మీ కంప్యూటర్ స్లోగా ఉందా..ఇలా చేయండి

Written By:

మీ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పనిచేస్తుందా..మీరు ఏం చేసినా కాని అది ఇంకా స్లోగానే ఉంటుందా.. స్పీడ్ పెరగటం లేదా..అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీకు తెలియకుండా కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్లో ఎన్నో రకాల ఫైల్స్ రన్ అవుతుంటాయి. అందువల్ల సిస్థం చాలా స్లోగా రన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కోసం మీరు కింది టిప్స్ పాటిస్తే వేగం పెరిగే అవకాశం ఉంది.

శాంసంగ్ చరిత్రలో అతి పెద్ద డీల్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్స్ 1

సీ, డీ, ఈ, ఎఫ్ డ్రైవ్లను ఎప్పటికప్పుడు క్లీన్, డీఫ్రాగ్మెంటేషన్ చేయడం ద్వారా పీసీ వేగాన్ని కొంతమేర పెంచొచ్చు. అందుకు MyComputer-> Drive-> Right Click-> Properties-> Tools-> Defragment now క్లిక్ చేయాలి.

టిప్స్ 2

టెంపరరీ ఫైల్స్ తీసేయాలంటే Start > Run లోకి వెళ్లి % Temp% , Recent అని టైప్ చేసి ఓకే చేయండి ఇటీవలి. వచ్చిన విండోలోని టెంపరరీ ఫైల్స్‌ను డిలీట్ చేయండి.

టిప్స్ 3

startup లో అక్కర్లేని పొగ్రాంలను డిసేబుల్ చేయవచ్చు. అందుకు రన్లోకి వెళ్లి msconfig టైప్ చేసి ఎంటర్ నొక్కండి. వచ్చిన విండోలోని 'స్టార్ట్అప్' ట్యాబ్లోకి వెళ్లి అక్కర్లేని ప్రొగ్రాంలను అన్‌చెక్ చేసి సిస్టంని రీస్టార్ట్ చేయండి. ట్యూన్అప్ యుటిలిటీస్' సాఫ్ట్‌వేర్లో సిస్టమ్ సామర్థాన్ని పెంచే సదుపాయాలు ఉన్నాయి.

టిప్స్ 4

డెస్క్‌టాప్‌పై తక్కువ ఐకాన్లు ఉంచాలి. ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్ పెట్టడం మంచిది కాదు.

టిప్స్ 5

CCleaner, Zappit వ్యవస్థ క్లీనర్, ఎస్ఎస్ డిస్క్ క్లీనర్ టూల్స్‌తో కూడా అనవసరమైన ఫైల్స్ ను తొలగించవచ్చు. అక్కర్లేని సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అన్ఇన్‌స్టాల్ చేయాలి. అందుకు సిస్టంలోనే Add / Remove సిద్ధంగా ఉంది.

టిప్స్ 6

Start-> Settings-> Control Panel-> Add or Remove Programs క్లిక్ చేసి అక్కర్లేని వాటిని తొలగించాలి. యాంటీ వైరస్లను అప్డేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా స్పేస్ కలిసొస్తుంది. సిస్టం ఫాస్ట్ గా రన్ అయ్యే అవకాశం ఉంది.

టిప్స్ 7

టెంపరరీ ఫైల్స్‌ను మాన్యువల్‌గా తొలగించడం కష్టం అయితే టెంప్ ఫైల్ క్లీనర్ నిక్షిప్తం చేసుకోండి.

టిప్స్ 8

ఆపరేటింగ్ సిస్టమ్లో వివిధ రకాల పనులు నిర్వర్తించే ఫైల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఫైల్స్ కరెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాజరిగితే సిస్టమ్ వేగం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 'సిస్టమ్ ఫైల్ చెకింగ్' ఆప్షన్ను ఉపయోగించుకుని ఫైల్స్ను చెక్ చేసి సమస్య ఉన్నట్లయితే పరిష్కరించవచ్చు. దీనివల్ల సిస్టమ్ వేగం మెరుగుపడుతుంది.

టిప్స్ 9

యానిమేటెడ్ వాల్పేపర్లు, స్క్రీన్సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి. మీ కంప్యూటర్ సీ డ్రైవ్ మీద, లేదంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన డ్రైవ్ పైన ఎక్కువగా భారం పడకుండా చూడండి. అంటే వీలైనన్ని తక్కువ ప్రోగ్రామ్లు ఇన్స్టాల్ చేస్తే మంచిది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Make Your Computer Run Faster Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot