ఐ ఫోన్ అసలైనదా లేక నకిలీదా తెలుసుకోవడమెలా..?

Written By:

మార్కెట్లో ఎన్ని బ్రాండ్‌లు ఉన్నా ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్‌కు అవి సాటిరావు.. ఇప్పటికీ చాలామంది ఐ ఫోన్ మీద తమ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే వీరి ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి అనేక కంపెనీలు ఐ ఫోన్‌లను తక్కువ ధరకే ఇస్తామంటూ ఉసిగొల్పుతుంటాయి. అయితే వారిచ్చే ఐ ఫోన్ అసలైనదా లేక ఫేక్‌దా అనేది తెలుసుకోలేక చాలామంది అది నిజమైన ఐ ఫోన్ అని దాన్ని కొనేస్తుంటారు. ఈ దశలో ఐ ఫోన్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి మీకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి.

Read more: వైరస్ భారీన పది లక్షల ఫోన్లు: మరి మీ ఫోన్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సీరియల్ నంబర్

ఐ ఫోన్ సెట్టింగ్స్ లో కెళ్లి అందులో జనరల్ అనే ఆప్సన్ మీద క్లిక్ చేస్తే కింద సీరియల్ నంబర్ ఉంటుంది. దీన్ని చెక్ చేయడం ద్వారా అది నిజమైనదా కాదా అని తెలుసుకోవచ్చు.

విజిబుల్ ఎక్సటర్నల్ క్లూస్

ఐ ఫోన్ ఫీచర్స్ హ్యాక్ చేయడానికి వీలు లేని విధంగా ఉంటాయి. మీరు మీ ఐ ఫోన్ లో ఓసారి sleep/wake బటన్స్ ను చెక్ చేసుకోండి. అలాగే Home బటన్ కూడా అది సెంటర్ లో ఉంటుంది. అవి ఢిపరెంట్ లోకేషన్లలో ఉంటే అది ఖచ్చితంగా ఐ ఫోన్ నకీలిదే అయి ఉంటుంది.

కెరీర్ కనెక్టివిటీ

ఒరిజినల్ ఐ ఫోన్ AT&T నెట్ వర్క్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సీడీఎమ్ ఎ నెట్ వర్క్ కు సపోర్ట్ చేయదు. ఇది కూడా తేడాగా ఉందో లేదో చూసుకోవాలి.

నెట్ వర్క్ కనెక్టివిటీ

నెట్వర్క్ కు సంబంధించి కూడా ఓ సారి చెక్ చేసుకోవాలి.వైఫై.బ్లూటూత్ వంటి వాటికి కనెక్ట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడం మేలు.

సెన్సింగ్

ఐ ట్యూన్స్ ఉన్నాయా లేవా అనేది ఓ సారి చెక్ చేసుకుంటే మంచిది. అలాగే ఐఓఎస్ సాఫ్ట్ వేర్ కూడా చెక్ చేసుకోవాలి.

అప్లికేషన్స్

ఇది చాలా ముఖ్యమైనది ఐ ఫోన్ లో కేవలం ఆపిల్ కు చెందిన బ్రాండ్ అప్లికేషన్లు మాత్రమే ఉంటాయి. వీటిని తొలగించాలన్నా చాలా కష్టం. ఇవి లేకుంటే అది ఐ ఫోన్ కానట్లే లెక్క.

ఆపిల్ స్టోర్ ఆధరైజడ్ సెంటర్

మీరు ఓ సారి ఐ ఫోన్ కొన్న తరువాత దాన్ని ఆపిల్ ఆధరైజడ్ సర్వీస్ సెంటర్ లో చూపించడం చాలా బెటర్.అక్కడి టెక్నీషియన్ దాన్ని పరిశీలించి అసలైనదా నకిలీదా తేల్చి చెప్పగలడు.

కొన్న తరువాత అది ఐ ఫోన్ కాదని భాదపడేకంటే

కొన్న తరువాత అది ఐ ఫోన్ కాదని భాదపడేకంటే ముందే అన్ని తెలుసుకొని వెళ్లడం మంచింది. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Check If an iPhone Is Original
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot