4G VoLTE వేరు, 4G వేరు..మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి

|

ఇప్పుడు జియోతో అందరూ 4జీ ఫోన్లవైపు పరుగులు పెడుతున్నారు. అయితే 4జీలో రెండు రకాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. 4జీ వేరు వోల్ట్ 4జీ వేరు..అయితే అందరూ మేము 4జీనే వాడుతున్నామని చెబుతుంటారు. ఈ దశలో మీ ఫోన్ 4జీ ఫోనా లేక వేరేదా చెక్ చేసుకోండి ఈ కింది ట్రిప్స్ తో..

 

ఇంటెక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది

volte 4జీ అంటే

volte 4జీ అంటే

volte 4జీ అంటే స‌ద‌రు ఫోన్ కేవ‌లం 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాదు, 4జీ వాయిస్ కాల్స్‌కు కూడా స‌పోర్ట్ చేయాలి. దాన్నే volte 4జీ అంటారు. 4జీలో అయితే కేవలం డేటా మాత్రమే వాడుకుంటాం. 

యూజ‌ర్ త‌న డివైస్‌లో

యూజ‌ర్ త‌న డివైస్‌లో

అంటే ఈ ఫీచర్ తో  యూజ‌ర్ త‌న డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతోపాటు, హెచ్‌డీ క్వాలిటీతో కూడిన 4జీ వాయిస్ కాల్స్‌ను కూడా చేసుకోవచ్చు. చాలా కంపెనీలు వోల్ట్ అని చెప్పి 4జీ ఫోన్లను ఇస్తున్నాయి ఇప్పుడు. మీరు కొంచెం చూసి తీసుకోండి.

వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ
 

వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ

4G VoLTE అంటే వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ అని అర్థం. డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతో పాటు, 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌ని అర్థం. అలాంటి ఫోన్లు చాలా కాస్ట్ లో లభిస్తున్నాయి ఇప్పుడు. 4జీ ఫోన్లు అయితే చాలా తక్కువ ధరల్లోనే ఇస్తున్నారు. 

4జీ ఫోన్లు అయితే

4జీ ఫోన్లు అయితే

మీరు అనుకునే 4జీ ఫోన్లు అయితే కేవలం డేటా వాడుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. 4జీ వాయిస్ కాల్స్ కి సపోర్ట్ చేయవు. అంటే మీరు హెచ్ డి వాయిస్ కాల్స్ అసలు చేసుకోలేరు. 

త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం

త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం

దీన్ని త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఓ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది.

VoLTE checker

VoLTE checker

'VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి 

4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే

4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే

దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ యాప్ వెంట‌నే స‌ద‌రు డివైస్ అస‌లైన 4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే తెలియ‌జేస్తుంది. దీంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా అని గుర్తించ‌వ‌చ్చు.

జియో నుంచి వచ్చిన అన్ని lyf ఫోన్లు

జియో నుంచి వచ్చిన అన్ని lyf ఫోన్లు

జియో నుంచి వచ్చిన అన్ని lyf ఫోన్లు ఈ వోల్ట్ ఫీచర్ తోనే వస్తున్నాయి. కాబట్టి వాటికి జియో సిమ్ సపోర్ట్ చేస్తోంది. మిగతా ఫోన్లకు సపోర్ట్ చేసినా వాయిస్ కాల్స్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. 

మీకు ఇంకో ఆప్సన్

మీకు ఇంకో ఆప్సన్

దీంతో పాటు మీకు ఇంకో ఆప్సన్ కూడా ఉంది. మీరు మీ ఆండ్రాయిడ్ 4 జీ మొబైల్ నుంచి స్టార్ హ్యాష్ స్టార్ హ్యాష్ 4636 హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ (* # * # 4636 # * # *) ఈ నంబర్లు నొక్కితే చాలు చివరి హ్యాష్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ సర్వీస్ పై నాలుగు ఆప్షన్స్ వస్తాయి.

మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్

మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్

దాంట్లో మొదటిది డ్రైవ్స్ ఇన్ఫర్మేషన్ లేదా ఫోన్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాన్ని ఎంచుకుని కిందకు స్క్రోల్ చేస్తే నెట్ వర్క్ టైప్ అని ఉంటుంది. అక్కడ మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్ కనిపిస్తాయి. మీ ఫోన్ ఎల్టీఈ లేక వోల్టా (వీవోఎల్టీఈ) అనేది కూడా అక్కడ కనిపిస్తుంది.

ఓటరు కార్డుకు అప్లయి చేయాలనుకుంటున్నారా.. చాలా సింపుల్

ఓటరు కార్డుకు అప్లయి చేయాలనుకుంటున్నారా.. చాలా సింపుల్

ఓటరు కార్డు పొందాల్సిన (18 ఏళ్లు నిండిన) వారు నేరుగా ఆన్‌లైన్‌లోని www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

స్టెప్ 2 ఆ

స్టెప్ 2 ఆ

అందులో ఈ రిజిస్ట్రేషన్ దగ్గరకెళితే మీకు దరఖాస్తు పత్రాలు 6, 7, 8, 8ఏలు కనిపిస్తాయి. ఆరో నంబరు పత్రం కొత్త ఓటర్ల నమోదుకు, 7 నంబరు పత్రం వ్యక్తుల పేర్ల తొలగింపు, 8లో పేరు, చిరునామా మార్పు, 8ఏ ప్రతం అసెంబ్లీ నియోజకవర్గం మార్చు కోవడానికి నింపాల్సి ఉంటుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఇప్పుడు మీకు ఏది కావాలో సెలక్ట్ చేసుకుని అందులో మీ వివరాలను పొందుపరిస్తే సరి. కొత్త ఓటరు అయితే ఓటరుగా నమోదు కానున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోటో, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ వివరాలను జతచేయాలి.

స్టెప్ 4

స్టెప్ 4

అంతా పూర్తయిన తరువాత ఓ సారి చెక్ చేసుకుని సబ్‌మిట్ బటన్ నొక్కండి.. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తో కూడిన నంబర్ మొబైల్ కి వస్తుంది.

స్టెప్ 5

స్టెప్ 5

ఆ నంబర్ తీసుకుని మీరు మీ దగ్గర్లోని Election Registration Officer (ERO) ఆఫీసుకెళ్లి మీ ఫ్రూప్స్ ని చూపిస్తే వారు మీ వివరాలను పైకి పంపిస్తారు.లేదంటే పోస్ట్ మ్యాన్ మీరు నింపిన ధరఖాస్తును తీసుకుని వివరాలు కనుక్కోవడానికి మీ ఇంటికి వస్తారు. అప్పుడు అతనికి మీ వివరాలు చెబితే అతను ఆ వివరాలతో కూడిన ధరఖాస్తును Election Registration Officer (ERO)కు పంపిస్తారు.

స్టెప్ 6

స్టెప్ 6

వాళ్లు మీ వివరాలను నిర్థారణ చేసుకున్న తరువాత దాన్ని తన పైఅధికారికి పంపిస్తారు. అక్కడితో ప్రాసెస్ పూర్తి అవుతుంది.

స్టెప్ 7

స్టెప్ 7

ఈ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో) విచక్షణ మేరకుకార్డు జారీ చేస్తారు. ఇది కొన్ని రోజుల తరువాత పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది.

స్టెప్ 8

స్టెప్ 8

ఒక వారం రోజుల్లో గాని లేకుంటే 15 రోజుల్లో గాని పోస్ట్ ద్వారా మీ ఓటర్ ఐడీ మీ చేతికి వస్తుంది. మీరు ఎప్పటికప్పుడే మీ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.

ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయటం ఎలా..?

ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయటం ఎలా..?

ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ (వయసును బట్టి) తప్పనిసరిగా తమ మీ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.

బయోమెట్రిక్ వివరాలను మరింత గోప్యంగా ఉంచుకోవాలంటే..

ఎంతో విలువైన ఈ బయోమెట్రిక్ వివరాలను తమ అనుమతి లేకుండా తీసుకుని దుర్వినియోగపరిచారంటూ కొందరు ఆరోపించటంతో ఆధార్ బయోమెట్రిక్ అంత సురక్షితం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. UIDAI సర్వర్లలో లాక్ అయి ఉండే బయోమెట్రిక్ సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచుకోవాలంటే దానిని లాక్ చేసుకోవటం ఉత్తమమైన మార్గం. ఇలా చేయటం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను వేరొకరు యాక్సిస్ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే అన్‌లాక్ చేసుకుని, అవసరం లేనపుడు లాక్ చేసుకోవచ్చు. యూజర్ తన Aadhaar biometric డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు అలానే రిక్వస్ట్ లను one-time password ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు. వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర అలానే ఐరిస్ స్కాన్ లాక్ చేయబడుతుంది. Aadhaar biometric authenticationను లాక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

 

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్... ముందుగా మీ బ్రౌజర్ నుంచి

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్... ముందుగా మీ బ్రౌజర్ నుంచి

https://resident.uidai.gov.in/biometric-lockలోకి వెళ్లండి. సంబంధిత పేజీ ఓపెన్ అయిన తరువాత 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత సెక్యూరీటీ కోడ్ కాలమ్ కనిపిస్తుంది. అక్కడ బాక్సలో కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. పేజీలో క్రింద కనిపించే Generate OTP పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో one-time password అందుతుంది.

సమాచారం పూర్తిగా లాక్ కాబడుతుంది...

సమాచారం పూర్తిగా లాక్ కాబడుతుంది...

ఆ OTPని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి Verify ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాత బయోమెట్రిక్ లాకింగ్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు క్రింద కనిపించే 'Login' లింక్ పై క్లిక్ చేయండి. ఈ ప్రాసస్ కంప్లీ అయిన వెంటనే "Congratulations! Your Biometric data is locked అన్న మెసేజ్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. దీంతో మీ Aadhaar biometric సమాచారం పూర్తిగా లాక్ కాబడుతుంది.

మీ ఆధార్ కార్డులో తుప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోండిలా..?

మీ ఆధార్ కార్డులో తుప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోండిలా..?

మీ ఆధార్ కార్డులో తప్పులన్నాయా..? వాటిని సరిదిద్దు కోవటం ఇప్పుడు చాలా సులభం. మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు. ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

స్టెప్ 1 ముందుగా మీ కంప్యూటర్ నుంచి ఈ ఆధార్ అప్‌డేట్ లింక్‌లోకి వెళ్లండి. https://resident.uidai.net.in/update-data

 

స్టెప్ 1 ముందుగా మీ కంప్యూటర్ నుంచి ఈ ఆధార్ అప్‌డేట్ లింక్‌లోకి

స్టెప్ 1 ముందుగా మీ కంప్యూటర్ నుంచి ఈ ఆధార్ అప్‌డేట్ లింక్‌లోకి

వెళ్లండి. https://resident.uidai.net.in/update-data

 

 

 

స్టెప్ 2 ఆ

స్టెప్ 2 ఆ

ఆ పేజీలో కిపించే Update Aadhaar Data బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

Update Aadhaar Data బటన్ క్లిక్ చేసిన తరువాత మీ ఈ పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4 ఆ

స్టెప్ 4 ఆ

పేజీలో మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను Text Verification బాక్సులో ఎంటర్ చేయండి. అనంతరం send OTP బటన్ పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసినట్లయితే Data Update Request పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు.

స్టెప్ 5

స్టెప్ 5

Data Update Request పేజీలోకి వెళ్లిన తరువాత మీరు మార్పు చేయాలనకుంటున్న వివరాలకు సంబంధించిన బాక్సులను మార్క్ చేసి పేజీ క్రింద కనిపించే "Submit" బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కొత్త పేజీలోకి రిడైరెక్ట్ కాబడతారు. ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది.

స్టెప్ 6

స్టెప్ 6

చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.

స్టెప్ 7

స్టెప్ 7

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

స్టెప్ 8

స్టెప్ 8

కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

స్టెప్ 9

స్టెప్ 9

ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు. చిరునామా.. చిరునామా 1: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 10, చింద్వారా, మధ్య ప్రదేశ్ - 480001, భారతదేశం. చిరునామా 2: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ No.99, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034, భారతదేశం.

స్టెప్ 10

స్టెప్ 10

కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్‌డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.

Best Mobiles in India

English summary
How to Check if Your Phone is 4G Enabled Read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X