Siri ఫీచర్‌ను ఐఫోన్ వాట్సాప్‌లో ఉపయోగించడం ఎలా?

|

ప్రముఖ ఆపిల్ సంస్థ యొక్క ఐఫోన్ ప్రస్తుతం అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఐఫోన్ వాయిస్ ఆదేశాలతో అన్ని రకాల పనులను చేయడానికి కూడా అనుమతిని ఇస్తుంది. ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ లలో నిఫ్టీ ఫీచర్‌ను కలిగి ఉన్నారు.

సిరి ఫీచర్

సిరి ఫీచర్ ను ఉపయోగించి మ్యాప్ లను ఓపెన్ చేయడం మరియు వాయిస్ కాల్స్ చేయడానికి ఉపయోగిస్తారు అని చాలా మందికి తెలుసు. కానీ సిరిని ఉపయోగించి వాట్సాప్‌లో మెసేజ్ లను పంపడానికి మరియు స్నేహితులకు మరియు మరొకరికి కాల్స్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మీ ఫోన్‌లో టైప్ చేయడం కష్టంగా ఉన్న పరిస్థితులలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్‌లో సిరి ఫీచర్‌ను అనుమతించడం

వాట్సాప్‌లో సిరి ఫీచర్‌ను అనుమతించడం

వాట్సాప్‌లో ఈ సిరి ఫీచర్‌ను ప్రారంభించడానికి మొదటి కొన్ని దశలను ప్రారంభించవలసి ఉంటుంది.

*** ఇందులో మొదటి విషయం ఏమిటంటే మీ యొక్క ఫోన్ లో సిరిని ఆన్ చేసినట్లు నిర్దారించుకోవాలి.

*** దీనిని ఆన్ చేయడానికి మీరు సెట్టింగులు> సిరి & శోధన> "హే సిరి" ను ఎంచుకోవాలి. ఇది ప్రారంభించబడకపోతే మీరు దీన్ని టోగుల్ చేయవచ్చు.

*** తదుపరి దశలో భాగంగా క్రిందికి స్క్రోల్ చేసి మీ ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్ ల జాబితా నుండి వాట్సాప్‌ను కనుగొని దానిని ఓపెన్ చేసి క్రిందికి స్క్రోల్ చేసి, "యూజ్ విత్ ఆస్క్ సిరి" పై టోగుల్ చేయండి.

*** ఇది పూర్తయిన తర్వాత మీరు వాట్సాప్ కోసం సిరిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

 

సిరిని ఉపయోగించి వాట్సాప్‌లో మెసేజ్ లు పంపడం

సిరిని ఉపయోగించి వాట్సాప్‌లో మెసేజ్ లు పంపడం

ఐఫోన్ వాడుతున్న వినియోగదారులు వాట్సాప్‌లో మెసేజ్ లను పంపడానికి మరియు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ మరియు ఆడియో కాల్స్ చేయడానికి మీరు సాధారణ వాయిస్ ఆదేశాలను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు "హే సిరి, <సంప్రదింపు పేరు> కు వాట్సాప్ మెసేజ్ పంపు అని ఆదేశాన్ని ఇవ్వాలి. అప్పుడు సిరికి మీరు పంపదలచిన సారాంశాన్ని ఇవ్వవచ్చు. సిరి టైప్ చేసిన మెసేజ్ ను మీరు ఒక సారి చదవవచ్చు. సిరి అప్పుడు మిమ్మల్ని ధృవీకరించమని అడుగుతుంది. మీరు సరిగ్గా ఉంటే కనుక దానిని దృవీకరిస్తే అది వాట్సాప్ మెసేజ్ ను పంపుతుంది.

సిరిని ఉపయోగించి వాట్సాప్‌లో ఫోన్ కాల్స్ చేయడం

సిరిని ఉపయోగించి వాట్సాప్‌లో ఫోన్ కాల్స్ చేయడం

వాయిస్ మరియు వీడియో కాల్‌లకు కూడా పైన తెలిపిన పద్దతులను పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు వాట్సాప్‌లో "హే సిరి వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ <సంప్రదింపు పేరు> " ఆదేశం ఇవ్వడం ద్వారా కాల్స్ చేయవచ్చు. ఆదేశం ఇచ్చిన తరువాత సిరి ఆ వ్యక్తికి వాట్సాప్‌లో వీడియో లేదా వాయిస్ కాల్ చేస్తుంది. మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయకుండా లేదా అనువర్తనాన్ని తెరవకుండానే ఇవన్నీ చేయవచ్చు.

 

సిరితో సాధ్యం కాని ఒక విషయం వాట్సాప్‌లో ఆడియో మెసేజ్ లను పంపడం. దీని కోసం మీరు వాట్సాప్‌ను మాన్యువల్‌గా ఓపెన్ చేసి వాయిస్ మెసేజ్ పంపవలసి ఉంటుంది.

 

Best Mobiles in India

English summary
How to Send Messages and Make Calls on WhatsApp Using Siri in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X