Home
How to

వేసవిలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడం ఎలా.. స్మార్ట్‌ టిప్స్‌ ఇవిగో..!

వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో సహజంగా ఇళ్లు, కార్యాలయాల్లో ఫ్యాన్‌లు, ఏసీలు (AC), ఎయిర్‌ కూలర్ల ( Air Coolers ) వినియోగం పెరుగుతుంది. ఫలితంగా విద్యుత్‌ ఛార్జీలు (Electricity Usage) కూడా అధికంగా వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలతో వేసవిలో విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ఎయిర్‌ కండిషనర్‌ ఎలా వినియోగిస్తున్నారు? :
ఇళ్లల్లో లేదా కార్యాలయాల్లో చల్లదనం కోసమని అనేక మంది 18 డిగ్రీల సెల్సియస్‌ వద్ద AC లు వినియోగిస్తుంటారు. దీంతో కంప్రెషర్‌ మీద ఒత్తిడి పెరుగుతుంది, అధిక విద్యుత్‌ అవసరం అవుతుంది. అయితే 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వినియోగించుకుంటే, విద్యుత్‌ చాలా వరకు ఆదా అవుతుంది.

how to reduce electricity usage

6 శాతం విద్యుత్‌ ఆదా :
AC లో ఒక్కో పాయింట్‌ కు 6 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే AC పనిచేస్తున్నా.. కొంచెం తక్కువ స్పీడ్‌ తో ఫ్యాన్‌ కూడా వినియోగించడం వల్ల, చల్లటి గాలి గది అంతటా త్వరగా వ్యాపిస్తుంది. ఫలితంగా గదులు చాలా వేగంగా చల్లగా మారతాయి. అనంతరం ఏసీని ఆఫ్‌ చేసుకోవచ్చు.

ఎయిర్‌ కూలర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఇవి కచ్చితంగా తెలియాలి!ఎయిర్‌ కూలర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఇవి కచ్చితంగా తెలియాలి!

15 రోజులకు ఒకసారైనా :
రాత్రంతా ఏసీలు పనిచేయాల్సిన అవసరం లేకపోవచ్చు. అందువల్ల మధ్య రాత్రి లేదా తెల్లవారుజామునే ఆఫ్‌ అయ్యేలా టైమర్ సెట్‌ చేసుకోవాలి. AC లోని ఫిల్టర్లు దుమ్ముతో నిండిపోతే, సక్రమంగా పనిచేసేందుకు అధిక విద్యుత్‌ అవసరం అవుతుంది. అందువల్ల ప్రతి 15 రోజులకు ఒకసారైనా ఎయిర్‌ ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. దీంతోపాటు అవుట్‌ డోర్ యూనిట్‌ ను కూడా శుభ్రం చేసుకోవాలి.

స్విచ్ ఆఫ్‌, అన్‌ప్లగ్‌ :
ఇంట్లో లేదా కార్యాలయాల్లో టీవీలు సహా ఇతర విద్యుత్‌ ఉపకరణాలు వినియోగించిన అనంతరం పూర్తిగా స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. దీంతోపాటు అన్‌ ప్లగ్‌ చేయాలి. రిమోట్‌ తో ఆఫ్‌ చేసి, పూర్తిగా స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా వదిలేసినా TV లు విద్యుత్‌ ను వినియోగించుకుంటాయని గుర్తు పెట్టుకోవాలి.

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జి అవుతోందా.. ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేయండి..!స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జి అవుతోందా.. ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేయండి..!

సమ్మర్‌ మోడ్‌ లోకి మార్చుకోవాలి :
సాధారణ రోజులతో పోలిస్తే రిఫ్రిజిరేటర్ల వినియోగం వేసవి కాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని మార్పులు, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యుత్‌ ను ఆదా చేయవచ్చు. రిఫిజిరేటర్లను వింటర్ మోడ్‌ నుంచి సమ్మర్‌ మోడ్‌ లోకి మార్చాలి. రోజులో ఎక్కువ సార్లు ఫ్రిజ్‌ డోర్లు ఓపెన్‌ చేయకుండా జాగ్రత్తపడాలి.

5 స్టార్‌ రేటింగ్ :
కొత్తగా విద్యుత్‌ ఉపకరణాలు కొనుగోలు చేస్తుంటే మాత్రం 5 స్టార్‌ రేటింగ్‌ కలిగినవి ఎంచుకోవాలి. దీంతోపాటు ఇళ్లల్లో ఉన్న పాత మోడళ్లను ఎక్స్ఛేంజీ చేసుకోవడం ఉత్తమం. ఇళ్లల్లో సాధారణ బల్బులకు బదులుగా LED బల్బులను వినియోగించాలి. సాధారణ బల్బులు ఎక్కువ విద్యుత్‌ ను వినియోగించుకోవడంతోపాటు వేడిని ఉత్పత్తి చేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
how to reduce electricity usage during summer here are the best tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X