Gmailలో మీ ఇమెయిల్‌ను ఎలా షెడ్యూల్ చేయాలి??

|

మీరు మీ విమానానికి ఆలస్యం అవుతున్నారు మరియు అదే సమయంలో మీరు మీ యొక్క బాస్ కు చాలా ముఖ్యమైన మెయిల్‌ను పంపాలి. అటువంటి సమయంలో మీరు ఏమి చేస్తారు? మీరు ఫ్లైట్ ను అందుకుంటారా లేదా ఇమెయిల్ కోసం మిస్ అవుతారా? ఇటువంటి సందర్భం మీకే కనుక ఎదురైతే ఒక్క సారి ఊహించుకోండి. ఇటువంటి సమస్యను గూగుల్ ఇప్పుడు పరిష్కరించింది.

Gmail

గూగుల్ యొక్క Gmail ఇప్పుడు నిజంగా గొప్ప ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది మీ ఇమెయిల్‌లను షెడ్యూల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తద్వారా మీరు ఇమెయిల్‌ను ఎక్కడ నుంచి అయినా కూడా పంవవచ్చు. దీని ద్వారా మీరు ఎటువంటి పనిని అయిన మధ్యలో వదలవలసిన అవసరం లేదు. దీని ద్వారా మీకు చాలా సమయం ఆదా అవుతుంది.

కొత్త అప్డేట్

Gmail యొక్క 15 వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్ Gmail కోసం కొన్ని కొత్త అప్డేట్ లను ప్రకటించింది. అందులో ఇమెయిల్ షెడ్యూల్ ఫీచర్ కూడా ఒకటి. ఫేస్బుక్ షెడ్యూలింగ్ పోస్ట్ మాదిరిగానే ఇమెయిలింగ్ సర్వీస్ మీ ఇమెయిల్‌ను షెడ్యూల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తద్వారా కొన్ని గంటలలో ఇమెయిల్‌లను పంపడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

అమెజాన్ దీపావళి సేల్స్: RS.999కే ఇంటిని కలర్ లైట్లతో నింపవచ్చుఅమెజాన్ దీపావళి సేల్స్: RS.999కే ఇంటిని కలర్ లైట్లతో నింపవచ్చు

డెస్క్‌టాప్‌తో

Gmail లో మెయిల్స్ షెడ్యూల్ చేయడానికి గతంలో యూజర్ మూడవ పార్టీ యాడ్-ఆన్ ను ఉపయోగించాల్సి వచ్చింది. వినియోగదారుడు షెడ్యూల్ ఇమెయిళ్ళకు సహాయపడటానికి గూగుల్ ఇప్పుడు ఉపయోగించడానికి సులభమైన షెడ్యూలింగ్ ఫీచర్ ను జోడించింది. ఈ ఫీచర్ డెస్క్‌టాప్‌తో పాటు మొబైల్ యాప్ సంస్కరణలో కూడా లభిస్తుంది.

డెస్క్‌టాప్‌లో

డెస్క్‌టాప్‌లో Gmail యొక్క షెడ్యూల్ ఇమెయిల్ లక్షణాన్ని ఎలా ఉపయోగించాలి

--- మొదటిగా కొత్తగా ఇమెయిల్ పంపడం కోసం కంపోజ్ ను క్లిక్ చేయండి.

--- ఇమెయిల్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత సెండ్ బటన్ పక్కన కనిపించే బాణం బటన్ పై క్లిక్ చేయండి.

--- ఇందులో సమయాన్ని ఎంచుకోండి లేదా మీ ఇమెయిల్ బట్వాడా కావాలనుకున్నప్పుడు మీరు తేదీ మరియు సమయాన్ని ఎంచుకోవచ్చు.

---- తరువాత షెడ్యూల్ సెండ్ పై క్లిక్ చేయండి. మీరు సాధారణ ఇమెయిల్‌ల మాదిరిగానే మీ షెడ్యూల్ చేసిన ఇమెయిల్‌లను కూడా అన్డు చేయవచ్చు.

 

ఫోన్‌లో

మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఇటువంటి ఫీచర్‌ని ఉపయోగించాలనుకుంటే బాణానికి బదులుగా స్క్రీన్ యొక్క కుడివైపున ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి పైన తెలిపిన అదే దశలను అనుసరించండి. ఇది మీ ఇమెయిల్ సమయాన్ని షెడ్యూల్ చేసే ఎంపికను మీకు చూపుతుంది.

Best Mobiles in India

English summary
How to Schedule Your email in Gmail Using Desktop and Mobile Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X