Broadband Connectionలో తరచూ సమస్యలా? అయితే ఈ చిట్కాలు పాటించండి...

|

ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ యొక్క వినియోగం ఎక్కువ అయింది. ప్రజలు ఈ కనెక్షన్‌లను తమ ఇళ్లలోను మరియు కార్యాలయాలలోను కూడా ఉపయోగిస్తున్నారు.

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అధిక వేగాన్ని అందిస్తున్నందున ఒకే సమయంలో ఎక్కువ మంది కనెక్ట్ చేయవచ్చు. మీ యొక్క బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఎదో ఒక కారణం చేత డిస్‌కనెక్ట్ చేయబడినట్లు గుర్తించవచ్చు. అటువంటి సమయంలో బ్రాడ్‌బ్యాండ్ యొక్క వెబ్‌పేజీని ఓపెన్ చేయడానికి ఎవరూ కూడా ఇష్టపడరు ఎందుకంటే అది వెంటనే స్పందించదు కావున మీరు ఈ సమస్యలను కొన్ని సాధారణ చిట్కాల సహాయంతో సులభంగా తనిఖీ చేయవచ్చు మరియు వాటిని మీరే స్వంతంగా కూడా పరిష్కరించవచ్చు. ఈ సాధారణ చిట్కాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కేబుల్ కనెక్షన్ లేదా DSL మోడెమ్‌ సమస్యలు

కేబుల్ కనెక్షన్ లేదా DSL మోడెమ్‌ సమస్యలు

మీరు కేబుల్ కనెక్షన్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ను వాడుతూ ఉంటే కనుక స్థిరమైన కనెక్షన్‌ని పొందలేక పోయినప్పుడు మీరు పవర్ సైక్లింగ్‌ను ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఇది మీరు ఎదుర్కొంటున్న సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు చేయవలసిన మరో విషయం ఏమిటంటే మీ యొక్క ఈథర్నెట్ పోర్ట్‌లు మరియు రౌటర్‌కి కనెక్ట్ చేసిన అన్ని కేబుల్స్ పాడైపోయాయా అని తనిఖీ చేయవలసి ఉంటుంది. అలాగే మీ ఇంటి వెలుపల ఉన్న వైర్లను కూడా ఒక సారి తనిఖీ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణం లేదా ఇతర కారకాల వల్ల ఇంటి వెలుపల ఉన్న కేబుల్స్ లేదా వైర్లు దెబ్బతినే అవకాశం అధికంగా ఉంటుంది.

మోడెమ్‌ను రీస్టార్ట్ చేయడం

మోడెమ్‌ను రీస్టార్ట్ చేయడం

మీరు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయబడిందని కనుగొంటే కనుక మొదటగా మీరు చేయవలసిన పని మోడెమ్‌ను రీస్టార్ట్ చేయడం. రౌటర్ వెనుక గల పవర్ కార్డ్‌ను తీసివేసి ఒక నిమిషం తరువాత దానిని తిరిగి అటాచ్ చేయండి. అలాగే మోడెమ్‌లో గల రీస్టార్ట్ బట్టెన్ ను నొక్కడం ద్వారా నెట్‌వర్క్‌ను రిఫ్రెష్ చేయవచ్చు. ఇది ఇంటర్నెట్ యొక్క స్థిరత్వాన్ని తిరిగి తెస్తుంది.

మాల్వేర్ మరియు వైరస్ ల కోసం స్కాన్ చేయడం

మాల్వేర్ మరియు వైరస్ ల కోసం స్కాన్ చేయడం

వైరస్ లు మరియు మాల్వేర్ వంటివి మీ కంప్యూటర్‌ను మాత్రమే కాకుండా మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను కూడా పాడుచేస్తాయి. మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తరచుగా డిస్‌కనెక్ట్ అవుతూ ఉంటే కనుక మీ సిస్టమ్‌లో వైరస్ లు ఉన్నాయామోనని చూడాలి. అవి మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ యొక్క బ్రౌజర్ వేగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యాంటీ-వైరస్ ను ఉపయోగించి స్కాన్ చేయడం ద్వారా మళ్ళి మీ యొక్క బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్యాక్‌ని తనిఖీ చేయడం

బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్యాక్‌ని తనిఖీ చేయడం

మీరు తరచుగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లో చుక్కలను చూస్తుంటే కనుక మీరు మీ యొక్క డేటా ప్యాక్‌ని తనిఖీ చేయడం లేదా మార్చడం చాలా మంచిది. వాస్తవానికి మీ యొక్క డేటా ప్యాక్ కూడా అయిపోయి ఉండవచ్చు. మీ ఇంటర్నెట్ ప్యాక్ అయిపోకపోతే కనుక కస్టమర్ కేర్ ను సంప్రదించి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపి వాటిని పరిష్కరించుకోవచ్చు.

 

Also Read: Airtel Life Insurance Plans: రూ.4,00,000 బీమాను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఇవే!!!Also Read: Airtel Life Insurance Plans: రూ.4,00,000 బీమాను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఇవే!!!

మైక్రో ఫిల్టర్ సమస్యలు

మైక్రో ఫిల్టర్ సమస్యలు

మైక్రో-ఫిల్టర్ అనేది మీ స్మార్ట్‌ఫోన్‌లు, డెస్క్‌టాప్‌లు మరియు మోడెమ్‌లతో కనెక్ట్ అయ్యే విషయం. కాబట్టి మీరు మీ మోడెమ్‌ను మైక్రో ఫిల్టర్ నుండి డిస్‌కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు అతి పెద్ద సమస్యగా ఉంటుంది. మీరు అన్ని డివైస్ లను తిరిగి కనెక్ట్ చేస్తున్నప్పుడు అన్నిటిని ఒకే సారి కాకుండా ఒక్కొక్కటిగా చేయండి.

మోడెమ్ మరియు ఫర్మ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం

మోడెమ్ మరియు ఫర్మ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం

మీరు వాడుతున్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో తరచూ సమస్యలు వస్తూఉంటే కనుక ఫర్మ్‌వేర్ మరియు మోడెమ్‌ని అప్‌గ్రేడ్ చేయడం అన్నిటి కన్నా ఉత్తమం. ఫర్మ్‌వేర్ మరియు మోడెమ్ యొక్క పాత సంస్కరణలు ఇంటర్నెట్ భద్రతకు ముప్పుగా ఉంటాయి మరియు ఇంటర్నెట్ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. ఫర్మ్‌వేర్ అనేది మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది మీ మోడెమ్ లేదా ఇంటర్నెట్ రౌటర్ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఒక భాగం. మోడెమ్ మరియు ఫర్మ్‌వేర్లను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటే కనుక మీరు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Solve Lost Broadband Connection: Explained in Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X