పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేయడం ఎలా..?

Written By:

డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎమ్ ని ఎంతోమంది వినియోగదారులు వాడుతున్నారు. చిరు వ్యాపారులకయితే ఇదే ప్రధానంగా మారింది. టీ షీపు దగ్గర నుంచి కూరగాయల షాపు దాకా ప్రతి ఒక్కరూ పేటీఎమ్ ని ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమందికి పేటీఎమ్‌లోని అమౌంట్‌ని బ్యాంకుకి ఎలా ట్రాన్సఫర్ చేయాలా అనే విషయం తెలిసి ఉండకపోవచ్చు. చిరు వ్యాపారులకయితే ఇది ఓ పెద్ద సమస్యగా మారిన సంధర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారి కోసం పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేసే విధానం గురించి చెబుతున్నాం. ఓ సారి చూడండి.

భార్యని అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నారా, టెకీలకు ఇకపై నో ఛాన్స్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ 1

మీ మొబైల్ నుంచి పేటీఎమ్ యాప్ ఓపెన్ చేస్తే అందులో పాస్‌బుక్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి

ట్రిక్ 2

అది ఓపెన్ చేయగానే సెండ్ మనీ ఆప్సన్ కనిపిస్తుంది. దాంతో పాటు యాడ్ మనీ ఆప్సన్ కూడా కనిపిస్తుంది.

ట్రిక్ 3

సెండ్ మనీ క్లిక్ చేయగానే మీకు ట్రాన్సఫర్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి.

ట్రిక్ 4

అది క్లిక్ చేయగానే మీరు ఏ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు పంపాలనుకుంటున్నారో ఆ బ్యాంకు అకౌంట్ నంబర్ అడుగుతుంది.

ట్రిక్ 5

అన్ని వివరాలు ఎంటర్ చేశాకా చివరిగా సెండ్ బటన్ నొక్కితే డబ్బులు ట్రాన్సఫర్ అయినట్లే. అయితే పేటీఎమ్ వ్యాలెట్ లో మనీ తప్సనిసరిగా ఉండాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
How to Transfer Money From Paytm to Bank Account Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting