భార్యని అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నారా, టెకీలకు ఇకపై నో ఛాన్స్ !

Written By:

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం రోజు రోజుకు తీసుకుంటున్న నిర్ణయాలు భారత ఐటీ ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ట‌్రంప్ ప్ర‌భుత్వం హెచ్‌-1బీ వీసాదారుల‌కు మరో బాంబు వేయడానికి రడీ అవుతోంది. వీసా సంస్కరణలు, ప్రీమియం వీసాలపై తాత్కాలిక నిషేదం లాంటి సంచలన నిర్ణయాలతో ఐటీ ఉద్యోగులకు గుబులుపుట్టిస్తున్న అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా హోల్డర్ల భాగ‌స్వాముల‌కు(భార్యలేదా భర్త), హెచ్‌-4 వీసాదారులపై వేటు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

4జిబి ర్యామ్‌తో లీకో ఫోన్, ధర తక్కువే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విదేశీ ఉద్యోగులను ఏరివేసే క్రమంలో

ట్రంప్ ప్రభుత్వం వలస కార్మికులు విదేశీ ఉద్యోగులను ఏరివేసే క్రమంలో మరింత దూకుడుగా కదులుతోంది. చట్టబద్దంగా అనుమతి వున్న ఉద్యోగులపై వేటు వేసేందుకు యోచిస్తోంది.

హెచ్‌-4 వీసా అనుమ‌తిని ర‌ద్దు చేసే యోచ‌న‌లో

ఈ క్రమంలో హెచ్‌-1బీ వీసా దారుల భార్యల హెచ్‌-4 వీసా అనుమ‌తిని ర‌ద్దు చేసే యోచ‌న‌లో ట్రంప్ ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే దీనిపై వాషింగ్ట‌న్ కోర్టులో డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్ జస్టిస్‌ 60 రోజుల గ‌డువు కోరింది.

ఐటీ ఉద్యోగుల భాగస్వాముల

దీంతో వేలాదిమంది భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వాముల( హెచ్‌-4 వీసాదారులు) ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నాయనే ఆందోళన నెలకొంది.

ఎన్నో ఏళ్ల‌పాటు పోరాడి ఈ అనుమ‌తిని

హెచ్‌-4 వీసాదారులు (హెచ్‌-1బీ వీసాదారుల‌పై ఆధార‌ప‌డేవాళ్లు) ఎన్నో ఏళ్ల‌పాటు పోరాడి ఈ అనుమ‌తిని సంపాదించారు. 2015, ఫిబ్ర‌వ‌రిలో అప్ప‌టి ఒబామా ప్ర‌భుత్వం ఈ అనుమ‌తినిచ్చింది. తద్వారా గ్రీన్‌కార్డు కోసం వేచి చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల భాగ‌స్వాముల‌కు ఈ అవకాశం లభించింది.

సేవ్ జాబ్స్ యూఎస్ఏ

అయితే దీనిపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే గ్రూప్ మళ్లీ రెండోసారి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జ‌స్టిస్ మ‌ద్ద‌తు కూడా ల‌భించింది. దీనిపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి 60 రోజుల స‌మ‌యం కోరింది.

అమ‌న్ క‌పూర్ కోర్టులో కౌంట‌ర్

అయితే అమెరికాలో భారీగావున్న ఈ హెచ్‌-4 వీసాదారుల త‌ర‌ఫున ఇమ్మిగ్రేష‌న్ వాయిస్ అధ్య‌క్షుడు అమ‌న్ క‌పూర్ కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. అస‌లు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డానికి స‌రైన ఆధార‌మే లేద‌ని అమ‌న్ క‌పూర్ వాదిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
H-1B Visa holders’ spouses, on H4 visa, will not be able to work if Trump administration has its way read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot