మీ ఓటర్ ఐడీలో తప్పుల్ని ఆన్ లైన్ లో సవరించుకోండిలా...

|

ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి కనీస బాధ్యత, ఓటరుగా నమోదు చేసుకోవడం, గుర్తింపు కార్డు పొందడం, ఓటరు లిస్టులో పేరు చూసుకోవడం, గుర్తింపు కార్డు జారీ అయిన తర్వాత కూడా ఓటరు లిస్టులో పేరు లేనప్పుడు ఓటర్ లిస్టులో పేరు నమోదయ్యేలా పలు దశల్లో ఆన్ లైన్ సేవలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మరో సదుపాయం కూడా కల్పించింది. ఆన్ లైన్ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులో తప్పులు సరిదిద్దుకునే అవకాశం కలిగింది. సాధారణంగా పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ తలెత్తడం, అడ్రస్ లో మార్పులు అనేవి సహజమే. ఇప్పుటు అలాంటి వాటిని కూడా ఆన్ లైన్ లో సరిచేసుకోవచ్చు.

 
మీ ఓటర్ ఐడీలో తప్పుల్ని ఆన్ లైన్ లో సవరించుకోండిలా...
ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీలో సవరణలు చేసుకోండిలా ...
1. ముందుగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ వెబ్ సైట్ లోకి వెళ్లండి, అందులోనే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ను క్లిక్ చేయండి. లేదంటే ఎన్ వీఎస్ పీ ఫారం 8 పేజ్ లోకి డైరక్టుగా వెళ్లవచ్చు.
2. డ్రాప్ డౌన్ మెనూ ద్వారా మీ భాషను ఎంచుకోవచ్చు. టాప్ లో కొన్ని ప్రాథమిక అంశాలైన మీ రాష్ట్రం, అసెంబ్లీ లేదా పార్లమెంటరీ నియోజక వర్గం లాంటివి ఎంపిక చేసుకోండి.
3. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేయగా, ఏ విభాగంలో సవరణ చేయాలనుకుంటున్నారో ఆ విభాగాన్ని టిక్ చేయండి. ఇందులో మీరు ఏ విభాగాలను సవరణ చేయాలనుకున్నారో ఆ విభాగాలను సవరణ చేసుకోవచ్చు.
4. ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా టిక్ చేయగానే, మీరు టిక్ చేసిన బాక్సు రంగు గ్రే నుంచి వైట్ కలర్ లోకి మారుతుంది. అందులో మీ వివరాలను ఎడిట్ చేసుకునే వీలుంది.
5. ఇప్పుడు కింద వైపు పేర్కొన్న అన్ని విభాగాలను పూర్తి చేసి, మీ ఈ మెయిల్ ఐడీ, అలాగే మొబైల్ నెంబర్ వంటివి కూడా పూరించండి.
6. పై వివరాలు అన్ని నింపిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ ఈ మెయిల్ చెక్ చేసుకోండి, మీరు ఈ మెయిల్ పొందినట్లయితే అందులో ట్రాక్ యువర్ ఓటర్ ఐడీ అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ పని ఎంత వరకూ అయ్యిందో తెలుసుకునే వీలుంది.
ఓటర్ ఐడీ కరెక్షన్ లో సాధారణంగా తలెత్తే సమస్యలకు కింద కొన్ని సమాధానాలను పేర్కొన్నాం..

ఇకపై మీరు ఆధార్ నంబర్ చెప్పనవసరం లేదు,Virtual IDపై ఓ స్మార్ట్ లుక్కేయండి
ఓటర్ ఐడీ కరెక్షన్ కొరకు ఎలా అప్లై చేయాలి ?
ఈ విధానం పైనా పేర్కనబడింది. ఎన్‌వీఎస్‌పీ వెబ్ సైట్ లోకి వెళ్లిన అనంతరం ఫారం 8 నింపి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ప్రింటవుట్ తీసి మీ సమీపంలోని ఎలక్టోరల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటర్ ఐడీలో కరెక్షన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి ?
మీరు ఏ విభాగంలో అయితే సవరణలు చేయాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సరిపోతుంది. ఉదాహరణకు మీ ఫోటోగ్రాఫ్ తప్పుగా పడితే ఫోటో ఇవ్వాలి. ఒక వేళ మీ పేరు తప్పుగా పడితే బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లేదా ఇతర అధికారిక పత్రం ఏదైనా సమర్పిస్తే సరిపోతుంది.

ఓటర్ ఐడీలో కరెక్షన్స్ ఎంత కాలం పట్టే అవకాశం ఉంది ?
మీరు ఇచ్చిన ఆధారాలతో కరెక్షన్స్ చేసి కొత్త ఐడీ కార్డు వచ్చేందుకు 30 రోజుల సమయం పట్టే వీలుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
కొత్త ఐడీ కార్డు వస్తే.. పాత ఓటర్ ఐడీ తిరిగి ఇచ్చేయాలా ?
అవసరం లేదు.. కొత్త ఐడీ కార్డు వచ్చిన వెంటనే పాతది వాడటం ఆపేసి, కొత్తదాన్ని ఉపయోగించుకోండి.

Best Mobiles in India

English summary
How to Correct or Update Voter ID Card Details Online More news at Gibzot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X