ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు.. ఫోన్ వ్యసనం నుంచి సులభంగా బయటపడవచ్చు.!
Phone addiction: చాలా మంది ఫోన్‌కి అతుక్కుపోయి సమయం వృథా చేస్తున్నామని బాధపడుతుంటారు. స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నా, వాటిని పాటించడం కష్టం. కానీ, ఎవరైనా ఈజీగా పాటించగల ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదే "గ్రేస్కేల్ మోడ్". ఇది మీ ఫోన్‌ని వెంటనే ఆకర్షణ లేకుండా చేస్తుంది. రంగులు లేకుండా అంతా డల్‌గా, బోరింగ్‌గా అనిపిస్తుంది. ఫోన్ వాడకం తగ్గించడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.
* గ్రేస్కేల్ మోడ్ అంటే..
గ్రేస్కేల్ అనేది మీ ఫోన్ డిస్‌ప్లేను బ్లాక్ అండ్ వైట్‌లోకి మార్చే సెట్టింగ్. రంగులు లేకపోతే, అన్నీ చప్పగా, జీవం లేకుండా కనిపిస్తాయి. సోషల్ మీడియా ఐకాన్లు వాటి రంగుల ఆకర్షణను కోల్పోతాయి. ఫొటోలు, వీడియోలు కూడా రంగులు లేకుండా అంతగా కనిపించవు. ఒకప్పుడు కంటికి ఇంపుగా అనిపించిన కంటెంట్ కూడా డల్‌గా మారుతుంది.

ఎందుకంటే మన మెదడు రంగులకు సహజంగా ఆకర్షిస్తుంది. రంగులు మనలో భావోద్వేగాలను రేకెత్తిస్తాయి, మనల్ని ఎక్కువసేపు ఫోన్‌లో ఉండడానికి ప్రోత్సహిస్తాయి. రంగులు తీసేస్తే, మీ ఫోన్ వెంటనే తక్కువ ఉత్తేజకరంగా మారుతుంది. దీనివల్ల మీరు ఫోన్‌లో అనవసరంగా సమయం వృథా చేయకుండా ఉంటారు.
* ఐఫోన్‌లో గ్రేస్కేల్ మోడ్‌ను ఎలా ఆన్ చేయాలి?
ఐఫోన్‌లో గ్రేస్కేల్ మోడ్‌ను ఆన్ చేయడం చాలా సులువు, దాన్ని ఎలా ఆన్ చేయాలంటే ముందుగా సెట్టింగ్స్‌కి వెళ్లండి → యాక్సెసిబిలిటీ → డిస్‌ప్లే & టెక్స్ట్ సైజ్ → కలర్ ఫిల్టర్స్‌కు వెళ్లాలి. కలర్ ఫిల్టర్స్‌ను టోగుల్ ఆన్ చేసి, గ్రేస్కేల్‌ను ఎంచుకోవాలి. మీ స్క్రీన్ వెంటనే బ్లాక్ అండ్ వైట్‌లోకి మారుతుంది.
ప్రతిసారి ఈ స్టెప్స్ రిపీట్ చేయకుండా ఉండటానికి, మీరు షార్ట్‌కట్ క్రియేట్ చేసుకోవచ్చు. యాక్సెసిబిలిటీకి తిరిగి వెళ్లండి → యాక్సెసిబిలిటీ షార్ట్‌కట్. ఆపై కలర్ ఫిల్టర్స్‌ను ఎంచుకోండి. ఇప్పుడు, మీరు సైడ్ బటన్‌ను (లేదా పాత మోడళ్లలో హోమ్ బటన్) మూడుసార్లు క్లిక్ చేయడం ద్వారా గ్రేస్కేల్‌ను త్వరగా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.
* ఆండ్రాయిడ్‌లో గ్రేస్కేల్ మోడ్‌ను ఎలా ఆన్ చేయాలి?
ఫోన్ బ్రాండ్‌ను బట్టి స్టెప్స్ కొద్దిగా మారుతాయి. గూగుల్ పిక్సెల్ యూజర్లు సెట్టింగ్స్‌కి వెళ్లి → యాక్సెసిబిలిటీ → కలర్ అండ్ మోషన్ → కలర్ కరెక్షన్ కు వెళ్లాలి. "యూజ్ కలర్ కరెక్షన్" ఆప్షన్‌ను టోగుల్ ఆన్ చేసి, గ్రేస్కేల్‌ను ఎంచుకోండి.
దీన్ని సులభతరం చేయడానికి, క్విక్ సెట్టింగ్స్‌కు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అందుకు కలర్ కరెక్షన్‌కి తిరిగి వెళ్లాలి → కలర్ కరెక్షన్ షార్ట్‌కట్‌ను టోగుల్ చేయాలి. గ్రేస్కేల్ టోగుల్‌ను మీ ప్యానెల్‌కు జోడించడానికి క్విక్ సెట్టింగ్స్‌ను ఎంచుకోవాలి. అంతే అది చాలా సులభంగా యాక్సిస్ చేయడానికి అందుబాటులో ఉంటుంది.
* శాంసంగ్ గెలాక్సీ కోసం
శాంసంగ్ యూజర్లు సెట్టింగ్స్‌కి వెళ్లండి → యాక్సెసిబిలిటీ → విజన్ ఎన్‌హాన్స్‌మెంట్స్ → కలర్ కరెక్షన్ దాన్ని ఆన్ చేసి, గ్రేస్కేల్‌ను ఎంచుకోవాలి. సులువుగా యాక్సెస్ చేయడానికి, క్విక్ సెట్టింగ్స్‌కు యాడ్ చేయవచ్చు. కలర్ కరెక్షన్‌కి తిరిగి వెళ్లండి → కలర్ కరెక్షన్ షార్ట్‌కట్‌ను ఎనేబుల్ చేయండి. క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్‌లో ట్యాప్ బటన్‌ను ఎంచుకోండి.
* గ్రేస్కేల్ ఎలా పనిచేస్తుంది?
గ్రేస్కేల్ మీ ఫోన్ విజువల్ అప్పీల్‌ను తగ్గిస్తుంది, రంగుల యాప్‌లను స్క్రోల్ చేయడం లేదా వీడియోలు చూడటం అంత ఆనందంగా ఉండదు. ప్రకాశవంతమైన, కంటికి ఆకట్టుకునే రంగులు లేకుండా, మీరు గుడ్డిగా బ్రౌజ్ చేసే అవకాశం తక్కువ. దీనివల్ల మీరు మీ ఫోన్‌లో తక్కువ సమయం గడపడానికి సహాయపడుతుంది. ఒక్కసారి ట్రై చేయండి మీ ఫోన్ ఎంత తక్కువ అడిక్టివ్‌గా అనిపిస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.


Click it and Unblock the Notifications








