Apple iPhone SE 2020: తక్కువ ధరలో ఐఫోన్... సూపర్ ఫీచర్స్....

|

ఆపిల్ ఐఫోన్ SE 2020 గురించి ఇప్పటివరకు చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటికి అన్నిటికి తెరదించుతూ దీనిని అధికారికంగా విడుదల చేసారు. వన్‌ప్లస్ 8 సిరీస్ ఇండియా యొక్క ధరలను ప్రకటించలేదు కానీ వన్‌ప్లస్ మాదిరిగా కాకుండా ఆపిల్ సంస్థ తన కొత్త ఫోన్ యొక్క ఇండియా ధరలను కూడా ప్రకటించింది.

ఐఫోన్ SE 2020

ఐఫోన్ SE 2020 ఇండియాలో రూ.42,500 రిటైల్ ధర వద్ద లభిస్తుంది అని ఆపిల్ ప్రకటించింది. సరికొత్త ఐఫోన్ 64 GB, 128 GB మరియు 256 GB వంటి మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో పాటుగా బ్లాక్, వైట్ మరియు రెడ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐఫోన్ SE 2020 యొక్క స్పెసిఫికేషన్స్ వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ SE 2020 లాంచ్

ఐఫోన్ SE 2020 లాంచ్

యాపిల్ ఎప్పట్నుంచో ఊరిస్తున్న ‘బడ్జెట్' ఐఫోన్ ఎట్టకేలకు లాంచ్ అయింది. ఐఫోన్ 9, ఐఫోన్ ఎస్ఈ 2ల్లో ఏదో ఒక పేరుతో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అందరూ ఊహించినప్పటికీ ఐఫోన్ SE 2020 అనే పేరుతో దీన్ని ఆపిల్ సంస్థ లాంచ్ చేసింది. ఐఫోన్ 8 మోడల్స్ తరహాలో ఇది కూడా 4.7 అంగుళాల డిస్ ప్లేతో లాంచ్ అయింది. ఇందులో ఆపిల్ A13 బయోనిక్ చిప్ ఉండడంతో పాటు ios13 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవడం ప్రత్యేక విషయం. ఇందులో డిస్ప్లే టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండడం మరొక అదనపు అడ్వాంటేజ్.

ఇండియా యొక్క ధరల వివరాలు
 

ఇండియా యొక్క ధరల వివరాలు

ఐఫోన్ SE 2020 ఇండియాలో రూ.42,500 ధర వద్ద నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో కూడా రానున్నాయి కాకపోతే వీటి ధరలను ఇంకా సంస్థ ప్రకటించలేదు. అలాగే ఇండియాలో వీటి యొక్క సేల్స్ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుంది అన్న దాని మీద ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఐఫోన్ SE 2020 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 4.7 అంగుళాల రెటీనా HD LCD డిస్ప్లే 750x1334 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది . ఇందులో హాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ ను అందించారు. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్లలో అందించిన ఏ13 బయోనిక్ చిప్ నే ఇందులో కూడా అందించడం విశేషం.

ఆప్టిక్స్

ఆప్టిక్స్

ఐఫోన్ SE 2020 యొక్క కెమెరాల విషయానికి వస్తే దీని యొక్క వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాతో ప్యాక్ చేయబడి ఉంది. అలాగే దీని వెనుకవైపు LED ట్రూటోన్ ఫ్లాష్, స్లో సింక్ ఫీచర్లు కూడా ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4G LTE, వైఫై 802.11ax, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్ ఫీచర్ ను మాత్రమే కలిగి ఉంది.

డిజైన్

డిజైన్

డిజైన్ పరంగా చూసినట్లయితే ఈ ఐఫోన్ SE 2020 సెప్టెంబర్ 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8 తరహాలో ఉంది. ఐఫోన్ 7 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఐఫోన్ SE 2020 ఫోన్ 13.84 సెంటీమీటర్లు X 6.73 సెంటీమీటర్ల X 0.73 సెంటీమీటర్ల కొలతలతో ఉండి చాలా తక్కువగా 148 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Apple iPhone SE 2020 Launched : India Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X