ఫోన్ నెంబర్ లేకుండా వాట్సాప్‌ వాడటం ఎలా..?

దాదాపుగా స్మార్ట్‌ఫోన్ వాడుతోన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌‌ను కలిగి ఉంటున్నారు. ఒకప్పుడు, ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్‌తో పాటు వీడియో కాలింగ్ కూడా సాధ్యమవుతోంది. మొబైల్ నెంబర్‌తో పనిలేకుండా వాట్సాప్ అకౌంట్‌ను వినియోగించుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్ ఎప్పటి నుంచి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా వాట్సాప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకోండి. యాప్ విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేసి సెటప్ ప్రాసెస్‌ను మొదలుపెట్టండి.

స్టెప్ 2

గూగుల్ ప్లే స్టోర్‌లోకి TextNow యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.

మీకో ప్రత్యేకమైన నెంబర్‌ను కే

సెటప్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే TextNow యాప్ మీకో ప్రత్యేకమైన నెంబర్‌ను కేటాయించటం జరుగుతుంది. ఆ నెంబర్ ను ఓ పేపర్ పై రాసుకోండి.

స్టెప్ 4

ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌ను వెరిఫికేషన్ బాక్సులో ఎంటర్ చేయండి.వెరిఫికేషన్ బై ఎస్ఎంఎస్ ఆప్షన్ కోసం 2 నిమిషాల పాట ఎదురు చూడండి. ఎస్ఎంఎస్ రానట్లయితే వెరిఫికేషన్ బై కాల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 5

ఇప్పుడు TextNow యాప్‌లోకి వెళ్లండి. వాట్సాప్ వెరిఫికేషన్ కాల్ మీకు అందుతుంది. ఆ కాల్‌లో చెప్పే వెరిఫికేషన్ నెంబర్‌ను నోట్ చేసుకోండి.వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి సంబంధిత కాలమ్‌లో వెరిఫికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. అంతే మీ వాట్సాప్ అకౌంట్ రన్ అయిపోతుంది. త్వరలో లాంచ్ కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
How to Use WhatsApp without Phone Number. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting