WhatsApp వీడియో కాల్స్ ను Windows PC నుండి చేయడం ఎలా?

|

ప్రపంచ వ్యాప్తంగా అధిక మంది ఇతరులకు విస్తృతంగా మెసేజ్ లను పంపడానికి తక్షణ మెసేజ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు, డాక్యూమెంట్స్ , వాయిస్ రికార్డింగ్ వంటి వాటిని కూడా పంపడానికి అవకాశం కల్పిస్తోంది.

వాట్సాప్ వీడియో మరియు ఆడియో కాల్స్

వాట్సాప్ వీడియో మరియు ఆడియో కాల్స్

అలాగే వాట్సాప్ ద్వారా వీడియో మరియు ఆడియో కాల్స్ చేయడానికి కూడా ప్రజలను అనుమతిస్తుంది. ఇప్పుడు విస్తృతమైన ప్రేక్షకులను సమస్యలను తీర్చడానికి వాట్సాప్ యొక్క వెబ్ వెర్షన్ను కూడా ప్రారంభించింది. అయితే ఇది ఖచ్చితంగా యాప్ వలె అన్ని రకాల ఫీచర్లను అనుమతించదు. మరింత వివరంగా చెప్పాలంటే వాట్సాప్ వెబ్ ముఖ్యమైన లక్షణాలలో ఒకటైన వీడియో మరియు ఆడియో కాల్స్ చేయడానికి అవకాశం లేదు.

విండోస్ ల్యాప్‌టాప్

విండోస్ ల్యాప్‌టాప్

వీడియో కాల్స్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో అవకాశం ఉంది కానీ ల్యాప్‌టాప్ మరియు కంప్యూటర్ లో ఈ సౌలభ్యం అందుబాటులో లేదు. మీరు విండోస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ నుండి వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్ దీనికి అధికారిక పద్ధతిని అందించనందున మీరు ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ చేయలేరు. అయినప్పటికీ వినియోగదారులు తమ PC లను ఉపయోగించి వాట్సాప్ వీడియో కాల్స్ చేయడానికి అనుమతించే మార్గం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్

ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్

ల్యాప్‌టాప్ నుండి వీడియో కాల్స్ చేయుటకు మీకు మంచి మరియు నమ్మకమైన ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ మరియు వాట్సాప్ APK ఫైల్, ఎస్ఎంఎస్ లేదా కాల్ సేవతో యాక్టివ్ ఫోన్ నంబర్ అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు అధికారిక వాట్సాప్ వెబ్‌సైట్ నుండి వాట్సాప్ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ల్యాప్‌టాప్ నుండి వాట్సాప్ వీడియో కాల్స్ చేసే పద్ధతులు

ల్యాప్‌టాప్ నుండి వాట్సాప్ వీడియో కాల్స్ చేసే పద్ధతులు

*** ఇంటర్నెట్ నుండి ఏదైనా విశ్వసనీయ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్‌ను డౌన్‌లోడ్ చేసి దాన్ని మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

*** ఎమ్యులేటర్ ఇన్‌స్టాల్ చేయడం పూర్తి అయిన తర్వాత వాట్సాప్ APK ఫైల్‌ను సైడ్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.


*** ఇప్పుడు వాట్సాప్‌ను సెటప్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి. ఇందులో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. తరువాత ఫైళ్లు, కెమెరా మరియు మైక్రోఫోన్‌లు వంటి అవసరమైన అనుమతులను ఇవ్వండి.


*** అనుమతులను ఇవ్వడం పూర్తయిన తర్వాత ఎమ్యులేటర్ల డైరెక్టరీలో ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. లేదా మీరు మీ ఫోన్ వలె అదే గూగుల్ అకౌంటును ఉపయోగించినట్లయితే వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో మీరు ఫోన్ చేయవలసిన కాంటాక్ట్ కోసం చూడండి. వీడియో ఫోన్ కాల్ ప్రారంభించడానికి వీడియో కాల్ ఐకాన్‌పై నొక్కండి.


గమనిక : ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్లు మూడవ పార్టీ సాఫ్ట్‌వేర్ కావున విశ్వసనీయమైనదాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే ఎమ్యులేటర్‌ను డౌన్‌లోడ్ చేయడం వల్ల డేటా మరియు గోప్యత సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు కావున డౌన్‌లోడ్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండడం అతి ఆవశ్యకం.

 

Best Mobiles in India

English summary
How to Make WhatsApp Video Calls in PC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X