జియో ఉచిత ఆఫర్‌ని మరో సంవత్సరం పొడిగించుకోండిలా..

Written By:

ఇప్పుడు టెలికం మార్కెట్‌ని షేక్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియో మాత్రమే. వెలకం ఆఫర్‌తో ముఖేష్ అంబానికి ఓ పెద్ద సంచలనానికే తెరలేపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ షో రూంల్లో జియో సిమ్‌లు పొందవచ్చని కూడా చెప్పారు. ఈ సంవత్సరం చివరి వరకు వెలకం ఆఫర్‌తో జియో సిమ్‌ని వాడుకోవచ్చని కూడా తెలిపారు. అయితే ఆ తరువాత కూడా వన్ ఇయర్ వరకు జియో సిమ్‌ని వాడుకునే అవకాశం ఉంది. ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే చాలు. మీ ఆఫర్ పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

వాట్సప్ నుంచి బయటకొస్తే..అదిరే ఛాటింగ్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1: రూటెడ్ ఫోన్లు

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ రూటెడ్ ఫోన్లు అయి ఉండాలి. రూటెడ్ లేని ఫోన్లలో ఇది పనిచేయదు. ఐఫోన్ యూజర్స్ కూడా ఈ అవకాశాన్ని పొందలేరు.

స్టెప్ 2: Xposed Installer

తరువాత మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘Xposed Installer డౌన్‌లోడ్ చేసుకోండి.ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 ఫోన్లకు ఇది చాలా ఈజీగా ఇన్ స్టాల్ అవుతుంది. లాలీపాప్, మార్ష్ మల్లో యూజర్లు ప్లాష్ పైల్ తో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు Xposed IMEI Changerని డౌన్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ 3 : ఫోన్ రిబూట్

అది ఇన్‌స్టాల్ అయిన తరువాత IMEI changer ను మార్చి మీ ఫోన్ రిబూట్ చేయండి.

స్టెప్ 4 : IMEI నంబర్

వెంటనే మీ IMEI నంబర్ మార్చి వేయండి. Lyf IMEI నంబర్ ఇవ్వండి. దీనికి సంబంధించిన నంబర్లు మీకు దగ్గర్లోని రిలయన్స్ షో రూంలో కూడా దొరికే అవకాశం ఉంది. ఆ అవకాశం మీకు లేకుంటే IMEI Number: 91150425388**** చివరి నాలుగు నంబర్లు మీ సొంత నంబర్లకు మార్చుకోండి.

స్టెప్ 5: మై జియో యాప్ డౌన్ లోడ్

నంబర్ చేంజ్ చేసిన తర్వాత మై జియో యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. అందులో అన్నీ యాప్స్ ఇన్ స్టాల్ చేయండి. ఇది Lyf ఫోన్లలో ఇన్ స్టాల్ అవుతున్నట్లుగా మీకు కనిపిస్తుంది.

స్టెప్ 6 : ఫోన్ రిబూట్

మళ్లీ ఓ సారి మీ ఫోన్ రీబూట్ చేయండి

స్టెప్ 7 : జియో యాప్ ఓపెన్

ఇప్పుడు మీ జియో యాప్స్ ని ఓ సారి ఓపెన్ చేయండి. అందులో లాగిన్ అనే ఆప్సన్ ని ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మీ ఫోన్ లాగిన్ అయినట్లుగా కనిపిస్తుంది. జియో ఆఫర్ 2017 వరకు పొడిగించినట్లుగా కనిపించే అవకాశం ఉంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గమనిక : కొన్ని సంధర్భాల్లో ఇది పనిచేయకపోవచ్చు. కాబట్టి మీరు చేసే ఈ ప్రయోగానికి గిజ్‌బాట్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.

English summary
How to Extend Reliance Jio Welcome Offer Until December 2017 [100% Working] Read more
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot