన్న వారికి రకరకాల స్కిన్ టోన్లు ఉన్నప్పటికీ ఫలితాలు ఖచ్చితంగా వచ్చాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
selfie video help measure blood pressure

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X