Airtel యూజర్లు Amazon Prime ను క్లయిమ్ చేసుకోవడం ఎలా?
టెలికాం ఆపరేటర్లు కొన్ని ప్రస్తుతం ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లతో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తున్నారు. వీటితో పాటుగా మొబైల్ ప్రొటెక్షన్, ఉచిత ఈబుక్స్, హ్యాండ్‌సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి మరిన్ని అనేక ఇతర ఆఫర్‌లను కూడా అందిస్తున్నాయి.

అదనపు ప్రయోజనాలతో అతి ముఖ్యమైన ఆఫర్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం. కొంత మంది ఆపరేటర్లు దీనిని కూడా ఉచితంగా అందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా పొందినప్పటికీ దానిని ఎలా పొందాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతున్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ - అమెజాన్ ప్రైమ్
ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఇటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్ అకౌంటులను నిర్వహించడం, రీఛార్జ్ చేయడం, బిల్లులు చెల్లించడం మాత్రమే కాకుండా ఇటువంటి ఆఫర్‌లను కూడా క్లెయిమ్ చేయవచ్చు. కాబట్టి మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయితే మీరు ఈ ఆఫర్‌లకు అర్హులు అవునా? కాదా? వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అర్హులు అయితే కనుక వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న దశలను అనుసరించండి.

అర్హత ప్రమాణాలు
*** ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. DTH కస్టమర్లకు కాదు.
*** అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంను 1 సంవత్సర కాలానికి ఉచితంగా పొందడానికి ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.499 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ మీద ఈ ప్రయోజనంను పొందవచ్చు. మరోవైపు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ మీద అమెజాన్ ప్రైమ్ ను పొందవచ్చు.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని క్లెయిమ్ చేయడానికి పాటించవలసిన దశలు
*** సంబంధిత యాప్ స్టోర్ల నుండి ఎయిర్‌టెల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
*** మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి యాప్ ను సెటప్ చేయండి. కుడివైపు ఎగువ మూలలో గల "థాంక్స్ డిస్కవర్ ఎయిర్‌టెల్" ను నొక్కండి.
*** ఇప్పుడు క్రిందికి స్క్రోల్ అందులో గల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ ఎంపిక కోసం చూడండి. మరియు అందులో గల "క్లయిమ్" బటన్ మీద నొక్కండి.
*** ఇది ఆటోమ్యాటిక్ గా మిమ్మల్ని అమెజాన్ ప్రైమ్ లాగిన్ పేజీకి మళ్ళిస్తుంది. రివార్డ్‌ను క్లెయిమ్ చేయడానికి లాగిన్ వివరాలను నమోదు చేస్తుంది.


Click it and Unblock the Notifications








