వైరస్ భారీన పది లక్షల ఫోన్లు: మరి మీ ఫోన్..?

Written By:

ఇండియాలో గత ఏడాది 10 లక్షల ఫోన్లు ఆండ్రాయిడ్ మాల్‌వేర్(వైరస్)భారీన పడిపోయాయట. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రపంచంలో ఈ వైరస్ భారీన పడినదేశాల్లో మనదేశం రెండవస్థానంలో నిలిచింది. ఈ మేరకు చీతా మొబైల్ సైక్యూరిటీ ఓ నివేదిక వెలువరించింది.

Read more:21 మెగా ఫిక్సల్‌తో మోటో ఎక్స్‌ఫోర్స్ దూసుకువస్తోంది

ఈ నివేదిక ప్రకారం గత సంవత్సరం ఇండియాలో ఆండ్రాయిడ్ మాల్‌వేర్ కారణంగా ప్రభావితం చెందిన స్మార్ట్‌ఫోన్ల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని రిపోర్టు తెలిపింది. అయితే మనకన్నా ముందు చైనా 15 లక్షల ఫోన్లతో ముందు ఉన్నదని నివేదిక తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా(8,00,327), రష్యా (4,63,385), మలేషియా, మెక్సికో, అమెరికా (3,22,833), వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇరాన్‌లు మన తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Read more: జనవరిలో లాంచ్ అయిన 20 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ మాల్‌వేర్ ప్రభావం చైనా, ఇండియా, ఇండోనేషియాలోనే అధికంగా ఉందని, ఈ మూడు దేశాల్లో థర్డ్‌పార్టీ యాప్‌ల వాడకం భారీగా పుంజుకుంటున్నదని, కానీ వాటిపై పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో చాలావరకు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మొబైళ్లోకి వైరస్ కూడా వచ్చి చేరుతున్నదన్నారు.

Read more : సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేయండి: కార్పోరేట్ జాబు కొట్టండి

ముఖ్యంగా మొబైల్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు జరిపేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సంస్థ హెచ్చరించింది.ఈ సందర్భంగా మీ ఫోన్ వైరస్ భారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్ర్తత్తలను ఓ సారి చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..? అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. 

పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి

మీ ఫోన్‌కు ఓ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. అయితే, డివైస్‌ను ఓపెన్ చేయవల్సిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కాస్తంత ఇబందిగానే ఉండొచ్చు, అయితే మీ ఫోన్ మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఉంటుంది.

find your phone toolను మీ డివైస్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి

మీరు ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ అయినట్లయితే find your phone toolను మీ డివైస్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోని పరిస్థితుల్లో మీ ఫోన్ మిస్ అయినట్లయితే వెతికి పట్టుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.

ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను..

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ ఎప్పటికప్పుడు చేసి ఉంచండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఇతర డివైజ్ లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.

ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్త

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండటం మంచింది. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి

ప్రైవసీ సెట్టింగ్‌లను మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో

నేటి తరం స్మార్ట్‌ఫోన్ పీసీలు డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు ధీటుగా ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటున్నాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ద్వారా మెయిల్ చెక్ చేసుకునే సందర్భంలో అప్రమత్తత వహించటం మంచిది. ముఖ్యంగా ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో జాగ్రత్త వహించండి లేకుంటే అనవసర వైరస్‌లు మీ డివైజ్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

రివ్యూను ముందుగా చదవండి

స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ అప్లికేషన్‌కు సంబంధించి రివ్యూను ముందుగా చదవండి.ఏదైనా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే ఆ అప్లికేషన్‌‌కు బదులుగా వేరొక మంచి అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

పర్మిషన్ లిస్ట్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు

పర్మిషన్ లిస్ట్‌ను కూడా చెక్ చేసుకోవటం మంది. యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌లో సదరు అప్లికేషన్‌కు సంబంధించి అనేక రకాల విషయాలు చర్చించబడతాయి.

నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌

నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వైరస్ ముప్పు నుంచి బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు సదరు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండండి.

క్రమం తప్పకుండా స్కాన్ చేయండి

స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా రోజు స్కాన్ చేస్తుండటం వల్ల ప్రమాదకర ఫైళ్లు మీ ఫోన్‌లోకి చేరవు.

వైరస్‌ను మాన్యువల్‌గా తొలగించాలంటే

మీ స్మార్ట్‌ఫోన్‌లోని వైరస్‌ను మాన్యువల్‌గా తొలగించాలంటే ముందుగా మీ డివైస్‌లోని వైరస్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి.

సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి

వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. ఇందుకు ఫోన్ యూజర్ మాన్యువల్‌ను అవగాహన చేసుకోండి.

ఆన్‌లైన్ యాంటీ వైరస్ టూల్స్‌

ఆన్‌లైన్ యాంటీ వైరస్ టూల్స్‌ను ఆశ్రయించటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది.

అప్లికేషన్ స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి

ఫోన్‌కు సంబంధించి అప్లికేషన్‌లను సదురు ఫోన్‌కు సంబంధించిన అప్లికేషన్ స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో సృష్టిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Over 11 Million Infected Android Devices in India Cheetah Mobile
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot