గూగుల్ డాట్ కాం చాలా డేంజర్ : షాకిచ్చిన గూగుల్

By Hazarath
|

గూగుల్ డాట్ కాం... ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఒకరోజులో అత్యధికంగా తెరచి చూసే వెబ్ సైట్. ఈ వెబ్‌సైట్‌పై గూగుల్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వెబ్‌సైట్ కొంచెం ప్రమాదకరమేనని అంగీకరించింది. గూగుల్ సెర్చ్ టూల్‌ను వాడుతున్న వేళ, కొన్ని వందల కోట్ల యూఆర్ఎల్‌లను వెతికి సమాచారాన్ని అందించే సంస్థ ఒక్కోసారి రక్షణాత్మకం కాని వెబ్‌సైట్‌లనూ చూపుతోందని వెల్లడించింది.

Read more : గూగుల్ మ్యాప్ నుంచి సరికొత్త అప్‌డేట్

google

సెర్చ్ లో భాగంగా డిస్‌ప్లే అయ్యే పేజీల్లో కొన్నిసార్లు వైరస్‌లు వస్తున్నాయని, వాటిని ఓపెన్ చేస్తే, కంప్యూటర్లలోకి వైరస్ ఎక్కిపోతోందని, ఆపై కస్టమర్ల సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిస్తున్నారని గూగుల్ డాట్ కామ్ వెల్లడించింది. కొన్నిసార్లు యూజర్లు పనికిరాని కంటెంట్‌ను వెబ్‌సైట్లలో ఉంచుతున్నారని, వీటిని చూడటం వల్ల ఇతర కస్టమర్లకు కొంత అసౌకర్యం కలుగుతోందని పేర్కొంది. సమస్య తాత్కాలికమేనని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. అయితే సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాత్రమే కాదు. గూగుల్ ను తలదన్నే సెర్చ్ ఇంజెన్స్ చాలానే ఉన్నాయి. అవేంటో చూడండి.

Read more : గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

1

1

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజినే 'బింగ్'. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అన్ని డివైస్‌లలోనూ ఈ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా అందిస్తున్నారు. గూగుల్ లాగే ఇది కూడా ఏ అంశానికి చెందిన సమాచారాన్నయినా సరే క్షణాల్లోనే సెర్చ్ చేసి మనకు అందజేస్తుంది.

2

2

గూగుల్, బింగ్‌ల తరువాత యూజర్లు ఎక్కువగా వాడుతున్న సెర్చ్ ఇంజిన్ 'యాహూ'. మార్కెట్‌లో దీనికి 9.57 షేర్ ఉంది. పైన పేర్కొన్న వాటిలాగే ఇది కూడా పనిచేస్తుంది.

3

3

చైనాకు సెర్చ్ ఇంజిన్ కంపెనీ 'బైదు'. జనవరి 1, 2000వ సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. వెబ్‌సైట్లకు చెందిన సమాచారం, ఆడియో ఫైల్స్, ఫొటోల వంటి వాటిని దీని ద్వారా వెతకవచ్చు.

4
 

4

ప్రపంచంలో అత్యధిక శాతం మంది యూజర్లు వాడుతున్న సెర్చ్ ఇంజిన్లలో ఇది కూడా ఒకటి. మార్కెట్‌లో దీని వాటా 0.59 శాతం మాత్రమే. 1983లో కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌గా తొలుత దీన్ని ప్రారంభించారు. అనంతరం 1991లో 'అమెరికా ఆన్‌లైన్‌'గా మార్పు చెందింది. అన్ని సెర్చ్ ఇంజిన్లలాగే ఇది కూడా పనిచేస్తుంది.

5

5

ఇంతకు ముందున్న 'ఆస్క్ జీవ్స్' సంస్థే 'ఆస్క్‌'గా మారి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో సెర్చ్ రిజల్ట్స్ 'ప్రశ్న - సమాధానం' మోడల్‌లో వస్తాయి. 1995లో దీన్ని స్థాపించారు.

6

6

ఐఏసీ సెర్చ్ అండ్ మీడియాకు చెందిన సెర్చ్ ఇంజినే 'ఎగ్జయిట్'. దీని ద్వారా యూజర్లు కేవలం సెర్చ్ సమాచారాన్నే కాకుండా ఈ-మెయిల్, వార్తలు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, వాతావరణ స్థితిగతులను గురించి తెలుసుకోవచ్చు.

7

7

ఇంటర్నెట్ యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇతర సెర్చ్ ఇంజిన్‌లతో కలిసి ఇది యూజర్లకు నాణ్యమైన సెర్చ్ సమాచారాన్ని అందజేస్తుంది. 2008లో ఇది ప్రారంభమైంది.

8

8

ఇది ఇతర సెర్చ్ ఇంజిన్‌ల మాదిరిగా డాక్యుమెంట్స్ లేదా వెబ్ పేజీలకు చెందిన రిజల్ట్స్‌ను ఇవ్వదు. దీన్ని ఆయా అంశాలకు చెందిన గణనలకు ఉపయోగిస్తారు. అందుకే దీన్ని 'కంప్యూటేషనల్ సెర్చ్ ఇంజిన్' అని పిలుస్తారు. మ్యాథమాటికా సంస్థ దీన్ని 2009లో ప్రారంభించింది.

9

9

రష్యాలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది రష్యాకు చెందిన కంపెనీయే కావడం గమనార్హం. 1997లో దీన్ని ప్రారంభించారు. సాధారణ సెర్చ్ ఇంజిన్‌లలాగే ఇది కూడా పనిచేస్తుంది. కేవలం రష్యా దేశంలోనే కాకుండా ఉక్రెయిన్, కజకిస్థాన్, బెలారస్, టర్కీలలోనూ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

10

10

సెర్చ్ ఇంజిన్ రంగంలో 'లైకోస్' తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. 1994లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ-మెయిల్, వెబ్ హోస్టింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ వంటి సమాచారాన్ని ఇది సెర్చ్ రిజల్ట్స్‌తోపాటు అందిస్తుంది.

11

11

2006లో 'చాచా' సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. పైన పేర్కొన్న ఆస్క్ లాగే ఇందులో లభించే సెర్చ్ రిజల్ట్స్ కూడా ప్రశ్న - సమాధానం మోడల్‌లోనే ఉంటాయి. యూజర్లు వేసే ప్రశ్నలకు ఇది రియల్ టైమ్‌లో సమాధానాలిస్తుంది.

12

12

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Google thinks Google.com is a dangerous website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X