ఆపిల్ యొక్క డివైస్ లలో నకిలీ వాటిని గుర్తించడం ఎలా?

|

ఆపిల్ సంస్థకు చెందిన స్మార్ట్ ఫోన్ మరియు వాటికి చెందిన డివైస్ ల ఉపయోగం ఎక్కువగా ఉంది. కొనుగోలుదారులు ఎక్కువగా ఆపిల్ బ్రాండుకు చెందిన డివైస్ లను వాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనిని అదునుగా తీసుకున్న చాలా మంది ఆపిల్ పేరుతో నకిలి ప్రొడక్టులను తయారుచేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వార ఈ అమ్మకాలు ఊపందుకున్నాయి.

 ఆపిల్ బ్రాండ్
 

ఆన్‌లైన్ ద్వారా ఆపిల్ బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు వాటి ధర ట్యాగ్‌లను పరిశీలించడమే కాకుండా అది ఒరిజినల్ ప్రోడక్ట్ లేక నకిలీదా అని ముందుగా తెలుసుకోవాలి. ఆన్‌లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు వాటి ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి. చేతికి వచ్చాక అది ఒరిజినల్ అవునా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతు

గ్రే / మెటాలిక్ ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్స్

గ్రే / మెటాలిక్ ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్స్

ఒరిజినల్ ఆపిల్ ప్రోడక్ట్ కనెక్టర్ ఎల్లప్పుడూ గ్రే / మెటాలిక్ ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్లతో వస్తుంది. వైట్ లేదా బ్లాక్ ఫేస్ ప్లేట్ ఇన్సర్ట్స్ ఉంటే కనుక అది నకిలీది.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో!!! ఆకాశాన్ని అంటే ధర!!!

 కనెక్టర్ యొక్క వెడల్పు మరియు పొడవు

కనెక్టర్ యొక్క వెడల్పు మరియు పొడవు

ఒరిజినల్ ఆపిల్ ప్రోడక్ట్ కనెక్టర్ యొక్క వెడల్పు మరియు పొడవు 7.7 మిమీ x 12 మిమీ గా ఉంటుంది. వెడల్పు, పొడవు లేదా మందం విషయంలో ఏదైనా మార్పు ఉన్న అది నకిలీది అని అర్థం.

ఆపిల్ ఐఫోన్ వారంటీ గురించి మీకు తెలియని విషయాలు

యుఎస్‌బి
 

ఇవే కాకుండా కింద తెలిపిన పద్దతులను పాటించి కూడా నకిలీది ఎదో తెలుసుకోవచ్చు.

-- యుఎస్‌బి-కనెక్టర్ చివరలో యుఎస్‌బి టైప్-ఎ ఇంటర్‌లాక్‌లు ట్రాపెజోయిడల్ మరియు కేబుల్ అంచులు సమానంగా ఉంటాయి.ఇలా లేకపోతే అవి ఖచ్చితంగా నకిలీది.

--- నిజమైన కేబుళ్లపై కాంటాక్ట్ పాయింట్లు ఎల్లప్పుడూ బంగారు పూతతో ఉంటాయి.

--- USB కనెక్షన్ యొక్క దాని ఉపరితలం ఏకరీతిగా మరియు ఫ్లాట్ గా సమానంగా ఉంటుంది.

నకిలీ ఐఫోన్‌లతో ఆపిల్‌ను మోసం చేసి జైలు పాలైన చైనా విద్యార్థి

ఆపిల్

--- ఆపిల్ యొక్క నిజమైన ఛార్జర్‌లపై ‘డిజైన్డ్ బై ఆపిల్ అండ్ అసెంబుల్ ఇన్ చైనా ' అని ముద్రించిన పదాలు ఉంటాయి.

--- ఛార్జింగ్ అడాప్టర్‌లో గల స్పెల్లింగ్‌లో ఏదైనా అక్షరదోషం ఉందేమో సరిగ్గా గమనించడం ద్వారా కూడా నకిలి దానిని కనుగొనవచ్చు.

--- కేబుల్స్, మైక్రో-యుఎస్బి ఎడాప్టర్లు మరియు 30-పిన్ ఎడాప్టర్లు వంటి అన్ని ఆపిల్ ఉపకరణాలు లేజర్-ఎచెడ్ USB చిహ్నంతో వస్తాయి.

--- ఆపిల్ వాచ్ ఛార్జింగ్ డాక్‌కు దాని వైర్‌లెస్ ఛార్జింగ్ ప్లేట్‌లో ఖచ్చితమైన కర్వ్ ఉండదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Findout Fake Apple Accessories

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X