ఈ రోజు ఫేస్‌బుక్ పుట్టిన రోజు, మీకు తెలుసా..?

Written By:

2014, ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభించబడిన ఫేస్‌బుక్ నేటితో 12 వసంతాలను పూర్తి చేసుకుంది. మార్క్ జూకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌‌బుక్‌ 150 కోట్ల యాక్టివ్ యూజర్‌లతో సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఫేస్‌బుక్ 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఫిబ్రవరి 4వ తేదీని ఫ్రెండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని మార్క్‌ జూకర్‌బర్గ్ పిలుపునిచ్చారు.

ఈ రోజు ఫేస్‌బుక్ పుట్టిన రోజు, మీకు తెలుసా..?

50% Lenovo స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

ఈ క్రమంలో ఫిబ్రవరి మూడవ తేదీ నుంచే ఫ్రెండ్స్‌డే వీడియోలు యూజర్ వ్యక్తిగత అకౌంట్‌లలో హల్‌చల్ చేయటం మొదలుపెట్టాయి. వీటిని కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకుని షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఫేస్‌బుక్ కల్పించటం విశేషం. #friendsdayలో పాలుపంచుకోవటం వల్ల జీవితంలో సంతోషకర క్షణాలను ఆస్వాదించవచ్చని మార్క్ సూచించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ తొలత ‘ఫేస్‌మాష్'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్ ప్రారంభించినపుడు మార్క్ జూకర్‌బర్గ్ వయసు 19.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

మార్క్ జూకర్‌బర్గ్ 29 సంవత్సరాలకే youngest billionaire హోదాను దక్కించుకున్నారు.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 150 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌లో ప్రతి 10 నిమిషాలకు లక్ష ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపబడుతున్నాయి.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌ పై ప్రతి రోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌లో ప్రతి నిమిషానికి 1.8 మిలియన్ కొత్త లైక్స్ పుట్టుకొస్తున్నాయి.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌ ఒక్క నిమిషం ఆగిపోతే 2,500 డాలర్ల నష్టం వాటిల్లుతుంది.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

వాట్సాప్ సహవ్యవస్థాపకులు బ్రెయిన్ ఆక్టన్‌కు ఉద్యోగమిచ్చేందుకు ఫేస్‌బుక్‌ 2009లో నిరాకరించింది. 5 సంవత్సరాల తరువాత అతను తయారుచేసిన వాట్సాప్ ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌లో రోజు 350 మిలియన్ ఫోటోలు అప్‌లోడ్ అవుతున్నాయి.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌లో ప్రతి నెలా గేమ్స్ ఆడేందుకు కేటాయిస్తున్న సమయం 927 మిలియన్ గంటలు.

ఫేస్‌బుక్ గురించి 12 ఆసక్తికర విషయాలు

ఫేస్‌బుక్‌ కారణంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook celebrating its 12th birthday. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot