వేస్ట్ బాటిల్‌తో టేబుల్ ఫ్యాన్ తయారుచేయడం ఎలా ?

Posted By:

మీరు సరికొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా..అదీ పనికిరాని వాటితో మీరు అత్యధ్బుతాలను సృష్టించాలనుకుంటున్నారా.. అయితే అనేక రకమైన అత్యద్భుతాలు మీకోసం రెడీగా ఉన్నాయి.అయితే వాటిల్లో ఒకదానిని మీ కోసం పరిచయం చేస్తున్నాం. అదేంటంటే కోకోకోలా ,పెప్సీ, స్ప్రైట్ బాటిల్‌తో టేబుల్ ఫ్యాన్ చేయవచ్చు.. దీనికి కావలిసిన వస్తువులు ఓ వేస్ట్ బాటిల్, చిన్న మోటర్, అలాగే అట్ట ముక్క, వీటితో టేబుల్ ఫ్యాన్ ఎలా చేయవచ్చో మీరే చూడండి.

Read more: మీ టేబుల్ ఫ్యాన్‌ నుంచి ఏసీని పొందడమెలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ముందుగా వేస్ట్ బాటిల్‌ని మూతతో సహా ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి.

2

ఈ వేస్ట్ బాటిల్ ని ఫోటోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. అంటే మూడు ఫ్యాన్ చక్రాలు వచ్చే విధంగా దాన్ని కట్ చేయాలి.

3

ఫ్యాన్ రెక్కల్లాగా కట్ చేసుకున్న తరువాత మూడు రెక్కలను చిన్న మంట మీద కాల్చి మెలికలు తిప్పితే ఫ్యాన్ రెక్కలు తయారవుతాయి.

4

ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు ఈ ఆకారంలో వస్తాయి. అంటే మూత భాగంలో మెలికలు తిరిగి మామూలు ఫ్యాన్ రెక్కల్లా ఉంటాయి.

5

తరువాత చిన్న మోటర్ తీసుకుని దానికి మూతను బిగించాలి. దీనికోసం మూత మధ్యలో రంధ్రం చేయాల్సి ఉంటుంది.

6

ఇప్పుడు అట్ట ముక్కను తీసుకుని దానికి ఇలా గమ్ముతో కొన్ని అట్ట ముక్కలను అంటించి టేబుల్ ఫ్యాన్ హ్యాండిల్ లాగా తయారు చేసుకోవాలి.

7

ఇప్పుడు దానికి మోటర్ ను తగిలించి వైర్లనె సెట్ చేసుకుంటే మీకు బ్యాటరీ నుంచి కాని లేకుంటే కరెంట్ నుంచి కాని పవర్ సప్లయి అవుతుంది.

8

ఇక అంతా సెట్ చేసుకున్న తరువాత మూతకు మీ ఫ్యాన్ చక్రాల బాటిల్ ని తగిలిస్తే చాలు. ఫ్యాన్ రెడీ అయిపోయినట్లే.

rn

9

మరిన్ని సూచనల కోసం ఈ వీడియోని ఫాలో కండి.

 

10

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Make an Electric Table Fan using Bottle
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot