వీడియోలను GIFలోకి మార్చుకోవడం ఎలా..? ( సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండా )

Written By:

ఈ రొజుల్లో యూట్యూబ్ అనేది కామన్ అయిపోయింది. అందరూ యూట్యూబ్ లో అకౌంట్లు ఓపెన్ చేసి వారికి నచ్చిన విధంగా వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే అలాంటి వీడియోల్లో కొన్ని సీన్లు చాలా హైలెట్ గా ఉంటాయి. అలాంటి వాటిని GIF ఫైల్స్ లోకి మార్చుకోవాలని చూస్తుంటారు. అయితే ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఈ చిట్కాల ద్వారా మీరు వీడియోలోని సీన్లను GIFలోకి మార్చుకోవచ్చు.

దిగ్గజాలకు షాక్..ఆపిల్ నుంచి డ్యూయెల్ సిమ్ ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీరు యూట్యూబ్‌లో ఏ వీడియో సీన్ అయితే GIFలోకి మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో యూఆర్ఎల్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు వీడియో ఇలా కనిపిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 2

ఆ వీడియోలోని యూఆర్ఎల్ పై భాగంలో www. పక్కన GIF అని టైప్ చేస్తే ఆ వీడియో GIFలోకి మారేందుకు ఈ సీన్ కావాలో సెలక్ట్ చేసుకోమని అడుగుతుంది.

టిప్ 3

అందులో మీరు కింద మార్క్ లో కనిపించే విధంగా మీకు ఓ బ్లూ బార్ కనిపిస్తుంది. ఆ బార్ లో మీకు నచ్చిన సీన్ ఎక్కడైతే ఉందో అక్కడిదాక్ సెట్ చేసుకోవాలి.

టిప్4

మీరు సీన్ సెలక్ట్ చేసుకున్న తరువాత కింద రైట్ మార్క్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీ GIF ఇమేజ్ వచ్చినట్లే. ఇందులో GIF ఫైల్ ని మీకు నచ్చిన విధంగా కూడా క్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది.

టిప్ 5

రైట్ మార్క్ క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్ లో వీడియో యూఆర్ఎల్స్ కనిపిస్తాయి. వాటిల్లో మీరు మొదటిది కాపీ చేసుకుని మీ వాల్ లో పేస్ట్ చేస్తే మీరు అనుకున్న యానిమేటెడ్ GIF పబ్లిష్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్

English summary
How to turn any YouTube video into an animated GIF Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot