ఫోన్ సిగ్నల్ రావడం లేదా..ఈ టిప్స్ ట్రై చేయండి
నేడు ఇండియాలో ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు..రోజు రోజుకు ఫోన్ల వాడకం పెరిగిపోతుందే కాని తగ్గడం లేదు. అయితే ఫోన్ల వాడకం పెరిగే కొద్ది వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. కాల్స్ డ్రాప్ అవడం, సరిగ్గా కనెక్ట్ అవకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కొన్ని సార్లు టవర్ ఉన్నప్పటికీ సిగ్నల్ సరిగా రాదు. అలాంటి సమయంలో మీరు కొన్ని టిప్స్ పాటించారంటే మీ ఫోన్‌లో సిగ్నల్ పెరిగే అవకాశం ఉంది.
ఆఫర్ 2 రోజులే: 4జిబి ర్యామ్ ఫోన్ రూ. 11 వేలు తగ్గింది

టిప్ 1
మీ ఫోన్‌లో సిగ్నల్ రాకుంటే డివైస్‌ను ఒకసారి ఆపేసి మళ్లీ ఆన్ చేయండి. ఆన్ చేసిన సమయంలో ఫోన్ కొత్త టవర్ ని వెతికే క్రమంలో మీకు సిగ్నల్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉండకుండా చూసుకోండి.

టిప్ 2
బ్యాటరీ తక్కువగా ఉన్నా సిగ్నల్ సరిగా రాదు. కాబట్టి బ్యాటరీ తక్కువగా ఉంటే వెంటనే ఛార్జింగ్ పెట్టండి. చార్జింగ్ అందుబాటులో లేకపోతే ఫోన్‌లో ఉన్న బ్యాటరీ సేవింగ్ మోడ్‌లను ఆఫ్ చేయాలి. దీంతో సిగ్నల్ పెరుగుతుంది. కాల్స్ చేసుకోగానే మళ్లీ బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయాలి. లేదంటే తక్కువగా ఉన్న బ్యాటరీ ఇంకా ఫాస్ట్‌గా ఖర్చవుతుంది.

టిప్ 3
ఫోన్ సిగ్నల్ యాంటెన్నా అన్ని ఫోన్లకు వెనక ఉంటుంది. కొన్ని ఫోన్లకు పై భాగంలో మరికొన్ని ఫోన్లకు కింది భాగంలో ఉంటుంది. ఈ రెండు ప్రదేశాలను మీ చేతులతో కప్పేయకుంటే ఫోన్ సిగ్నల్ పెరుగుతుంది.

టిప్ 4
ఓపెన్ ప్రదేశంలో సిగ్నల్ ఎక్కువగా వస్తుంది. అక్కడ కాల్ చేసుకునేందుకు ప్రయత్నించండి. రూముల్లో అలాగే చెట్ల మధ్యలో సిగ్నల్ సరిగా రాదు. ఇంకా మీరు బిల్డింగ్ మీదకెక్కి కాల్ చేస్తే సిగ్నల్ మరింతగా వచ్చే అవకాశం ఉంటుంది.

టిప్ 5
మీరు కాల్ చేసే సమయంలో అటు ఇటూ కదులుతూ మాట్లాడండి. సిగ్నల్ పెరుగుతుంది.

టిప్ 6
కాల్ మాట్లాడే సమయంలో గుండ్రగా తిరుగుతూ మాట్లాడటం వల్ల కూడా మీ ఫోన్ సిగ్నల్ మరింతగా మెరుగుపడే ఛాన్స్ ఉంది.

టిప్ 7
పై చిట్కాలు పాటించినా మీ ఫోన్ లో సిగ్నల్ రాలేదంటే సిమ్ తీసి వేరే ఫోన్ లో వేసి చెక్ చేసుకోంటి. అలాగే నెట్ వర్క్ ని ఓ సారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సమస్య ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications








