Bharat Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఈ కొత్త మార్పులు గమనించారా??
బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇండియాలో మొదలుపెట్టిన భారత్ ఫైబర్ ద్వారా వినియోగదారులకు వివిధ రకాల ధరల వద్ద అద్భుతమైన ప్రయోజనాలతో వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఫైబర్ యొక్క ప్లాన్‌లలో కొన్ని మార్పులను చేసింది.

బిఎస్ఎన్ఎల్ 200Mbps ప్లాన్
బిఎస్ఎన్ఎల్ జనవరి ప్రారంభంలో తెలంగాణ సర్కిల్‌తో పాటు ఇతర సర్కిల్‌లలో ప్రవేశపెట్టిన 200Mbps ప్లాన్‌లలో ఇప్పుడు కొన్ని మార్పులను చేశారు. ఇప్పుడు దీనిని 100Mbps వేగంతో మాత్రమే బ్రోజ్ చేయడానికి అనుమతిస్తుంది. గతంలో 90 రోజుల వాలిడిటీతో బిఎస్‌ఎన్‌ఎల్ 200Mbps ప్లాన్‌ను ప్రమోషనల్ ప్రాతిపదికన ప్రవేశపెట్టింది. ఇప్పుడు కూడా చెన్నై సర్కిల్‌లలో ఈ 200Mbps ప్లాన్ ను వినియోగదారులకు అందించడం కొనసాగించింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: Oppo A52 స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే....

బిఎస్‌ఎన్‌ఎల్ 100Mbps ప్లాన్ డేటా ఆఫర్స్
BSNL కొత్తగా "ఫైబ్రో కాంబో ULD 1999 CS 15" పేరుతో 100Mbps ప్లాన్‌ను అన్ని సర్కిల్‌లలో అందిస్తున్నది. ఈ ప్లాన్ వినియోగదారులకు 1400GB లేదా 1.4TB డేటాను 100 Mbps వేగంతో వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ధర 1999 రూపాయలు. ఈ ప్లాన్ అందిస్తున్న 1400GB డేటా పరిమితి దాటిన తర్వాత దాని యొక్క డేటా వేగాన్ని 2Mbpsకు తగ్గించి అపరిమిత డేటాను అందిస్తుంది. ఇది అదనంగా భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత కాల్స్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.

భారత్ ఫైబర్ ప్లాన్‌లలో మార్పులు
బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తన భారత్ ఫైబర్ లోని డేటా స్పీడ్ లలో చేసిన కొత్త మార్పులలో భాగంగా ఇప్పుడు అన్ని మెజారిటీ సర్కిల్‌లలో గరిష్టంగా డేటా వేగం 100Mbps కు పరిమితం చేయబడింది. ఆపరేటర్లు దాని సమర్పణలలో మార్పుకు కారణాన్ని తెలపకపోయిన BSNL 200 Mbps ప్లాన్ ను తొలగించడానికి గల కారణం నెట్‌వర్క్ సాధ్యత కావచ్చు.

బిఎస్ఎన్ఎల్ 33GB ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క "33GB ప్లాన్" ను అండమాన్ మరియు నికోబార్ దీవులు మినహా భారతదేశం అంతటా రూ.1999 ధర వద్ద అందిస్తున్నది. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 33GB డేటాను 100Mbps వేగంతో అందిస్తుంది. దీని తరువాత దీని యొక్క డేటా వేగం 4Mbpsకు తగ్గించబడుతుంది.

అండమాన్ దీవులలో బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు
అండమాన్ మరియు నికోబార్ దీవులలో బిఎస్ఎన్ఎల్ యొక్క అన్ని టాప్-టైర్డ్ ప్లాన్‌ల యొక్క డేటా స్పీడ్ 10Mbpsకు పరిమితం చేయబడింది. రూ.7999 ధర గల భారత్ ఫైబర్ 225GBu_CS333_AN ప్లాన్ 10Mbps స్పీడ్‌తో 225GB డేటాను అందిస్తుంది. ఈ డేటా పరిమితి తర్వాత బిఎస్‌ఎన్‌ఎల్ 1MB కి రూ.10 వసూలు చేస్తుంది. ఇతర సర్కిల్‌లలో మాదిరిగా ఆపరేటర్ రూ.1999 ప్లాన్ ను ఇక్కడ అందించడం లేదు.

తమిళనాడు సర్కిల్‌లలో 200Mbps ప్లాన్
తమిళనాడు మరియు పుదుచ్చేరి సర్కిల్‌లలో ఇప్పుడు కూడా బిఎస్‌ఎన్‌ఎల్ తన ఫైబ్రో కాంబో ULD 1999 CS 55 ప్లాన్ ను 1500GB లేదా 1.5TB డేటాను 200Mbps వేగంతో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత దీని యొక్క వేగం 2Mbps కు తగ్గిస్తుంది. ఈ ప్లాన్ ధర 1999 రూపాయలు.

BSNL 200Mbps ప్లాన్ లభ్యత ప్రాంతాలు
బిఎస్ఎన్ఎల్ తమిళనాడు సర్కిల్ లో భారత్ ఫైబర్ యొక్క 200Mbps ప్లాన్ ను మరో 11 నగరాలలో కూడా అందిస్తున్నది. ఈ ప్లాన్ మొదట్లో చెన్నై, కోయంబత్తూర్, మదురై, పొల్లాచి, ట్రిచీ వంటి ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం చేయబడింది. భారత్ ఫైబర్ కనెక్షన్ పొందిన 11 నగరాల్లో సేలం, నమక్కల్, మెట్టూర్, యెర్కాడ్, ఒమలూర్, శంకాగిరి, తిరుచెంగోడ్, అత్తూర్, వలపడి, రాసిపురం మరియు వేలూర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








