75 పైసలకే 1 జిబి డేటా: బిఎస్ఎన్ఎల్ సంచలనం

Written By:

జియో ఉచిత ఆఫర్లతో టెక్ దిగ్గజాలను హడలెత్తిస్తుంటే దానికి కౌంటర్ గా బిఎస్ఎన్ఎల్ సైతం రీ కౌంటర్లతో జియోని హడలెత్తిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ నేఫథ్యంలో జియో కన్నా తక్కువగా 1 జిబి 4జీ డేటాను కేవలం రూపాయి కన్నా తక్కువ ధరకే అందిస్తోంది. కష్టమర్లను తన వైపు తిప్పుకునేందుకు బిఎస్ఎన్ఎల్ ఈ రకమైన ఎత్తుగడలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా ప్రవేశపెట్టిన ప్లాన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి మరి.

జియోకి కౌంటర్: BSNL 24 గంటలు ఫ్రీ కాలింగ్, అన్‌లిమిటెడ్ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

కొత్త కష్టమర్ల కోసం అలాగే బ్రాడ్ బాండ్ యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ BB249 పేరుతో ఓ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రకారం 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో 2జీబి డేటాను పొందవచ్చు. అది అయిపోయిన తరువాత మీరు ఎటువంటి ఛార్జీలు లేకుండా అన్ లిమిటెడ్ అప్ లోడింగ్ అలాగే డౌన్ లోడింగ్ ను పొందవచ్చు. ఇది 1 ఎంబీపీఎస్ స్పీడ్ తో మీకు లభిస్తుంది.

#2

ఈ ప్లాన్ 6 నెలల వరకు మీరు వాడుకోవచ్చు. అంటే మీకు నెలకు 49 రూపాయల కాస్ట్ అవుతుంది. అదే రోజుకి కేవలం 75 పైసలు మాత్రమే ఛార్జ్ అవుతుంది.

#3

ఇది హోమ్ బ్రాడ్ భాండ్ ప్లాన్. దీన్ని కేవలం పర్సనల్ గా వాడుకోవటానికి మాత్రమేనని కంపెనీ తెలిపింది. దీన్ని కమర్షియల్ గా వాడుకోవటానికి కుదరదని ఆఫీసు పనుల కోసం కూడా వాడుకోలేరని కేవలం మీరు వ్యక్తిగతంగా వాడుకోవటానికేనని కంపెనీ చెబుతోంది.

#4

ఈ ప్లాన్ మీరు సొంతం చేసుకోవాలంటే మీ ఒరిజినల్ ప్రూఫ్స్ (ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , ఓటర్ ఐడీ )తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను బిఎస్ఎన్ఎల్ ఆఫీసుకు తీసుకెళ్లాలి.

#5

బిఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లిన తరువాత మీరు BB249 ప్లాన్ గురించి వారికి చెబితే వారు మీ డాక్యుమెంట్లను చూసి వెరిఫై చేసిన తరువాత మీకు ప్లాన్ గురించి చెబుతారు.

#6

అది అయిపోయిన తరువాత 6నెలల వ్యాలిడితో మీకు 249 ప్లాన్ లభిస్తుంది. మీరు అదనంగా ల్యాండ్ లైన్ కి సంబంధించినవి కాని రూటర్ కు కాని పే చెయ్సాల్సి రావచ్చు.

#7

అంతా అయిపోయిన తరువాత వారం రోజుల్లో మీకు BB249 ప్లాన్ మీ ఇంటికి వస్తుంది. 6 నెలల పాటు మీరు దీన్ని వాడుకోవచ్చు.

#8

మీరు 2జిబి అయిపోయిన తరువాత 1 ఎంబిపిఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 6 నెలల తరువాత రూ. 799తో మీరు కొత్త ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇవే ఫీచర్లు లభిస్తాయి.

#9

అయితే మీరు పొందే ప్లాన్ లో కేవలం ఆదివారం పూట మాత్రమే అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే సోమవారం నుంచి శనివారం వరకు 9PM to 7AM మధ్యలో ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL 4G Unlimited Broadband Plans: BB249 Internet Data Offers
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting