జియోకి దిమ్మతిరిగేలా 4జీ ఆఫర్లు..

Written By:

ఉచిత ఆఫర్లతో మార్కెట్ ని శాసిస్తున్న జియోకు గట్టి పోటీనిచ్చేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమవుతోంది. త్వరలో కళ్లు చెదిరే 4జీ ఆఫర్లతో జియో మీద దాడి చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఎయిర్‌టెల్ జియో రాకతో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో జియోకు ధీటైన ఆఫర్లతో రావాలని వ్యూహాలు రచిస్తోంది.ఇదే విషయాన్ని ఎయిర్‌టెల్ అధికారులు ప్రస్తావించారు.

చరిత్ర సృష్టించిన జియో, యూజర్లకు తప్పని తిప్పలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ ఆఫర్లకు ధీటుగా

జియో ప్రవేశపెట్టిన 4జీ ఆఫర్లకు ధీటుగా ఎయిర్‌టెల్ 4జీ ఆఫర్లతో త్వరలో వినియోగదారుల ముందుకు వస్తుందని ఎయిర్‌టెల్ కంపెనీ ఎండి, సిఇఒ గోపాల్‌ విఠల్‌ చెబుతున్నారు. జియో ఉచిత ఆఫర్లకు పోటీగా మేమే కళ్లు చెదిరే ఆఫర్లను తీసుకొస్తామని సవాల్ విసిరారు.

ఎయిర్‌టెల్ ఎన్నడూ లేని విధంగా నష్టాల బాట

అయితే ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియో దెబ్బకి ఎయిర్‌టెల్ ఎన్నడూ లేని విధంగా నష్టాల బాట పట్టింది. ఏడాదికి ఏడాది స్వల్ప పెరుగుదల నమోదు చేసుకుంటూ పోతున్న ఎయిర్‌టెల్ జియో రాకతో తొలిసారిగా నష్టాల బాటలోకి మళ్లింది.

గత మూడునెలల్లో

గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడునెలల్లో ఎయిర్‌టెల్ స్వల్పంగా నష్టాల బాట పట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ డేటా ఆదాయం 21.5 శాతం నుంచి 24.7 శాతానికి చేరింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.1,461 కోట్ల నికర లాభం

ఈ కాలానికి ఎయిర్‌టెల్‌ రూ.24,652 కోట్ల ఆదాయంపై రూ.1,461 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 3.5 శాతం పెరిగినా నికర లాభం 4.9 శాతం పడిపోయింది.

జియో పోటీ

రిలయన్స్‌ జియో పోటీతో పాటు స్పెక్ట్రమ్‌ చెల్లింపుల భారం, నైజీరియా కరెన్సీ మారకం రేటు పడిపోవడం, వడ్డీ చెల్లింపుల భారం పెరగడం ఎయిర్‌టెల్‌ లాభాలను దెబ్బతీసిందని కంపెనీ ఎండి, సిఇఒ గోపాల్‌ విఠల్‌ చెప్పారు.

జియోపై ఫైర్

దెబ్బతో బిత్తరపోయిన భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ జియోపై ఫైర్ అయ్యారు. జియో జీవితకాలం పాటు వాయిస్ సేవలను పూర్తిగా ఉచితంగా ఇవ్వడం సబబు కాదంటూ మండి పడ్డారు.

ఏదీ ఎప్పటికీ జీవిత‌కాలం ఉచితంగా

జియో ఉచిత వాయిస్ కాల్ ఆఫర్‌పై క్లీన్‌చిట్ ఇచ్చిన‌ ట్రాయ్ మ‌ళ్లీ ఈ అంశాన్ని స‌మీక్షించాల‌ని, ఏదీ ఎప్పటికీ జీవిత‌కాలం ఉచితంగా ఉండ‌బోద‌ని అన్నారు. జియో ఉచితంపై మిగతా కంపెనీలు కూడా సీరియస్ అవుతున్నాయి.

ఈ విషయంపై తగిన సమయంలో

ఇక రిలయన్స్ జియోకు పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఇవ్వలేదన్న మాట అవాస్తవమంటూ, దీనిపై ట్రాయ్ భారీ మొత్తంలో జరిమానా విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంపై తగిన సమయంలో స్పందిస్తామని సునీల్ మిట్టల్ తెలిపారు.

జరిమానా

లెసైన్స్ నిబంధనల అతిక్రమణ, జియోకి ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేయకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై రూ.1,050 చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా విధించాలని రెగ్యులేటర్ ట్రాయ్.. డాట్‌కు సూచించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Airtel readying aggressive 4G bundled offers to take on Reliance Jio Read more At telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting