Home
How to

మీ పేరు మీద నకిలీ సిమ్‌ కార్డులు ఉన్నాయా.. ఇలా వెంటనే తెలుసుకొని, బ్లాక్‌ చేసుకోండి..!

భారత్‌ లో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాల స్థాయిలో, అధికారుల స్థాయిలో కఠిన చర్యలు తీసుకున్నా, ఎక్కడో చోట సైబర్ నేరాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే టెలికాం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త సిమ్ కార్డుల విక్రయంపై కఠిన నిబంధనలు విధించింది. దీంతోపాటు ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్‌ కార్డులను (Sim Cards) మాత్రమే కలిగి ఉండేందుకు అర్హుడని పేర్కొంది. దీంతోపాటు కొత్త సిమ్‌ కార్డులను ఆధార్ బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా మాత్రమే సిమ్‌ కార్డులు విక్రయించాలని ఆదేశాలు జారీచేసింది.

ఆధార్ బయోమెట్రిక్‌ లో ఇబ్బందులు తలెత్తితే ఫోటో వెరిఫికేషన్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. సైబర్ నేరాలను నకిలీ సిమ్‌ కార్డుల ద్వారా పాల్పడుతున్నారు. దీనిపై గతంలో ప్రధాని మంత్రి కార్యాలయం కూడా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) కీలక సూచనలు చేసింది. దీంతోపాటు టెలికాం శాఖ వేలాది నకిలీ సిమ్‌ కార్డులను బ్లాక్ చేస్తోంది.

How to know fake sim cards on your name here is the stepwise guide in telugu

అయితే వ్యక్తిగతంగా మొబైల్‌ యూజర్‌ లు కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ తమ పేరుపై ఎమైనా నకిలీ సిమ్‌ కార్డులు ఉన్నాయో లేదో తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలి. స్పామ్‌ కాల్స్‌, నకిలీ సిమ్ కార్డులపై ఫిర్యాదులు, పొగొట్టుకున్న ఫోన్‌లపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలికాం శాఖ గతంలో వెబ్‌సైట్‌, యాప్‌ను లాంచ్‌ చేసింది.

సంచార్‌ సాథీ (Sanchar Saathi) పేరుతో వెబ్‌సైట్‌, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫాం గురించి సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఈ యాప్‌ ద్వారా నకిలీ సిమ్‌ కార్డులను గుర్తించడం ఎలాగో చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

భారత్‌లో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాల స్థాయిలో, అధికారుల స్థాయిలో కఠిన చర్యలు తీసుకున్నా ఎక్కడో చోట సైబర్ నేరాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే టెలికాం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త సిమ్ కార్డుల విక్రయంపై కఠిన నిబంధనలు విధించింది. దీంతోపాటు ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్‌ కార్డులను మాత్రమే కలిగి ఉండేందుకు అర్హుడని పేర్కొంది. దీంతోపాటు కొత్త సిమ్‌ కార్డులను ఆధార్ బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా మాత్రమే సిమ్‌ కార్డులు విక్రయించాలని ఆదేశాలు జారీచేసింది. ఆధార్ బయోమెట్రిక్‌లో ఇబ్బందులు తలెత్తితే ఫోటో వెరిఫికేషన్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. సైబర్ నేరాలను నకిలీ సిమ్‌ కార్డుల ద్వారా పాల్పడుతున్నారు. దీనిపై గతంలో ప్రధాని మంత్రి కార్యాలయం కూడా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) కీలక సూచనలు చేసింది. దీంతోపాటు టెలికాం శాఖ వేలాది నకిలీ సిమ్‌ కార్డులను బ్లాక్ చేస్తోంది. అయితే వ్యక్తిగతంగా మొబైల్‌ యూజర్‌లు కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ తమ పేరుపై ఎటువంటి నకిలీ సిమ్‌ కార్డులు ఉన్నాయో లేదో తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలి. స్పామ్‌ కాల్స్‌, నకిలీ సిమ్ కార్డులపై ఫిర్యాదులు, పొగొట్టుకున్న ఫోన్‌లపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలికాం శాఖ గతంలో వెబ్‌సైట్‌, యాప్‌ను లాంచ్‌ చేసింది. సంచార్‌ సాథీ (Sanchar Saathi) పేరుతో వెబ్‌సైట్‌, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫాం గురించి సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఈ యాప్‌ ద్వారా నకిలీ సిమ్‌ కార్డులను గుర్తించడం ఎలాగో చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. తమ పేరుతో ఏమైనా నకిలీ సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయా లేదా తెలుసుకొనేందుకు ప్రతి ఒక్కరు https//:sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం సంచార్‌ సాథీ ప్లాట్‌ఫాంలోకి వెళ్లాలి. Know Mobile Connections in your name పైన క్లిక్‌ చేయాలి. అనంతరం TAFCOP అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌, Captcha కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓ OTP వస్తుంది. అనంతరం మీ పేరు మీద ఉన్న అన్ని సిమ్ కార్డుల వివరాలు అక్కడ కనిపిస్తాయి. మీకు సంబంధం లేని ఏదైనా సిమ్ కార్డును గుర్తిస్తే ఆ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదుపై DoT మరియు టెలికాం సంస్థలు స్పందించి నిర్ణయం తీసుకుంటాయి. సైబర్‌ నేరాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, టెలికాం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఆధార్‌ కార్డు ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. మరియు సిమ్‌ కార్డుల కొనుగోలు, బ్యాంకింగ్‌ అవసరాలకు కూడా ఆధార్ కార్డులను వినియోగిస్తున్నాం. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఆయా కార్డులు దుర్వినియోగం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం ఆధార్ ప్రాథికార సంస్థ UIDAI కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఆధార్‌ కార్డు హిస్టరీని తెలుసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీంతోపాటు ఆధార్‌ కార్డులు ఇతరులు వినియోగించకుండా ఉండేందుకు వీలుగా బయోమెట్రిక్‌ లాక్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

తమ పేరుతో ఏమైనా నకిలీ సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయా లేదా తెలుసుకొనేందుకు ప్రతి ఒక్కరు https//:sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

- అనంతరం సంచార్‌ సాథీ ప్లాట్‌ఫాంలోకి వెళ్లాలి.
- Know Mobile Connections in your name పైన క్లిక్‌ చేయాలి.
- అనంతరం TAFCOP అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
- ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌, Captcha కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
- మీరు ఎంటర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓ OTP వస్తుంది.
- అనంతరం మీ పేరు మీద ఉన్న అన్ని సిమ్ కార్డుల వివరాలు అక్కడ కనిపిస్తాయి.
- మీకు సంబంధం లేని ఏదైనా సిమ్ కార్డును గుర్తిస్తే ఆ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచే ఫిర్యాదు చేయవచ్చు.
- మీ ఫిర్యాదుపై DoT మరియు టెలికాం సంస్థలు స్పందించి నిర్ణయం తీసుకుంటాయి.

సైబర్‌ నేరాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, టెలికాం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతం ఆధార్‌ కార్డు ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. మరియు సిమ్‌ కార్డుల కొనుగోలు, బ్యాంకింగ్‌ అవసరాలకు కూడా ఆధార్ కార్డులను వినియోగిస్తున్నాం. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఆయా కార్డులు దుర్వినియోగం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.

ఇందుకోసం ఆధార్ ప్రాథికార సంస్థ UIDAI కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఆధార్‌ కార్డు హిస్టరీని తెలుసుకొనేందుకు అవకాశం కల్పించింది. దీంతోపాటు ఆధార్‌ కార్డులు ఇతరులు వినియోగించకుండా ఉండేందుకు వీలుగా బయోమెట్రిక్‌ లాక్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to know fake sim cards on your name here is the stepwise guide in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X