Google Lens: చేతి వ్రాతను డెస్క్‌టాప్‌లో PDF రూపంలో పొందడం ఎలా?

|

గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రారంబిస్తున్నది. ఈ క్రొత్త ఫీచర్ లలో భాగంగా గూగుల్ లెన్స్ ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గూగుల్ లెన్స్ ఫీచర్ ను ఉపయోగించి వినియోగదారులు వారి వద్ద గల నోట్స్ మరియు కాగితాల మీద గల వచనాన్ని కాపీ చేయడానికి అనుమతిస్తుంది.

గూగుల్ లెన్స్ ఫీచర్

గూగుల్ లెన్స్ ఫీచర్

అలాగే కాపీ చేయబడిన టెక్స్ట్ ను వారి యొక్క ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లకు పంపడానికి గూగుల్ లెన్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ గూగుల్ లెన్స్ ఫీచర్ లో గల ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ అసిస్టెంట్‌తో పాటుగా ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ వినియోగదారులను అందరిని కూడా అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఈ ఫీచర్ ను ఉపయోగించి తమకు కావలసిన నోట్స్ ను సులభంగా డిజిటలైజ్ రూపంలో పొందవచ్చు. గూగుల్ లెన్స్ ఫీచర్ టెక్స్ట్ యొక్క సందేశాన్ని గుర్తించి ఆ వచనాన్ని ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

గూగుల్ లెన్స్ ఫీచర్

ఏదేమైనా గూగుల్ లెన్స్ ఫీచర్ పనిచేయడానికి చేతివ్రాత కొంత చక్కగా ఉండాలని కంపెనీ తెలిపింది. చేతివ్రాత సరిగ్గా లేని వినియోగదారులు కూడా ఈ ఫీచర్ ను ప్రయత్నించవచ్చు కానీ పూర్తి మొత్తంలో కాపీ చేయబడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఏదేమైనా కనుగొనబడిన టెక్స్ట్ యొక్క ఖచ్చితత్వం టాస్ కోసం ఉంటుంది.

Google Chrome
 

Google Chrome

గూగుల్ లెన్స్ ఫీచర్ గూగుల్ క్రోమ్ యొక్క తాజా వెర్షన్‌తో మాత్రమే పనిచేస్తుంది అని గుర్తుంచుకోవాలి. మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో Google Chrome యొక్క తాజా వెర్షన్‌ను వాడుతున్నారని మొదట నిర్ధారించుకోండి. ఈ క్రొత్త ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లో సర్వర్ వైపు అప్ డేట్ గా లభిస్తుంది. అయితే గూగుల్ లెన్స్, గూగుల్ అసిస్టెంట్ మరియు గూగుల్ ఫోటోల యాప్ లను కూడా అప్ డేట్ చేయడం మంచిది. కాగితం పేపర్ నుండి వచనాన్ని ఎలా కాపీ చేయాలో మరియు మీ PC లేదా ల్యాప్‌టాప్‌కు ఎలా పంపించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ లెన్స్ ఉపయోగించి నోట్ బుక్ నుండి సారాంశాన్ని ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కాపీ చేసే దశలు

గూగుల్ లెన్స్ ఉపయోగించి నోట్ బుక్ నుండి సారాంశాన్ని ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కాపీ చేసే దశలు

స్టెప్ 1:

గూగుల్ లెన్స్ ఫీచర్ ను ఉపయోగించడానికి మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ యొక్క తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోవాలి. అదనంగా మీ స్మార్ట్‌ఫోన్ యొక్క గూగుల్ యాప్ లను కూడా అప్ డేట్ చేసుకోవాలి.


స్టెప్ 2:


మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ మరియు డెస్క్‌టాప్‌ రెండింటిలోనూ ఒకే గూగుల్ అకౌంటుతో సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

 

స్టెప్ 3

స్టెప్ 3

సత్వరమార్గం కోసం గూగుల్ లెన్స్ లేదా గూగుల్ ఫోటోల యాప్ కి గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించండి. మీరు గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగిస్తుంటే కనుక ఎడమ వైపు దిగువ భాగంలో గల "గూగుల్ లెన్స్" బటన్‌ను ఓపెన్ చేయండి. ఇది మిమ్మల్ని వ్యూఫైండర్‌కు తీసుకువస్తుంది. ఇక్కడ మీరు నోట్స్ యొక్క ఫోటోను తనిఖీ చేయవచ్చు మరియు సంగ్రహించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే ఫోటోలను సంగ్రహించి ఉంటే కనుక గూగుల్ ఫోటోల నుండి వాటిని పొందవచ్చు. ఫోటోను ఓపెన్ చేసి ఆపై దిగువ ప్రాంతంలోని "గూగుల్ లెన్స్" చిహ్నాన్ని నొక్కండి. ఆపిల్ iOS వినియోగదారులు iOS కోసం గూగుల్ యాప్ లో లెన్స్ లోగోను కనుగొనవచ్చు.

స్టెప్ 4

స్టెప్ 4

మీరు గూగుల్ అసిస్టెంట్ లేదా గూగుల్ లెన్స్‌లోని ఫోటోను క్లిక్ చేసిన వెంటనే లేదా గూగుల్ ఫోటోల యాప్ లోని ఫోటోను ఎంచుకున్న వెంటనే గూగుల్ లెన్స్ యొక్క చిహ్నాన్ని నొక్కండి. ఇందులో గల సాఫ్ట్‌వేర్ ఫొటోలోని టెక్స్ట్‌ని గుర్తించి దానిని హైలైట్ చేస్తుంది. వచన సారాంశాన్ని తీసుకురావడానికి ఎక్కువసేపు నొక్కి ఉంచండి మరియు మీకు అవసరమైన వచనాన్ని ఎంచుకోండి. మీరు వచనాన్ని ఎంచుకున్న వెంటనే మీరు దిగువ వైపున గల "కంప్యూటర్‌కు కాపీ" బటన్‌ను నొక్కిన తర్వాత యాప్ టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి వచనాన్ని పేస్ట్ చేయవచ్చు లేదా సవరించడానికి "సవరించు" కు నావిగేట్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Copy Text from Paper to PC using Google Lens

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X