ఇంటర్నెట్ లేకుండానే ఫేస్‌బుక్‌ను ఆడేసుకోండి !

Written By:

మీరు ఇంటర్నెట్ డేటా కార్డులతో విసిగిపోయారా..డబ్బులు మంచి నీళ్లలా ఇంటర్నెట్ కు ఖర్చు అవుతున్నాయా..అయితే ఇక మీకు ఆ బెంగ అవసరం లేదు. మీరు ఫ్రీగా ఫేస్‌బుక్ చూడొచ్చు. మీ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఓ రూపాయి చెల్లిస్తే మీకు అపరిమిత ఫేస్‌బుక్ కూడా లభిస్తుంది.. అదెలాగంటారా అయితే ఓ చిన్న లుక్కేయండి.

జియోకి దిమ్మతిరిగేలా 4జీ ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్టెల్, ఎయిర్సెల్, ఐడియా, టాటా డొకొమో

మీరు ఎయిర్టెల్, ఎయిర్సెల్, ఐడియా, టాటా డొకొమో యూజర్లయితే స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫేస్‌బుక్ చూడవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

స్టార్ 325 హ్యాష్

ఇందు కోసం చేయాల్సిందేంటంటే .. స్టార్ 325 హ్యాష్ (* 325 #) ని ప్రెస్ చేయడమే.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోనెట్ విష్

ఫేస్‌బుక్ ఇండియా, ఫోనెట్ విష్ భాగస్వామ్యం వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఫోనెట్ విష్ అంటే యూఎస్ఎస్డీ (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా) ఆధారంగా పనిచేసే ఇంటరాక్టివ్ సర్వీస్.

డేటా కనెక్షన్ లేకుండానే

డేటా కనెక్షన్ లేకుండానే డివైస్‌లను కనెక్ట్ చేసుకునే వెసులుబాటును యూఎస్ఎస్డీ కల్పిస్తుంది. ఇలా చేయడం వల్ల ఫేస్‌బుక్ స్టేటస్ మాత్రమే ఉచితంగా చూసుకోగలరు.

కామెంట్ పెట్టాలన్నా

పోస్టింగ్ చెయ్యాలన్నా, కామెంట్ పెట్టాలన్నా, లైక్ చేయాలన్నా, ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే.

త్వరలోనే మిగతా నెట్వర్క్లకు

అయితే రోజుకి ఒక రూపాయి చెల్లిస్తే ఫేస్‌బుక్ అపరిమితంగా చూసుకోవచ్చని యూఎస్ఎస్డీ చెబుతోంది. త్వరలోనే మిగతా నెట్వర్క్లకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఫేస్‌బుక్ ఫీచర్లకు యాక్సెస్

స్మార్ట్ఫోన్ నుంచి స్టార్ 325 హ్యాష్ను టైప్ చేసి ఫేస్‌బుక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ ఫీచర్లకు యాక్సెస్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Use Facebook Without Internet Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting