ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఏలా..?

Posted By:

గూగుల్ మ్యాప్స్.. ఇదో అత్యుత్తమ మ్యాపింగ్ సర్వీస్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లకు అందుబాటులో ఉన్న యాప్ మొబైల్ ఇంటర్నెట్ డేటాను అత్యధికంగా ఖర్చు చేస్తుంది.

ఇంకా చదవండి : 2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ7000, ధర రూ.8,999

మొబైల్ ఇంటర్నెట్ డేటాను పొదుపుగా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నవారు ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్ప్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా డబ్బుతో పాటు విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ప్ ఆఫ్‌లైన్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ లో డివైస్ లలో పనిచేస్తుంది. అది ఏలాగంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ డివైస్‌లలో తప్పనిసరిగా గూగుల్ మ్యాప్స్ లేటెస్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ అయి ఉండాలి.

ముందుగా మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను యాక్టివేట్ చేసుకుని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఆ తరువాత మీరు ఆఫ్‌లైన్‌లో వీక్షించాలనుకుంటున్న ప్రదేశాన్ని శోధించండి. (ఉదాహరణకు ముంబయ్).

ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశం పై ట్యాప్ చేయండి.

ఇప్పుడు మీకు "Save map to use offline" అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే చేయండి.

మరో సారి ధృవీకరణ కోసం ఈ మ్యాప్‌ను సేవ్ చేయమంటారా అంటూ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

ఇప్పుడు మీ ఆఫ్‌లైన్ మ్యాప్‌కు పేరు పెట్టి సేవ్ చేసినట్లయితే మ్యాప్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఇప్పుడు మీ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేసుకుని గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసుకుని మెనూలోని యువర్ ప్లేసెస్‌లో ఆఫ్‌లైన్ మ్యాప్‌లను వీక్షించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to use Google maps offline on android and iOS. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot