దిగ్గజాలకు షాక్..ఆపిల్ నుంచి డ్యూయెల్ సిమ్ ఫోన్లు !

Written By:

ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న మొబైల్ దిగ్గజం ఏదైనా ఉందంటే అది ఆపిల్ కంపెనీనే అని చెప్పాలి. ఆ కంపెనీ నుంచి ఫోన్లు వస్తున్నాయంటే ఆపిల్ అభిమానులు నిద్రాహారాలు మానివేసి లైన్లలో నిలబడతారు. ఐఫోన్ సొంతం చేసుకునే దాకా వదిలిపెట్టరు. అలాంటి ఐఫోన్ కేవలం ఇప్పటి దాకా సింగిల్ సిమ్‌తోనే వచ్చింది. అయితే కంపెనీ నుంచి రానున్న ఐఫోన్లు డ్యూయెల్ సిమ్‌తో రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

వైఫై సిగ్నల్ పెరగడం లేదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియాలో రూమర్లు

రీసెంట్ ఆపిల్ 7 వచ్చిన నేపథ్యంలో త్వరలో చైనాలో విడుదల కానున్న ఐఫోన్ 8 డ్యూయెల్ సిమ్ తో రానున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. అయితే ఈ రూమర్లు ఐఫోన్ 7 విడుదలకు ముందు కూడా హల్ చల్ చేశాయి. కాని సింగిల్ సిమ్ తోనే ఐఫోన్ 7 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రీన్ సిగ్నల్

అయితే ఇప్పుడు ఆ కొరతను ఐఫోన్ 8తో తీర్చనున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం డ్యూయెల్ సిమ్ పేటెంట్ కోసం United States Patent and Trademark Officeలో ఆపిల్ కంపెనీ దరఖాస్తు చేసింది. దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు సెపరేట్ యాంటెన్నాలను

రూమర్స్ ప్రకారం డ్యూయెల్ సిమ్‌తో పాటు రెండు సెపరేట్ యాంటెన్నాలను కూడా రానున్న ఐఫోన్ 8లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇక పేటెంట్‌లో ఉన్న సమాచారం ప్రకారం రెండు సిమ్ కార్డులతో ఫ్యూచర్ ఐఫోన్ రానుందని, అయితే వాటి మధ్య ప్రాధాన్యత ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఏదీ ముఖ్యం అనుకుంటే దానికి ప్రాధాన్యత

పేటెంట్ వివరణ ప్రకారం కాల్స్ కి మాత్రమే వాడుకునే విధంగా ఒక సిమ్ స్లాట్ , డేటా కోసం ఇంకో సిమ్ స్లాట్ వాడుకునే విధంగా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. మనకి ఏదీ ముఖ్యం అనుకుంటే దానికి ప్రాధాన్యత ఇచ్చుకునే అవకాశం ఉంటుందని సమాచారం.

LTE నెట్ వర్క్

రానున్న ఈ స్లిమ్ స్లాట్లు LTE నెట్ వర్క్ ని సపోర్ట్ చేయనున్నాయి. మీరు దేనికైనా ప్రాధాన్యత ఇవ్వవచ్చు. రెండు సిమ్ ల కనెక్టివిటీ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని సమాచారం.

పేటెంట్ కి సంబంధించిన వివరాలు మాత్రమే

ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి కేవలం పేటెంట్ కి సంబంధించిన వివరాలు మాత్రమే. ఆపిల్ కూడా దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.ఈ టెక్నాలజీని ఆపిల్ రానున్న డివైస్ లో ఉపయోగించుకోవచ్చు. అలాగే ఉపయోగించుకోకపోవచ్చు. కాని సమాచారం ప్రకారం ఎప్పటికైనా ఆపిల్ నుంచి డ్యూయెల్ సిమ్ ఐఫోన్ రానుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple granted patent for dual-SIM technology read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting