Instagram Reels వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

ఇండియాలో కొన్ని రోజుల ముందు టిక్‌టాక్‌పై నిషేధం విధించిన విషయం అందరికి తెలిసిందే. కానీ చిన్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాలా మంది టిక్‌టాక్‌కు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు దీనికి ప్రత్యాన్మాయంగా చాలా యాప్ లు అందుబాటులోకి వచ్చాయి.

 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

ఇందులో భాగంగా ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అనే కొత్త వీడియో ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది కూడా ముఖ్యంగా టిక్‌టాక్ తరహా చిన్న వీడియోలను రూపొందించడానికి తయారుచేసింది. టిక్‌టాక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం మరియు మరొకరికి షేర్ చేయడం చాలా సులభంగా ఉండేది. కాని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లోని వీడియోలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోలేరు. మీరు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుతూ ఉంటె కనుక వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోలను సేవ్ చేసే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోలను సేవ్ చేసే పద్ధతులు

1. ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేయండి> సెర్చ్ ఎంపికను నొక్కండి> మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన రీల్స్ వీడియోను ఓపెన్ చేయండి.

2. ప్రత్యామ్నాయంగా మీరు యూజర్ యొక్క ప్రొఫైల్‌ను కూడా ఓపెన్ చేయవచ్చు> క్రొత్త రీల్స్ ట్యాబ్‌ను నొక్కండి. ఇది ఇప్పుడు IGTV టాబ్ పక్కన ఉంటుంది. దీనిని మీరు గమనించవచ్చు> మీరు డౌన్‌లోడ్ చేయవలసిన రీల్స్ వీడియోను ఎంచుకోండి.

3. వీడియో లోడ్ అయిన తర్వాత మూడు-చుక్కల గుర్తును నొక్కండి> తరువాత సేవ్ ఎంపికను ఎంచుకోండి.

 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో సేవ్
 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో సేవ్

4. సేవ్ చేసిన రీల్స్ వీడియోను యాక్సిస్ చెయ్యడానికి ఇన్‌స్టాగ్రామ్ హోమ్‌స్క్రీన్‌కు తిరిగి వెళ్లండి> మీ ప్రొఫైల్ గుర్తు మీద నొక్కండి> తరువాత హాంబర్గర్ చిహ్నాన్ని నొక్కండి> సెట్టింగ్‌ల ఎంపికను ఎంచుకోండి> అకౌంట్ ను ఎంచుకోండి > సేవ్‌ ఎంపికను ఎంచుకోండి.

5. తరువాత ఇందులో మీరు ఇటీవల సేవ్ చేసిన వీడియోలను అన్ని పోస్ట్‌ల ఫోల్డర్‌లో కనుగొంటారు.

 

Also Read: వాట్సాప్ బిజినెస్ లో కొత్త ఫీచర్స్!!! మీరు ట్రై చేసారా??Also Read: వాట్సాప్ బిజినెస్ లో కొత్త ఫీచర్స్!!! మీరు ట్రై చేసారా??

 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగించే వారు వారి యొక్క ఫోన్ లో ఈ చిన్న వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

1. గూగుల్ ప్లేకి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్ వీడియో డౌన్‌లోడర్ ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌ను రీపోస్ట్ చేయండి.

2. ఇన్‌స్టాగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి సెటప్ చేయండి.

3. యాప్ సెటప్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌కు తిరిగి వెళ్లి మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న రీల్స్ వీడియోను ఎంచుకోండి.

 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో డౌన్‌లోడ్

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో డౌన్‌లోడ్

4. తరువాత మూడు-చుక్కల గుర్తును నొక్కండి. తరువాత "కాపీ లింక్' ఎంపికను నొక్కండి.

5. ఇన్‌స్టాగ్రామ్ వీడియో డౌన్‌లోడర్ ను ఓపెన్ చేసి మీరు ఇప్పుడే కాపీ చేసిన URL ను అక్కడ పేస్ట్ చేయండి.

6. ఇప్పుడు మీ ఫోన్ గ్యాలరీకి వెళ్లి మీరు డౌన్‌లోడ్ చేసిన రీల్స్ వీడియోను చూడవచ్చు. దీన్ని మూడవ పార్టీ యాప్ ల ద్వారా సవరించవచ్చు లేదా ఇతరులతో పంచుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Download Instagram Reels Videos on Your Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X