టేబుల్ ఫ్యాన్ తో ఏసీ, కరెంట్‌తో పని లేకుండా ఎయిర్ కూలర్ లాంటి చల్లదనం ఎలా?
అసలే ఎండలు మండిపోతున్నాయి. బయటకెళితే ఎక్కడ వడదెబ్బ కొడుతుందోనన్న భయం. ఇంట్లో ఉంటే గాలి రాక ఒకవేళ అది వచ్చినా ఆ వేడిగాలికి ఒళ్లంతా ఏదోలా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇంట్లో ఏసీ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అయితే మీ టేబుల్ ఫ్యాన్ ని ఏసీ ఫ్యాన్ గా మార్చుకొని మీరు ఏసీ పొందే మార్గం ఉంది. అయితే దీనికి కావలిసిన వస్తువులు.. టేబుల్ ఫ్యాన్, కాపర్ పైప్. ప్లాస్టిక్ పైప్, వాటర్, ఛార్జర్ ఈ కింది చిట్కాలతో మీరు ఓ సారి ట్రై చేయండి.
Read more: గూగుల్ డాట్ కాం చాలా డేంజర్ : షాకిచ్చిన గూగుల్

1
ముందుగా మీ టేబుల్ ఫ్యాన్ బాగా తిరుగుతుందా లేదా అని ఓ సారి చెక్ చేసుకోండి.

2
కాపర్ పైపులను అలాగే ప్లాస్టిక్ పైపులను రెడీ చేసుకోవాలి. ఇవి ఆన్ లైన్ లో దొరుకుతాయి. వీటితో మనం ఏసీ సెట్ చేసుకోవచ్చు.

3
మీ ఫ్యాన్ కి ఉన్న పంకాను ఊడదీసిి దానికి చుట్టూ కాపర్ వైరును చుట్టాలి. పంకాకి ఎన్ని రౌండ్లు ఉన్నాయో అన్ని రౌండ్లు కాపర్ పైపు చుట్టాలి.

4
ఇలా చుట్టిన తరువాత దీనికి రంధ్రం ఉండే చోట ప్లాస్టిక్ పైపును తగిలించాలి. అటు కొన ఇటు కొనల్లో ప్లాస్టిక్ పైపును తగిలిచాలి.

5
ఈ ప్లాస్టిక్ పైపును తగిలించిన తరువాత ఆ పైపును ఫ్యాన్ కు తగలకుండా జాగ్రత్తగా స్టిక్కర్ అంటించి ఆ పైపును నీళ్లు ఉన్న డబ్బాలో వేయాలి.

6
ఈ నీళ్లు ఉన్న డబ్బాలా ఈ ఛార్జర్ ను ఉంచి స్విచ్ వేస్తే ఆటోమేటిగ్గా మీకు ఎయిర్ కూలర్ రెడీ అయినట్లే.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ
అసలే ఎండలు దిమ్మ తిరుగుతన్నాయి. ఈ ఎండల దెబ్బకి ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని జనం అల్లాడిపోతున్నారు. అయితే ఇంట్లో ఉన్నా కాని వేడి గాలి దెబ్బకు చుక్కలు కనిపిస్తుంటాయి ప్రతి ఒక్కరికీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడేది కూలర్ మాత్రమే. అయితే ఆ కూలర్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది..అయితే ఇప్పుడు మీరే ఫ్రీగా కూలర్‌ను తయారుచేసుకోవచ్చు. చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఎలా తయారుచేయాలో చూడండి.

కరెంట్‌తో పనిలేదు, పైసా ఖర్చు కాదు: కూలర్ మాత్రం రెడీ
కిటికీ సైజ్ ఉండే కార్డ్ బోర్డ్ , ప్లాస్టిక్ సీసాలు అవి మూతతో ఉన్న సీసాలు కావాలి

మొదటగా కార్డ్ బోర్డ్ ను మొత్తం రంధ్రాలు చేసుకోవాలి.

ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కోసి రంధ్రాలు చేసిన కార్డ్ బోర్డ్ కు బిగించాలి.

అంతే పని అయిపోయినట్లే దీనిని తీసుకెళ్లి మీ కిటికీకి బిగిస్తే చాలు..చల్లని గాలి మీ ఇంట్లోకి వస్తుంది.

ఈ ఎకో కూలర్‌ను చాలా సులభంగా తయారు చేసుకొని కరెంట్ అవసరం కూడా లేకుండానే దాదాపు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.

ఇది చాలా చిన్న ఐడియానే కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే గ్రామీణ ప్రజలకు ఇదో మంచి అవకాశం.
మీ టేబుల్ ఫ్యాన్ నుంచి ఏసీని పొందడమెలా..? వీడియో చూడండి.


Click it and Unblock the Notifications








