మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎంత వరకు సేఫ్..?

Written By:

ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం అయితే అందులో బ్రౌజ్ చేయటమనేది ఈత కొట్టడం లాంటింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈత కొట్టడమనేది ఎంత రిస్కో, సరైన ప్రికాషన్స్ లేకండా చేసే ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా అంతే రిస్క్. నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీక అవగాహన తప్పనిసరి. ఆన్‌లైన్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలను ఇప్పుడు చర్చించుకుందాం..

ఫేస్‌బుక్ 12వ పుట్టిన రోజు, పన్నెండు ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

మీకు సంబంధించిన అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

పబ్లిక్ వె-పై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీకు ఇంటర్నెట్ అత్యవసరమయితే మాత్రమే సదరు నెట్‌వర్క్‌కు వీపీఎన్ (వర్చువల్ ప్రయివేట్ నెట్‌వర్క్) ద్వారా కనెక్ట్ అవ్వండి. పబ్లిక్ వె-పైకు కనెక్ట్ అయిన సమయంలో మీ డివైస్‌లోని ఫైర్‌వాల్ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసి ఉంచండి. పబ్లిక్ వె-పై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఫైల్ షేరింగ్‌కు దూరంగా ఉండండి.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

మీడియా కంటెంట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. Torrent సైట్స్ జోలికి వెళ్లొద్దు. ఈ సైట్‌లలో నక్కి ఉండే మాల్వేర్ ఇన్‌ఫెక్టెడ్ యాడ్స్ మీ డివైస్‌ను ధ్వంసం చేయగలవు.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

ఇంటర్నెట్‌లో సెలబ్రెటీల గురించి సెర్చ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా వాళ్లకు సంబంధించిన కాంట్రవర్శీలు ఇంకా సీక్రెట్ ఫుటేజ్‌లకు దూరంగా ఉండండి. వీటి కోసం ఆశపడితే మీరు చిక్కుల్లో పడ్డట్టే..

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

మీ స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌కు సంబంధించిన అన్ని సాఫ్ట్‌వేర్‌లను అప్‌టుడేట్‌గా ఉంచుకోండి. సాఫ్ట్‌వేర్‌ల అప్‌డేట్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే మాల్వేర్లు మీ డివైస్‌ను చుట్టుముట్టే ప్రమాదముంది.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..? అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

క్లౌడ్ సర్వీసులో మీ డేటాను భద్రపరుచుకునేముందు, ఆ డేటాను ఎన్‌క్రిప్ట్ చేయండి.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు మీ సమాచారాన్ని సులువుగా లీక్ చేయగలవు. కాబట్టి, మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ను మరింత బలోపేతం చేసుకండి. మీ సోషల్ మీడియా అకౌంట్‌లను మీరు తప్ప వేరొకరు ఓపెన్ చేసే అవకాశం ఇవ్వకుండా శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోండి.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

ఈమెయిల్ ద్వారా మీరు పంపే ముఖ్యమైన సమచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ ఫైల్‌లో పొందుపరిచి ఆ తరువాత సెండ్ చేయండి.

ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక సూత్రాలు

మీ ఆన్‌లైన్ అకౌంట్‌లను ఓపెన్ చేసిన ప్రతిసారి సైన్అవట్ చేయటం మరవకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Internet security: 10 Rules You Should Follow to Keep Your Personal Data Safe. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot