AC వినియోగిస్తున్నా.. విద్యుత్ ఛార్జీలు తక్కువగా రావాలా.. ఈ టిప్స్ మీ కోసమే...!
వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాలేదు. అయినా మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఉక్కపోత సహా వేసవి తీవ్ర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో అనేక మంది ఏసీలు, ఎయిర్ కూలర్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఉక్కపోత భరించలేక కొనుగోలు చేస్తున్నా.. విద్యుత్ ఛార్జీలు అధికంగా వస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు సమయం నుంచి వినియోగించే వరకు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ఎయిర్ కండిషనర్ (AC) కొనుగోలు చేసే సమయంలో మీకు అవసరం అయిన సామర్థ్యం కలిగిన వాటిని ఎంచుకోవాలి. పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం కలిగిన ఏసీని కొనుగోలు చేసినా, తక్కువ స్టార్ రేటింగ్ కలిగిన దానికి కొనుగోలు చేసినా విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు.
దీంతోపాటు పాత ఎయిర్ కండిషనర్‌ను వినియోగిస్తున్నట్లయితే సర్వీసింగ్ కచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరియు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణం కావచ్చు. ఇటీవలే ఢిల్లీలో ఏసీ సర్వీసింగ్ సెంటర్‌లో పాత ఏసీని మరమ్మతు చేస్తుండగా పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
కొంత మందికి AC సెట్టింగ్స్ పైన సరైన అవగాహన లేకపోవడంతో తక్కువ పాయింట్ల వద్ద వినియోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల గది ఉష్ణోగ్రత భారీ తగ్గి, చల్లదనం ఏర్పడుతుంది. కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం అధికంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (BEE) ప్రకారం ఏసీని 24 పాయింట్ల వద్ద వినియోగిస్తే తక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది. చాలా ఏసీలో డిఫాల్ట్‌గా ఇలానే ఉంటుంది. దీని వల్ల విద్యుత్ బిల్లులు నియంత్రణలో ఉండడంతోపాటు ఆరోగ్యం పైనా ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.
ఏసీని 24 పాయింట్ల కంటే తక్కువగా వినియోగిస్తే విద్యుత్ ఛార్జీలు అంతే స్థాయిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఏసీ కొనుగోలు చేసే సమయంలో 5 స్టార్ రేటింగ్ కలిగిన వాటిని ఎంచుకోవాలి. మరియు సర్వీసింగ్ సదుపాయం కూడా ఉండేలా చూసుకోవాలి.
మీ ఇంట్లో, ఆఫీస్‌లో అవసరాలకు అనుగుణంగా 1 టన్ను లేదా 1.5 టన్ను సామర్థ్యం కలిగిన AC ను ఎంచుకోవాలి. ఇక్కడ ఎటువంటి పొరపాటు జరిగినా విద్యుత్ ఛార్జీలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఏసీ త్వరగా డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంది.
ఇంట్లో, ఆఫీస్‌లో ఏసీ వినియోగిస్తున్న సమయంలో అన్ని తలుపులు, కిటీకీలు పూర్తిగా మూసివేయాలి. చల్లని గాలి బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చూడాలి. ఫలితంగా గది ఉష్ణోగ్రత వేగంగా తగ్గి, చల్లగా మారుతుంది. చల్లని గాలి తరచూ బయటకు వెళ్తుంటే.. గదిని చల్లగా ఉంచేందుకు AC కి ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. అన్ని వైపు పూర్తిగా మూసివేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాసం ఉంది.
ఏసీ వినియోగిస్తున్న సమయంలో చిన్న ఫ్యాన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చల్లదనం గది మొత్తం వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చల్లగా మారిన తర్వాత AC ను ఆఫ్ చేసుకోవచ్చు. మీకు మళ్లీ ఎక్కువ చల్లదనం కావాలంటే మరోసారి AC ఆన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఇన్వర్టర్ ఏసీలో అవసరాన్ని బట్టి కంప్రెసర్ పనిచేస్తుంది. గదిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కంప్రెషర్ ఎక్కువ పనిచేసి, రూంను త్వరగా చల్లగా ఉండేలా చూస్తుంది. అదే గదిలో తక్కువ ఉష్ణోగ్రత ఉంటే.. కంప్రెషర్ తక్కువగా పనిచేస్తుంది. ఫలితంగా విద్యుత్ లోడ్ తక్కువగా ఉండి.. బిల్లులు కూడా తగ్గుతాయి.


Click it and Unblock the Notifications








