ల్యాప్‌టాప్‌ను LED & LCD టీవీకి కనెక్ట్ చేయడం ఎలా?

|

ఇంటిలో చాలా మంది ఒంటరిగా ఉన్న సమయాల్లో వారి యొక్క ఇంటిలో ఉన్న పెద్ద టీవీ స్క్రీన్ మీద సినిమాలను మరియు వారికి ఇష్టమైన వెబ్ సిరీస్‌లను చూడడానికి ఇష్టపడతారు. OTT యాప్ లు మరియు గూగుల్ వంటి వెబ్‌సైట్‌లకు నేరుగా యాక్సిస్ లను కలిగి ఉన్న స్మార్ట్ టీవీలు చాలా తక్కువగా ఉన్నాయి.

 

ల్యాప్‌టాప్‌

ఇప్పటికే మీ ఇంటిలో ఉన్న టీవీ బ్రాండ్లకు కూడా మీ యొక్క ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేయవచ్చు. కొన్ని పద్దతులను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌లోని కంటెంట్ ను టీవీలలో చూడవచ్చు. ప్రతిఒకరు తమ ల్యాప్‌టాప్‌ను ఎల్‌సిడి లేదా LED టివికి కనెక్ట్ చేయగలరు మరియు తమకు నచ్చిన అభిమాన సినిమాను పెద్ద స్క్రీన్ మీద ఆస్వాదించగలరు. ఇందు కోసం మీ ల్యాప్‌టాప్ ను టెలివిజన్‌తో కనెక్ట్ చేయడానికి HDMI కేబుల్ అవసరం ఉంటుంది.

కేబుల్ ఉపయోగించి కనెక్షన్‌ను పొందడానికి ఈ దశలు పాటించండి

కేబుల్ ఉపయోగించి కనెక్షన్‌ను పొందడానికి ఈ దశలు పాటించండి

*** టీవీ మరియు ల్యాప్‌టాప్ రెండింటికి పవర్ ఆన్ చేసి వాటి యొక్క సంబంధిత పోర్ట్‌లకు HDMI కేబుల్‌ను అటాచ్ చేయండి.

*** మీ టీవీ యొక్క రిమోట్ బటన్‌లలో గల ‘ఇన్‌పుట్' లేదా ‘సోర్స్' బటన్‌ను నొక్కండి. టీవీ, AV, HDMI 1, HDMI 2 తో సహా ఎంపికల జాబితా కనిపిస్తుంది. HDMI 1 ఎంపికకు స్క్రోల్ చేసి దానిపై క్లిక్ చేయండి.

 

 

Jio అపరిమిత సేవలు సంవత్సరం పాటు ఉచితం... ఈ స్మార్ట్‌ఫోన్‌ కొన్నవారికి మాత్రమేJio అపరిమిత సేవలు సంవత్సరం పాటు ఉచితం... ఈ స్మార్ట్‌ఫోన్‌ కొన్నవారికి మాత్రమే

ఒకవేళ మీరు మీ టీవీలో ల్యాప్‌టాప్ యొక్క ఖచ్చితమైన స్క్రీన్‌ను పొందలేకపోతే కింద ఉన్న దశలను అనుసరించండి
 

ఒకవేళ మీరు మీ టీవీలో ల్యాప్‌టాప్ యొక్క ఖచ్చితమైన స్క్రీన్‌ను పొందలేకపోతే కింద ఉన్న దశలను అనుసరించండి

*** మీ ల్యాప్‌టాప్‌లో 'RUN' చేయడానికి వెళ్లండి.

*** ‘కంట్రోల్' అని టైప్ చేసి ఎంటర్ కీని నొక్కండి.

*** తరువాత క్రొత్త విండో కనిపిస్తుంది. ఎడమ వైపున ఉన్న ప్యానెల్ నుండి ‘డిస్ప్లే' చదివే ఎంపికను ఎంచుకోండి.

*** ఇప్పుడు మీ స్క్రీన్ యొక్క ఎడమ వైపున ఉన్న ప్యానెల్‌లో అందుబాటులో ఉన్న Adjust రిజల్యూషన్ ఎంపికపై క్లిక్ చేయండి.

*** ‘డిస్ప్లే' చదివే డ్రాప్‌డౌన్ ఎంపిక కనిపిస్తుంది. ఇది మీ ల్యాప్‌టాప్ పేరు మరియు టీవీ మధ్య ఎంపికను చూపిస్తుంది. అందులో టీవీ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు మీ టెలివిజన్‌లో ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను చూడగలరు.

*** మీ టీవీ స్క్రీన్‌లో ఉత్తమ అవుట్పుట్ కోసం మీరు ల్యాప్‌టాప్ డిస్ప్లే ప్యానెల్ నుండి మీ ఎంపికను బట్టి రిజల్యూషన్‌ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ల్యాప్‌టాప్ కంట్రోల్ పానెల్ నుండి బ్రైట్ నెస్ మరియు కాంట్రాస్ట్ కూడా సర్దుబాటు చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Connect Your Laptop to TV

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X