ఇండక్షన్ స్టవ్ సూత్రమేంటి..? దానితో లాభాలేంటి..?

By Hazarath
|

మీరు మీ ఇంట్లో ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా..అయితే అది ఎలా పనిచేస్తుందో మీకేమైనా తెలుసా..మంట కనిపించదు..అలాగే ఆ స్టవ్ వేడెక్కదు. కాని మీరు చేయాల్సిన వంటలన్నీ అయిపోతుంటాయి. మరి అదెలా సాధ్యం. కరెంట్ తో నడిచే ఈ స్టవ్ లు వచ్చి చాలా కాలమైనా వాడుకలో వీటి గురించి తెలిసిన వారు చాలా తక్కువ. ఇప్పటికీ దీని గురించి చాలామందికి తెలియదంటే నమ్మి తీరాల్సిందే. అయితే ఇదెలా పనిచేస్తుందో ఓ సారి చూద్దాం.

Read more: మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

సాధారణంగా విద్యుత్ స్టవ్ లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి వాటిలో విద్యుత్ ప్రవాహంతో ఫిలమెంటు లేదా ప్లేటు వేడెక్కి ఉష్ణం విడుదలవుతుంది. దాంతో పాత్రలు వేడెక్కి వాటిల్లోని ఆహార పదార్థాలు ఉడుకుతాయి. కానీ ఇండక్షన్ స్టవ్ ఇందుకు పూర్తి భిన్నంగా పనిచేస్తుంది.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ లో నేరుగా ఎలాంటి వేడి ఉత్పత్తి కాదు. ఫిలమెంట్ లాంటిది వేడెక్కడం, దాన్నుంచి పాత్ర వేడిని గ్రహించడం ఉండదు. నేరుగా ఈ స్టవ్ పై పెట్టిన పాత్ర, అందులోని పదార్థం మాత్రం వేడెక్కుతాయి.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?
 
ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

దీనికి కారణం విద్యుదయాస్కాంత ప్రేరణ శక్తి. ఇండక్షన్ స్టవ్ అంతర్భాగంలో రాగి తీగ చుట్ట ఉంటుంది. అందులో విద్యుత్ ప్రవహించగానే.. దాని చుట్టూ నిర్ణీత ప్రాంతంలో విద్యుదయాస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

దీని ప్రభావానికి లోనయ్యే లోహాలతో చేసిన ఇనుము, స్టెయిన్ లెస్ స్టీల్ వంటి పాత్రలను ఆ స్టవ్ పై పెట్టగానే విద్యుదయాస్కాంత శక్తి ప్రభావం మొదలవుతుంది. ఈ ప్రేరణకు లోనైన ప్రాంతం వరకు పాత్రలోని అణువులు విపరీతంగా కంపించి.. నేరుగా పాత్రలోనే వేడి పుడుతుంది. ఇలా భౌతికశాస్త్రంలో అత్యంత సాధారణమైన, సరళమైన సూత్రాలపై ఆధారపడి ఇండక్షన్ స్టవ్ పనిచేస్తుంది.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ కాయిల్ అంటే రాగి తీగలో విద్యుత్ ప్రవాహ స్థాయి పెరిగిన కొద్దీ.. ప్రేరణ శక్తి ఎక్కువై పాత్రలో పుట్టే ఉష్ణం మరింతగా ఎక్కువవుతుంది. అందువల్ల ఇండక్షన్ కాయిల్ కు అందే విద్యుత్ ను నియంత్రించేందుకు ఇండక్షన్ స్టవ్ లో ఏర్పాట్లు ఉంటాయి. దాని ద్వారా స్టవ్ ద్వారా జనించే వేడిని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయవచ్చు.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

అయితే దీనిపై ఇనుము స్టీల్ లాంటి పాత్రలనే పెట్టాలి. ప్లాస్టిక్ పాత్రలు పెడితే అది పనిచేయదు. అంతేకాకుండా మీరు పెట్టే గిన్నె సమతలంగా ఉండాలి. అప్పుడే అది వేడిని గ్రహించగలదు.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇక మీరు స్టవ్ పై నుంచి పాత్రను తీసివేయగానే దానంతట అదే ఆగిపోతుంది. మళ్లీ పాత్రను పెట్టగానే ఆన్ అవుతుంది. అంటే ఆఫ్ చేయడం మర్చిపోయినా సమస్యేమీ ఉండదు. అందువల్ల ఈ స్టవ్ ల నిర్వహణ చాలా సులభం.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ల ధరలు కూడా తక్కువే. 1500 వాట్ల సామర్థ్యమున్న స్టవ్ లు కేవలం రూ.2,000 నుంచి లభిస్తాయి. 2000 వాట్ల సామర్థ్యమున్నవి రూ.3,500 వరకు ఉంటాయి. 

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

మీరు ఒకవేళ దీన్ని కొనాలనుకుంటే మంచి కంపెనీది చూసి కొనుక్కోండి. నాసిరకం కంపెనీలవి వాడితే కరెంట్ ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంది. అలాగే తొందరగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. మంచి కంపెనీలు వారంటీతో కూడిన స్టవ్ లను అందిస్తున్నాయి. వాటిని ప్రయత్నించడం మేలు.

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది...?

ఇండక్షన్ స్టవ్ లను గంట సేపు పూర్తి స్థాయిలో వినియోగిస్తే.. సుమారు ఒక యూనిట్ నుంచి ఒకటిన్నర యూనిట్ వరకు విద్యుత్ ఖర్చవుతుంది. అయితే ఆ లోపే వంట పూర్తవుతుంది కూడా.

Best Mobiles in India

English summary
Here Write how to work induction cooker

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X