శాంసంగ్ చరిత్రలో అతి పెద్ద డీల్..

Written By:

గెలాక్సీ నోట్ 7 పేళుళ్లతో ఒక్కసారిగా తన ప్రతిష్టను మసకబార్చుకున్న శాంసంగ్ ఇప్పుడు మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్ రంగాన్ని ఏలాని శాంసంగ్ ఇప్పుడు ఆటోమేటివ్ రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. అక్కడ తన సత్తాను చాటేందుకు రెడీ అయింది. ఈ మేరకు అమెరికన్ కంపెనీని 8 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకబోతోందనే వార్తలు వస్తున్నాయి.

పైసా కట్టకుండానే మొబైల్ సొంతం చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆటోమోటివ్ టెక్నాలజీకి చేరువ కావడానికి

కనెక్టెడ్ కార్ల ఉత్పత్తిలో పెరుగుతున్న ఆటోమోటివ్ టెక్నాలజీకి చేరువ కావడానికి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఓ అమెరికన్ కంపెనీని సొంతం చేసుకోబోతుంది.

హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు

అమెరికన్ ఆటో పార్ట్‌ల తయారీదారి హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 8 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ .54,107 కోట్లు) ఉండనున్నట్టు పేర్కొంది.

మొత్తం నగదు రూపంలోనే

ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుందని, శాంసంగ్ బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. అమెరికాలో లిస్టు అయిన హర్మాన్, కనెక్టెడ్ కారు టెక్నాలజీలో లీడర్‌గా ఉంది.

శాంసంగ్ విలువలోనే అతిపెద్ద డీల్

డీల్ ఈ శాంసంగ్ విలువలోనే అతిపెద్దదని, గ్లోబల్ మార్కెట్లోని ఆన్‌లైన్ కనెక్టెడ్ ఆటో టెక్నాలజీలో తనదైన ఉనికిని చాటుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుందని, తాము ఆటోమోటివ్ ఫ్లాట్‌ఫామ్‌లో వృద్ధి చెందడానికి హర్మాన్ ఓ బలమైన పునాదిని వెంటనే ఏర్పరుస్తుందని శాంసంగ్‌ పేర్కొంది.

పేరుమోసిన కంపెనీ

హర్మాన్ అమెరికాలో పేరుమోసిన కంపెనీగా ప్రసిద్ధికెక్కింది. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్, ఇతర ఇంటర్నెట్ తరహా వినోద ఫీచర్లను జనరల్ మోటార్స్, ఫియట్ క్రిస్లర్ వంటి గ్లోబల్ కారు కంపెనీలకు హర్మాన్ ఉత్పత్తిచేస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung to Buy Harman for About $8 Billion in Cash Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot